HomeAndhra PradeshTelugu Student Murder : నోయిడాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. ఆపై!

Telugu Student Murder : నోయిడాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. ఆపై!

Telugu Student Murder : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్‌ దివ్వెల రత్తయ్య కుమారుడు దీపక్ కుమార్ (22) ను అతని రూమ్‌మేట్, ఆగ్రాకు చెందిన దేవాన్ష్ చౌహాన్ (23) తుపాకీతో కాల్చిచంపాడు. అనంతరం చౌహాన్ కూడా తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. Telugu Student Murder

ఈ ఘటన నాలెడ్జ్ పార్క్-IIIలోని RCI విద్యా విహార్ హాస్టల్లో మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇద్దరూ **బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (బిమ్‌టెక్)**లో PGDM కోర్సు చదువుతున్నారు. ఒకే గదిలో ఉంటూ వచ్చిన వీరిద్దరి మధ్య ఉదయం వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కొద్ది సేపటికే గదిలో నుంచి కాల్పుల శబ్దం వినిపించడంతో హాస్టల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీపక్ తలలో బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దేవాన్ష్‌ను ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు.

పోలీసుల ప్రకారం, ఘటనలో ఉపయోగించిన రివాల్వర్ దేవాన్ష్ తండ్రి సురేందర్ సింగ్ చౌహాన్ది. ఆయన యూపీ ఎస్టీఎఫ్‌లో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తుపాకీని దొంగచాటుగా తీసుకువచ్చిన దేవాన్ష్, హాస్టల్‌కు చేరుకున్న రెండు గంటలకే ఈ ఘటన జరిపినట్లు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీపక్ కుమార్ మృతి వార్త తెలిసిన వెంటనే అతని కుటుంబ సభ్యులు నోయిడాకు చేరుకున్నారు.

ఇవీ చదవండి: Tamilnadu Crime : 15 ఏళ్లుగా సర్పంచ్.. చోరీల బ్యాగ్రౌండ్ తెలిసి షాక్!
Telangana Crime : ప్రియుడితో కలిసి నా భార్య నన్ను చంపాలని..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు