Maratha Reservation: మరాఠా రిజర్వేషన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మనోజ్ జరంగే పోరాటం విజయవంతమైంది. దాదాపు 120 గంటల పాటు కొనసాగిన ఆయన దీక్ష మంగళవారం అధికారికంగా ముగిసింది. ఆగస్టు 29న తెల్లవారుజామున నవీ ముంబై చేరుకున్న జరంగే, అదే రోజు ఉదయం 10 గంటలకు ఆజాద్ మైదాన్‌లో నిరసన ప్రారంభించారు. ఐదు రోజులపాటు కొనసాగిన ఈ నిరసన సెప్టెంబర్ 2న ముగిసింది. ఆయన ఉంచిన ఎనిమిది డిమాండ్లలో ఆరు పాయింట్లను ప్రభుత్వం అంగీకరించింది. Maratha Reservation
క్యాబినెట్ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ స్వయంగా ఆజాద్ మైదాన్ చేరుకొని, జరంగేకు జ్యూస్ ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. దీంతో ఆజాద్ మైదాన్ వద్ద ఐదు రోజులుగా కొనసాగుతున్న నిరసనకు ముగింపు లభించింది. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం, పోలీసులు మధ్యాహ్నం వరకు మాత్రమే సమయం ఇచ్చినా, ప్రభుత్వ ప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో చర్చలు విజయవంతమయ్యాయి.
రాధాకృష్ణ విఖే పాటిల్ (మరాఠా రిజర్వేషన్ సబ్-కమిటీ చైర్మన్) సహా మరికొంతమంది మంత్రులు జరంగేతో చర్చలు జరిపి, ఆయన డిమాండ్లలో ఆరు పాయింట్లను ఆమోదించారు. దీక్ష ముగిసిన వెంటనే ఆజాద్ మైదాన్ వెలుపల వాతావరణం ఒక్కసారిగా మారింది. మద్దతుదారులు విజయోత్సాహంతో నృత్యాలు చేసి సంబరాలు జరుపుకున్నారు.
ప్రభుత్వం అంగీకరించిన జరంగే 6 డిమాండ్లు:
హైదరాబాద్ గెజిట్ అమలు చేయబడుతుంది.
సతారా, ఔంధ్ గెజిట్లు కూడా వర్తిస్తాయి.
ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకుంటారు.
నిరసనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ₹15 కోట్ల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాలు అందజేస్తారు.
గ్రామపంచాయతీ స్థాయిలో 58 లక్షల కుంబి నమోదు చేయబడుతుంది.
వంశపారంపర్య (షిండే) కమిటీ కార్యాలయం, పదవీకాలం పొడిగింపు చేస్తారు.
ఈ పరిణామంతో మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి కొత్త దిశ లభించిందని మద్దతుదారులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి: maharashtra election result: ఆరు నెలలు తిరక్కుండానే మహారాష్ట్రలో సీన్ రివర్స్!
Maharashtra: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమా? శిండేకు పదవీ గండం, ఆశాభంగం?
