HomeInternationalModi Trump : మోదీ నాకు మంచి ఫ్రెండ్.. ఫోన్ చేసి సెట్ చేస్తా!

Modi Trump : మోదీ నాకు మంచి ఫ్రెండ్.. ఫోన్ చేసి సెట్ చేస్తా!

Modi Trump : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి చైనా పర్యటన అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, “భారత్‌తో పాటు రష్యాను కూడా కోల్పోయాం” అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి భారత్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. త్వరలో మోదీతో ఫోన్‌లో మాట్లాడి, వాణిజ్య సంబంధాలపై కీలక చర్చలు జరపనున్నట్లు తెలిపారు. Modi Trump

వాణిజ్య సంబంధాలపై ట్రంప్ దృష్టి
భారత్–అమెరికా మధ్య ఇటీవల 50 శాతం సుంకాలు, రష్యా నుండి చమురు దిగుమతులు వంటి అంశాలపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లోనే ట్రంప్, “భారత్ – అమెరికా వాణిజ్య అడ్డంకులను తొలగించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో నా మంచి స్నేహితుడు ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నాను. ఈ చర్చలు ఇరు దేశాలకు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి” అని వ్యాఖ్యానించారు.

మోదీ – ట్రంప్ ఈక్వేషన్
గతంలో కూడా ట్రంప్ భారత్–అమెరికా సంబంధాలను “ప్రత్యేకమైనవి”గా వర్ణించారు. “మోదీ, నేను మంచి స్నేహితులం. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాం” అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అయితే మోదీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. “ఆయన చేసే ప్రతి పని నాకు నచ్చకపోవచ్చు, కానీ మోదీ ఒక గొప్ప నాయకుడు” అని అన్నారు.

దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ, ట్రంప్ వ్యాఖ్యలను అభినందించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాబోయే మోదీ – ట్రంప్ సంభాషణ తర్వాత వాణిజ్య ఒప్పందాలు, ఇతర వ్యూహాత్మక అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి: Jerusalem Attack : జెరూసలేంలో ఉగ్రదాడి: ఆరుగురు మృతి.. ఖండించిన మోదీ
GST Good News : మోదీ పన్ను సంస్కరణలు.. షాంపూలు, హైబ్రిడ్ కార్లు, టీవీలపై పన్నులు తగ్గింపు
Trump on India : ఇండియాపై మళ్లీ ట్రంప్‌ ఫైర్.. టారిఫ్‌లతో చంపేస్తోంది!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు