Gutta Jwala: బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థులను తన ప్రతిభతో మట్టికరిపించిన గుత్తా జ్వాల, ఇప్పుడు ఒక తల్లిగా పసిపాపలకు ప్రాణదాతగా మారింది. గత నాలుగు నెలల్లో 30 లీటర్ల తల్లి పాలను దానం చేసి అరుదైన సేవను అందించారు. ప్రస్తుతం ఆమె రోజూ సుమారు 600 మిల్లీలీటర్ల పాలను ప్రభుత్వ ఆస్పత్రులలోని శిశువులకు పంపిస్తున్నారు. Gutta Jwala
జ్వాల చేసిన ఈ నిర్ణయం కేవలం ఒక దాతృత్వం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే పోరాటం. పుట్టిన వెంటనే తల్లి పాల అందని శిశువులు, ఆరోగ్య సమస్యల కారణంగా తల్లి పాలను తాగలేని చిన్నారుల కోసం ఇది నిజంగా అమృతం. తన బిడ్డకు పాలు తాగించిన తర్వాత మిగిలిన పాలను దానం చేసే నిర్ణయానికి తన ఫ్యామిలీ డాక్టర్ మంజుల అనగాని ప్రోత్సాహం ఇచ్చారని జ్వాల తెలిపారు.
వ్యక్తిగత జీవితంలో కూడా జ్వాల ఒక అందమైన అధ్యాయాన్ని సృష్టించారు. 2021 ఏప్రిల్ 22న నటుడు విష్ణు విశాల్‌తో పెళ్లి అయిన ఆమె, నాలుగు సంవత్సరాల తర్వాత అదే రోజున పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు తల్లి హృదయంతో చేసిన ఈ అరుదైన సేవకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవీ చదవండి: K Ramp : కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ ఫస్ట్ లుక్.. దీపావళికి!
Congress : దూసుకుపోతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు.. తలసరి ఆదాయంలో తెలంగాణ, కర్ణాటక టాప్
