HomeInternationalTrump : కథ అడ్డం తిరిగిందా? భారత్ చర్యలతో ట్రంప్ రూటెటు?

Trump : కథ అడ్డం తిరిగిందా? భారత్ చర్యలతో ట్రంప్ రూటెటు?

Trump : ఇండియా–అమెరికా ట్రేడ్ రిలేషన్స్ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ‘‘మాతో చేసే వ్యాపారం కంటే, మేము మీతో చేసే వ్యాపారం ఎక్కువ. సుంకాలతో ఆడుకుంటే నష్టపోయేది మీరు’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. (Trump)

“ఇండియాకే ఎక్కువ లాభం” – ట్రంప్ సెటైర్
దశాబ్దాలుగా ఇండియా నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ హాట్ మార్కెట్‌ను వదులుకోవడం ఇండియాకే దురదృష్టమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘‘ఇండియా సుంకాలు పెంచడం వల్ల అమెరికా ఉత్పత్తులు అక్కడ అమ్ముడవ్వలేదు’’
‘‘ఇదంతా ఏకపక్ష నష్టం మాత్రమే’’
‘‘అందుకే ప్రతీకార సుంకాలు మేం వేశాం’’ అని ఆయన సమర్థించుకున్నారు.

రష్యా వైపు చూస్తోన్న ఇండియా?
చమురు, మిలిటరీ ఉత్పత్తుల విషయంలో భారత్ ఎక్కువగా రష్యాపైనే ఆధారపడుతోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికాను పక్కన పెట్టడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడు ఇండియా సుంకాలు తగ్గిస్తామని చెబుతోంది. కానీ ఇది ఏళ్ల కిందటే చేయాల్సింది’’ అంటూ ట్రంప్ విమర్శించారు.

ఎగుమతి–దిగుమతి గణాంకాలు
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు : $79.44 బిలియన్
భారత్ దిగుమతులు అమెరికా నుంచి : $41.5 బిలియన్
మన ఎగుమతులు, దిగుమతుల కంటే దాదాపు రెట్టింపు కావడంతో.. ‘‘మాకన్నా మీకే ఎక్కువ అవసరం’’ అని మైండ్ గేమ్ ఆడుతున్నారు ట్రంప్.

డిప్లమసీలో ట్విస్ట్
షాంఘై సహకార సదస్సు ముందు అమెరికా స్వరం ఒక్కసారిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇండియాను దూషించిన తరువాత, వెంటనే ఫ్రెండ్లీ టోన్‌లోకి మారింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ –
‘‘భారత్–అమెరికా సంబంధాలు కొత్త ఎత్తులకు చేరుకుంటున్నాయి. ఈ నెలలో ఆర్థిక బంధాన్ని మరింత బలపరచబోతున్నాం’’ అని స్పష్టం చేశారు.

సుంకాల డ్రామా తర్వాత అమెరికా భారత్‌తో దౌత్య బంధాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ట్రంప్ తరచూ మారే మాటలపై భారత వర్గాల్లో నమ్మకం అంతగా లేదనేది వాస్తవం.

ఇవీ చదవండి: TRUMP IS DEAD : ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ వైరల్.. ఏం జరిగింది?
PM Modi in China : ఏడేళ్ల తర్వాత చైనాలో మోదీ.. అమెరికాతో వైరం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు