HomeCinemaMannara Chopra: వర్షంలో డ్యాన్స్.. మన్నారా చోప్రాపై దారుణమైన ట్రోలింగ్

Mannara Chopra: వర్షంలో డ్యాన్స్.. మన్నారా చోప్రాపై దారుణమైన ట్రోలింగ్

Mannara Chopra: ప్రముఖ నటి, కథానాయిక మన్నారా చోప్రా వర్షంలో డ్యాన్స్‌ చేయడంపై ఫ్యాన్స్‌ భగ్గుమన్నారు. ముంబైలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, షూటింగ్‌ మధ్యలో గ్యాప్‌ దొరికిందని డ్యాన్సులు చేస్తోందంటూ అభిమానులు మన్నారా చోప్రా వీడియోపై ట్రోలింగ్‌కు దిగారు.

ముంబైలో సోమవారం కురిసిన ఈదురుగాలులు, భారీ వర్షాలకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 64 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఇదే సమయంలో మన్నారా చోప్రా తన డ్యాన్స్‌ వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పెట్టడంతో వివాదం తలెత్తింది.

వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ 17లో చివరిసారిగా కనిపించిన మన్నారా చోప్రా.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సోమవారం మే 13న ముంబైని దుమ్ము తుఫాను ముంచెత్తింది. ఇదే సమయంలో మన్నారా చోప్రా డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేయడం విమర్శలకు దారితీసింది. మహారాష్ట్ర రాజధానిలో భారీ వర్షాల తర్వాత 100 అడుగుల బిల్‌బోర్డ్ కూలిపోయింది.

మన్నారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 2024 రొమాంటిక్ కామెడీ తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా నుంచి అఖియాన్ గులాబ్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. క్లిప్‌తో పాటు, “మొదటి వర్షాన్ని ఆస్వాదిస్తున్నాను!! షూట్ రోజు మధ్యలో” అని రాసింది. దీనిపై కొందరు భిన్నంగా స్పందించారు.

ఆమె వీడియోపై స్పందిస్తూ ఒక నెటిజన్.. “భవనాలు కూలిపోయాయి, ప్రజలు ఆసుపత్రిలో ఉన్నారు. కొంతమంది చనిపోయి ఉండవచ్చు. మరికొంతమంది ఇప్పటికీ శిథిలాల్లో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి. ఈ సమయంలో డ్యాన్సులా?” అని రాశారు. “14 మంది మరణించారు.. ఆమె డ్యాన్స్ చేస్తోంది..” అని మరొకరు కామెంట్ చేశారు. “ఇక్కడ అందరూ టెన్షన్‌గా ఉన్నారు.. ఆమె డ్యాన్స్ చేయడం గురించి ధ్యాస పెడుతున్నారు.. అని మరొక కామెంట్ వెలిసింది.

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌ బాస్ షోలో మన్నారా చోప్రా గ్రాండ్ ఫినాలేకు వెళ్లిన సంగతి తెలిసిందే. మొదటి రన్నరప్ అభిషేక్ కుమార్, విజేత మునావర్ ఫరూఖీ చేతిలో ఓడి సెకండ్ రన్నరప్‌గా ఆమె అప్పట్లో నిలిచింది. మన్నారా చోప్రా… ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల కజిన్. కొన్ని హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లోనూ నటించింది.

వీడియో ఈ లింక్‌లోకి వెళ్లి చూడండి…

ఇవీ చదవండి: Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌
Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్‌ తివారి ఫొటో గ్యాలరీ..
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్‌ హాట్‌ ఫొటో షూట్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు