HomeInternationalZoo video : వామ్మో.. జూలో సింహాల దాడి! సఫారీ వాహన డ్రైవర్‌ను...

Zoo video : వామ్మో.. జూలో సింహాల దాడి! సఫారీ వాహన డ్రైవర్‌ను…

Zoo video : థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ ఓపెన్ ఎయిర్ జూలో రోమాంచకంతో పాటు భయానక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. 20 ఏళ్లుగా జూకీపర్‌గా పనిచేస్తున్న జియన్ రంగ ఖరాసమీ అనే వ్యక్తిపై సింహాలు దాడి చేసి ముక్కలుగా పీక్కుతిన్న ఘటన సంచలనం రేపుతోంది. Zoo video

ఖరాసమీ రోజూ జంతువులకు ఆహారం పెట్టడమే కాకుండా పర్యాటకులను సఫారీ వాహనంలో జంతువులను చూపిస్తూ ఉండేవాడు. ఇటీవల పర్యాటకులను తీసుకుని సింహాల దగ్గరకు వెళ్లినప్పుడు, వాహనంలోనుంచి బయటికి దిగడం అతనికి ప్రాణాంతకమైంది. అక్కడే ఉన్న ఒక సింహం ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. వెంటనే మరికొన్ని సింహాలు చేరి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

పర్యాటకులు ఆ సమయంలో వాహనంలోనే భయంతో కూర్చున్నారు. వాహనం హారన్ కొట్టి సింహాలను తరిమేందుకు ప్రయత్నించినా అవి వెళ్లలేదు. దాదాపు 15 నిమిషాల పాటు సింహాలు అతని శరీరభాగాలను పీక్కుతింటూ భయంకర దృశ్యాలను సృష్టించాయి. చివరకు జూకీపర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జూ యాజమాన్యం, మరణించిన ఖరాసమీ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది.

ఇవీ చదవండి:

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు