HomeCinemaAllu Arjun : టైమ్ చూసి కొట్టిన అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి ఎదురుగా పవర్...

Allu Arjun : టైమ్ చూసి కొట్టిన అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి ఎదురుగా పవర్ ఫుల్ డైలాగ్!

Allu Arjun : పుష్పరాజ్.. అస్సలు తగ్గేదే ల్యా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా నరుకుతా…! ఇవీ అల్లు అర్జున్ వరల్డ్ ఫేమస్ డైలాగ్స్. పుష్ప సినిమాలో విలన్లను గడగడలాడించిన పుష్పరాజ్.. నిజజీవితంలోనూ సమయం వచ్చినప్పుడు తానేంటో చూపించాడంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డుల వేడుకగా ఈ హటాత్పరిణామం చోటు చేసుకుంది. సినీ, రాజకీయ వర్గాల్లో అల్లు అర్జున్ (Allu Arjun) డైలాగ్ ఇప్పుడు కలకలం రేపుతోంది.

గతంలో పుష్ప2 సినిమా వేడుక సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను కక్షగట్టి రేవంత్ రెడ్డి అరెస్టు చేయించాడన్న ఆరోపణలు వచ్చాయి. ఒకరోజు రాత్రంతా జైలులో గడిపేలా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, అల్లు అరవింద్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ వివరణ ఇచ్చుకున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. ఆరోజు జరిగిన అవమానానికి అల్లు అర్జున్ ఇవాళ సమయం చూసి రేవంత్ రెడ్డి ఎదురుగా పుష్ప 2 డైలాగ్ చెప్పాడన్న విశ్లేషణలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం దాదాపు 14 సంవత్సరాల తర్వాత నిర్వహించిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ‘పుష్ప’ స్టైల్‌తో సభను ఉర్రూతలూగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్, స్టేజ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుగా “పుష్పరాజ్.. అస్సలు తగ్గేదే లే” అనే బ్లాక్‌బస్టర్ డైలాగ్‌ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, గద్దర్ అవార్డులను ప్రతి ఏడాది నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. వేడుకకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నటులు నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, దర్శకులు రాజమౌళి, సుకుమార్, సీనియర్ నటీమణులు జయసుధ, సుహాసిని, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు హాజరయ్యారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ, “గద్దర్ గారి పేరిట అవార్డు రావడం గొప్ప విషయం. ఈ అవార్డు నాకు బాధ్యతను గుర్తు చేస్తుంది. ‘పుష్ప 2’ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు,” అన్నారు. ఈ కార్యక్రమంలో ‘పుష్ప 2’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌లు కూడా అవార్డులు అందుకున్నారు.

ఇవీ చదవండి: Allu Arjun: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. ఏమైందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు