Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం OG కోసం అభిమానుల్లో ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా క్రేజ్ స్పష్టమవుతోంది. Pawan Kalyan
ఉత్తర అమెరికాలో OG ప్రీమియర్ షో టిక్కెట్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో సాగుతున్నాయి. ఇప్పటికే 45,000 కంటే ఎక్కువ టిక్కెట్లు విక్రయించబడ్డాయని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. దీంతో ప్రీమియర్ ప్రీ-సేల్స్ ద్వారా $1 మిలియన్ గ్రాస్ మార్క్‌ను దాటింది. ఇది పవన్ కళ్యాణ్ స్టార్ పవర్‌కు నిదర్శనం.
సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగులో విలన్‌గా అరంగేట్రం చేస్తుండగా, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న OG ఇప్పటికే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోలకే ఇంతటి క్రేజ్ రావడం ఈ సినిమాపై అభిమానుల పిచ్చి ఎంత ఉందో మరోసారి నిరూపించింది.
ఇవీ చదవండి: Pawan Kalyan : పవన్ ప్రేయసి.. రామ్ చరణ్ అక్కగా నటించిన భామ ఎవరో తెలుసా?
Pawan Kalyan : సూపర్ సిక్స్-సూపర్ హిట్.. పార్టీలు వేరైనా ప్రజాశ్రేయస్సే లక్ష్యం : పవన్ కల్యాణ్
