HomeCinemaSamarasimha Reddy: సమరసింహారెడ్డి మూవీని వదులుకున్న స్టార్ హీరో!

Samarasimha Reddy: సమరసింహారెడ్డి మూవీని వదులుకున్న స్టార్ హీరో!

Samarasimha Reddy: నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో నిలిచిపోయే మైలురాళ్లలో ఒకటి సమరసింహా రెడ్డి. 1999 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించి, అప్పటి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.15 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. (Samarasimha Reddy)

బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో సాగి, ఆ తరహా సినిమాలకు కొత్త దారులు వేసింది. అంజలా ఝవేరి, సిమ్రాన్, సంఘవి హీరోయిన్లుగా నటించగా, బాలకృష్ణ తన పవర్‌ఫుల్ నటనతో తెరపై విరుచుకుపడ్డాడు. మణిశర్మ సంగీతం, శక్తివంతమైన డైలాగులు, ఘాటైన యాక్షన్ సన్నివేశాలు.. కలిపి ‘సమరసింహా రెడ్డి’ను అఖండ విజయవంతం చేశాయి.

227 రోజులు మూడు థియేటర్లలో, 175 రోజులు 29 కేంద్రాల్లో, 50 రోజులు 122 కేంద్రాల్లో ప్రదర్శించబడుతూ ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌కు మాసివ్ బూస్ట్ ఇచ్చింది. ఈ మూవీ విజయంతో తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాల జోరు మరింత పెరిగింది. తర్వాత బాలయ్య నటించిన నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమ సింహం లాంటి సినిమాలు కూడా ఇదే తరహా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కాయి. చిరంజీవి ఇంద్ర, వెంకటేష్ జయం మనదేరా వంటి చిత్రాలు కూడా ఈ జానర్ ప్రభావం పొందాయి.

కానీ, ఈ సినిమా మొదట నుంచే బాలయ్య కోసం రాసిందని కాదు. అసలుకు దర్శకుడు బి.గోపాల్ ఈ కథను మొదట విక్టరీ వెంకటేష్‌కి వినిపించారట. వెంకీకి కథ బాగా నచ్చినా, ఫ్యాక్షన్ జానర్ తన ఇమేజ్‌కి సరిగ్గా సరిపడదని భావించి, మర్యాదపూర్వకంగా తిరస్కరించాడట. అంతేకాదు, ఈ కథ బాలకృష్ణకి బాగా సూటవుతుందని స్వయంగా సూచించాడట. దాంతో కథ బాలయ్య వద్దకు వెళ్లి, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సమరసింహా రెడ్డి తెరపైకి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇవీ చదవండి: Akhanda 2 : బాలకృష్ణ అఖండ 2 లేటెస్ట్ అప్ డేట్ ట్రెండింగ్
Aditya 369: బాలయ్య ఆదిత్య369 సీక్వెల్ టైటిల్ అదేనా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు