HomeCinemaOTT Movie : క్రైమ్ థ్రిల్లర్: 9 హత్యలు, హింట్లు వదిలే సైకో కిల్లర్ కథ!

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్: 9 హత్యలు, హింట్లు వదిలే సైకో కిల్లర్ కథ!

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మలయాళ దర్శకులు ఈ జానర్‌లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, అంచనా వేయలేని ట్విస్టులతో కొత్త స్థాయికి తీసుకెళ్తున్నారు. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలో కూడా వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటి మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌లో ఒకటి ‘అబ్రహామింటే సంతతికల్’. ఈ సినిమా తెలుగులో ‘డెరిక్ అబ్రహాం’గా రిలీజ్ అయింది. (OTT Movie)

కథేమిటంటే..
కేరళలోని ఎర్నాకులంలో వరుసగా తొమ్మిది హత్యలు జరుగుతాయి. వీటన్నింటికీ ఒక సైకో కిల్లర్ కారణమని పోలీసులు అనుమానిస్తారు. కేసును చేధించేందుకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ డెరిక్ అబ్రహాం (మమ్ముట్టి) రంగంలోకి దిగుతాడు. హత్యల సమయంలో కిల్లర్ కొన్ని హింట్స్ వదిలేస్తుంటాడు. అతను క్రైస్తవ మతానికి కట్టుబడిన ఎక్స్‌ట్రీమిస్ట్, లక్ష్యం నాస్తికులే అని పోలీసులు తెలుసుకుంటారు.

దర్యాప్తులో భాగంగా బ్రదర్ సైమన్ అరెస్ట్ అవుతాడు. తన టార్గెట్ 10 మంది అని చెప్పేస్తాడు కూడా! కానీ అనూహ్యంగా ఒక ప్రీస్ట్ హత్య జరుగుతుంది. దీనికి డెరిక్ నిర్లక్ష్యమే కారణమని అతన్ని సస్పెండ్ చేస్తారు.

ఇదే సమయంలో డెరిక్ తమ్ముడు ఫిలిప్ (ఆన్సన్ పాల్) తన ప్రేయసి అలీనా హత్య కేసులో నిందితుడవుతాడు. అన్నయ్య పోలీస్ అయినా, తమ్ముడిపై ప్రేమ ఉన్నా.. డ్యూటీ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేడు డెరిక్. ఇదే పరిస్థితిని ఉపయోగించుకుని డెరిక్‌పై పగ పెంచుకున్న దినేష్, జాకబ్ అనే పోలీసులు – లాయర్ డయానాతో కలిసి కుట్ర పన్నుతారు. ఫలితంగా ఫిలిప్ జైలుకు వెళ్లిపోతాడు. అక్కడినుంచి తప్పించుకుని అన్నపై రివేంజ్‌కు సిద్ధమవుతాడు.

అయితే అసలు అలీనా మరణం వెనుక ఎవరు? బ్రదర్ సైమన్‌ను ఎవరు చంపారు? అన్నపై పగ ఎందుకు పెట్టుకున్నారు దినేష్, జాకబ్, డయానా? చివరికి డెరిక్ తమ్ముడికి జరిగిన అన్యాయం ఎలా సరిదిద్దుకున్నాడు? అన్నీ తెలుసుకోవాలంటే ఈ ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మిస్ కాకూడదు.

నటీనటులు – ఓటీటీ వివరాలు
షాజీ పడూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు ఆన్సన్ పాల్, కనిహ, సిద్ధీఖ్, రెంజి పణిక్కర్, యోగ్ జపీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ Sun NXT మరియు MX Playerలో స్ట్రీమింగ్‌లో ఉంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. IMDbలో ఈ సినిమాకు 6.7/10 రేటింగ్ వచ్చింది.

ఇవీ చదవండి: OTT Movie: ఓటీటీలో సంచలనం: రూ.2,400 కోట్ల హాలీవుడ్ హర్రర్ మూవీ
OTT Movie: ఓటీటీలో సంచలనం: రూ.2,400 కోట్ల హాలీవుడ్ హర్రర్ మూవీ
Boycott Campa : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ కాంపా.. ఎందుకంటే?
OTT Top Movie: సస్పెన్స్ థ్రిల్లర్ సంచలనం.. ఓటీటీలో టాప్‌లోకి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు