Actor Darshan : రేణుక స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. గతేడాది ఈ కేసులో అతను అరెస్టయ్యాడు. మొదట కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసి, జైలులో ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వొద్దని ఆదేశించింది. దీంతో ఒకప్పుడు స్టార్ హీరోగా లగ్జరీ లైఫ్ గడిపిన దర్శన్, ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలులో జీవిస్తున్నాడు. Actor Darshan
ఇక తాజాగా, దర్శన్ బెంగళూరులోని 57వ CCH కోర్టులో ఒక వినతి పత్రం దాఖలు చేశాడు. అదనపు దిండు, బెడ్‌షీట్ కోసం చేసిన ఈ దరఖాస్తుపై మంగళవారం (సెప్టెంబర్ 09) విచారణ జరిగింది. వీడియో కాల్ ద్వారా హాజరైన దర్శన్, జడ్జి ముందు ఒక ఆశ్చర్యకరమైన విన్నపం చేశాడు.
“సూర్యోదయాన్ని చూసి నెలరోజులు దాటిపోయింది. సూర్యకాంతి అందకపోవడంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. బట్టలు దుర్వాసన వస్తున్నాయి. ఇలా నేను బతకలేను. దయచేసి ఒక చుక్క విషం ఇవ్వండి.. చనిపోతాను. జీవితం దుర్భరంగా మారిపోయింది” అని జడ్జికి చెప్పాడు దర్శన్.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి, “ఇలాంటి విన్నపాలు మీరు చేయకూడదు. ఇది సాధ్యం కాదు. అయితే జైలు అధికారులు చూసుకోవాల్సిన విషయాలపై మేము ఆదేశాలు ఇస్తాం” అని తెలిపారు. అనంతరం విచారణను వాయిదా వేశారు.
ఇవీ చదవండి: Vallabhaneni Vamsi : 4 నెలల జైలు జీవితానికి తెర.. వల్లభనేని వంశీకి భారీ ఊరట
Singapore Ex Minister iswaran: సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వర్‌ను జైలు.. ఆయన కథేమిటి?
