Tollywood News : పాన్ ఇండియా సినిమాల జోరులో స్టార్ హీరోయిన్‌కి ఒక బడా సినిమాలో ఛాన్స్ రావడం అంటే బంపర్ ఆఫర్ లాంటి మాటే. అలాంటి అవకాశాల కోసం ఎంతో మంది హీరోయిన్లు కృషి చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు హీరోయిన్ల అందమే వారికి చేటుగా మారుతోంది. అద్భుతమైన అందంతో పాటు స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో అదే ప్రధాన కారణంగా సినిమా అవకాశాలను కోల్పోతున్నారు. (Tollywood News)
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లో చోటు దక్కించుకుందన్న వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ రావణుడి భార్య మండోదరీ పాత్రలో నటించనుందని ప్రచారం జరిగింది.
అయితే ఈ కాస్టింగ్ పై నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. “ఇంట్లో కాజల్ లాంటి అందమైన భార్య ఉండగా రావణుడు సీతపై కన్నెత్తి చూడటమా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. దీంతో ఈ పాత్రపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. దాంతో మేకర్స్ మళ్లీ ఆలోచనలో పడ్డారని, చివరకు కాజల్‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని బాలీవుడ్ టాక్.
ఈ పరిణామంతో కాజల్ అందమే ఆమెకు ఈ ఛాన్స్‌ను చేజార్చేసిందన్న అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ఇండస్ట్రీలో మాత్రం ఇదే చర్చ నడుస్తోంది.
ఇవీ చదవండి: Kannappa Box Office Day 1: కన్నప్ప.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..!
Kannappa Movie Review : కన్నప్ప మూవీ రివ్యూ, రేటింగ్.. భక్తి, యాక్షన్, ఎమోషన్స్!
Spirit : స్పిరిట్.. ప్రభాస్-త్రిప్తి డిమ్రి రొమాంటిక్ సీన్స్.. పవర్‌ఫుల్ పోలీస్!
Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు
