HomeInternationalDonald Trump : నేను చచ్చిపోయానా? ట్రంప్ రియాక్షన్ చూడండి!

Donald Trump : నేను చచ్చిపోయానా? ట్రంప్ రియాక్షన్ చూడండి!

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ట్రంప్‌ బహిరంగంగా కనిపించకపోవడం, ఆయన కుడిచేతిపై గాయాలు ఉండటం వంటి కారణాలతో “అనారోగ్యం, మరణం”పై రకరకాల వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్‌ స్వయంగా స్పందించి, అన్ని వార్తలను “ఫేక్‌ న్యూస్‌”గా కొట్టిపారేశారు. (Doland Trump)

మంగళవారం ఓవల్‌ ఆఫీసులో మీడియా సమావేశానికి హాజరైన ట్రంప్‌ను రిపోర్టర్లు ఆయన ఆరోగ్యంపై ప్రశ్నించారు. “మీరు చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాని గురించి మీకు తెలుసా?” అని అడగగా, ట్రంప్‌ నవ్వుతూ “అవునా? నేను చనిపోయానని అంటున్నారా? నాకు తెలియదు” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని, వీకెండ్‌లో వర్జీనియాలో గోల్ఫ్‌ ఆడానని తెలిపారు. అంతేకాకుండా శనివారం నుంచి సోమవారం వరకు తన ‘ట్రూత్‌ సోషల్’ ఖాతా ద్వారా 90కి పైగా పోస్టులు చేసినట్లు చెప్పారు.

రెండు రోజుల పాటు ఎలాంటి మీటింగ్‌లు లేకపోవడంతోనే ఇలాంటి వదంతులు వచ్చినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. “గత వారం చాలా ప్రెస్‌మీట్‌లు పెట్టాను. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ వచ్చింది. అందుకే ఏదో జరిగిందని అనుకున్నారు” అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ, “బైడెన్‌ అయితే నెలల తరబడి మీటింగ్‌లు పెట్టకపోయేవాడు. కానీ ఆయన ఆరోగ్యంపై ఎవరూ మాట్లాడలేదు” అంటూ ఎద్దేవా చేశారు.

ఇక వైట్‌హౌస్‌ వైద్యులు కూడా ట్రంప్‌ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. ఆయన చేతిపై కనిపిస్తున్న మచ్చలు ఆయన వాడుతున్న ఆస్పిరిన్‌ మందుల దుష్ప్రభావమేనని తెలిపారు. తరచుగా హ్యాండ్‌షేక్‌లు ఇవ్వడం వల్ల గాయాలు వస్తాయని, అవి సహజంగానే మాయమవుతాయని చెప్పారు. అలాగే రక్తప్రసరణ సమస్య (Chronic Venous Insufficiency) కారణంగా ట్రంప్‌ కాళ్లలో వాపు ఉందని, అయితే అది పెద్ద సమస్య కాదని వైద్యులు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: Trump : కథ అడ్డం తిరిగిందా? భారత్ చర్యలతో ట్రంప్ రూటెటు?
TRUMP IS DEAD : ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ వైరల్.. ఏం జరిగింది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు