HomeNationalmaharashtra election result: ఆరు నెలలు తిరక్కుండానే మహారాష్ట్రలో సీన్ రివర్స్!

maharashtra election result: ఆరు నెలలు తిరక్కుండానే మహారాష్ట్రలో సీన్ రివర్స్!

maharashtra election result: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి (mahayuti) తమ పట్టు నిలబెట్టుకుంది. ఎన్డీయే ప్రభుత్వానికి ఎంపీ సీట్లు తగ్గిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. అయితే, ఆరు నెలలు తిరక్కుండానే అక్కడ ఎన్డీయే కూటమికి ఆధిక్యం రావడం గమనార్హం. (maharashtra election result)

ఓబీసీ సమీకరణ అంశం మహారాష్ట్రలో ఈ ఎన్నికలను ప్రభావితం చేసింది. కీలకమైన మరాఠా ఓటర్లు మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ వైపు కొంత మేర మొగ్గు చూపినట్లు ఎన్డీయే కూటమి గమనించి వ్యూహాలు రచించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ 76 సీట్లలో ముఖాముఖి పోటీ పడ్డాయి.

కొన్నేళ్లుగా పలుచోట్ల జరిగిన ఇలాంటి పోరులో హస్తం పార్టీ పక్షాన సానుకూల ఫలితాలు తక్కువగానే వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 44 సీట్లను గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పడిపోయి 20 లోపే ఉండటం గమనించదగ్గ పరిణామం. బీజేపీ సీట్ల సంఖ్య పెరుగుదల కనిపించింది.

మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయాన్ని దక్కించుకుంది. 288 అసెంబ్లీ సీట్లలో దాదాపు 233 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎంవీఏ కూటమి మాత్రం 50 స్థానాల్లో విజయం సాధించింది.

మరోవైపు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. 81 సీట్లకు గానూ జేఎంఎం కూటమి 56కు పైగా సీట్లతో దూసుకెళ్లింది. బీజేపీ కూటమికి ఇక్కడ 24 సీట్లు మాత్రమే దక్కాయి. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.

కేరళ రాష్ట్రం వయనాడ్ ఎంపీ ఉపఎన్నికలో 4,10,931 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ ఘనవిజయం సాధించింది.

ఇవీ చదవండి: WTC: ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన రిషబ్ పంత్
Jamili Elections: 2026లోనే కొత్త నియోజకవర్గాలు.. 2027లో జమిలి?
AP Elections: ఎన్నికల్లో ఏకపక్ష తీర్పులు దేనికి సంకేతం?! చరిత్ర చెబుతున్న సత్యం..!
Lok Sabha Elections: 140 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓట్లు ఎక్కువ లెక్కించారా?
What is Election Code: ఎన్నికల కోడ్‌ అంటే ఏమిటి? ఏయే అంశాలపై నిషేధం విధిస్తారు?
Andhra Pradesh Elections: ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 ఎంపీ స్థానాలకు 545 మంది పోటీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు