HomeInternationalNepal : నేపాల్‌లో అల్లర్లు.. సోషల్‌ మీడియాపై నిషేధం – ఖాట్మండులో కర్ఫ్యూ

Nepal : నేపాల్‌లో అల్లర్లు.. సోషల్‌ మీడియాపై నిషేధం – ఖాట్మండులో కర్ఫ్యూ

Nepal : నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. పార్లమెంట్‌లోకే దూసుకెళ్లిన నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఖాట్మండులో కర్ఫ్యూ విధించింది. అదనంగా, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం అమలు చేసింది. Nepal

“Gen-Z” పేరుతో యువత ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం రాజధానితో పాటు విరాట్‌నగర్‌, భరత్‌పూర్‌, పోఖ్రా సహా 10 నగరాల్లో తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు వినియోగించారు. ప్రధాని కె.పి. శర్మ ఓలి పాలనను నిరసిస్తూ యువత రోడ్డెక్కింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మానవహక్కుల సంఘాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వాక్ స్వేచ్ఛను అణచివేస్తున్నారని, మీడియా స్వాతంత్ర్యాన్ని ఉక్కుపాదంతో నలిపేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

కమ్యూనికేషన్స్‌ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, కోర్టు ఆదేశం మేరకు సోషల్‌ మీడియా కంపెనీలు దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏడు రోజుల గడువు ఇచ్చినా, టిక్‌టాక్‌ సహా ఐదు కంపెనీలు మాత్రమే ఆ గడువులో నమోదు చేసుకున్నాయి. మిగిలినవన్నీ విఫలమవ్వడంతో 26 యాప్‌లపై నిషేధం విధించామని స్పష్టం చేసింది.

సోషల్‌ మీడియా, మెసేజింగ్ యాప్‌లపై అధికంగా ఆధారపడుతున్న ప్రజలు—ప్రత్యేకించి విదేశాల్లో పనిచేస్తున్న కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్‌ అయ్యే వారిపై ఈ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇవీ చదవండి: Microsoft Edge : ఏఐతో బ్రౌజింగ్‌కు కొత్త దిశ.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ‘Copilot Mode’
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు