HomeLife StyleLychee : లిచీ ఫ్రూట్స్.. రుచికరం.. ఆరోగ్యానికి వరం!

Lychee : లిచీ ఫ్రూట్స్.. రుచికరం.. ఆరోగ్యానికి వరం!

Lychee : ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించే లిచీ పండ్లు రోడ్డుపక్కన బండ్లపై కూడా తరచూ కనిపిస్తాయి. బయట తొక్క ఎర్రగా, లోపల క్రీమ్‌లాంటి తెల్లని గుజ్జు, మధ్యలో నల్ల విత్తనం ఉండే ఈ పండ్లు తియ్యగా, రుచిగా ఉంటాయి. కానీ రుచి మాత్రమే కాదు, లిచీ పండ్లలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. Lychee

రోగ నిరోధక శక్తికి బలాన్నిచ్చే లిచీ
లిచీ పండ్లలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ఆరోగ్యంగా మెరవడానికి సహాయపడుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్‌ శోషణకు దోహదం చేస్తుంది.

గుండెకు హితమైన లిచీ
లిచీలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దీని వలన గుండె పనితీరు మెరుగుపడుతుంది. రక్తనాళాల్లోని వాపులను తగ్గించే గుణాలు ఉండటంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అంతేకాకుండా, లిచీ పండ్లలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, రుటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, గుండెపోటు, క్యాన్సర్ లాంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

శక్తి స్థాయిలకు బూస్టర్
లిచీలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలు దూరమవుతాయి. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకోవడంలో కూడా లాభం చేకూరుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి ఉపశమనం ఇస్తాయి.

బరువు తగ్గించడంలో సహాయం
బరువు తగ్గాలనుకునే వారికి లిచీ పండ్లు ఒక మంచి ఆప్షన్. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువసేపు ఆకలి రానివ్వదు. దాంతో ఆహారం తక్కువగా తినటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడతాయి.

తినేటప్పుడు జాగ్రత్తలు
లిచీ పండ్లు ఆరోగ్యకరమే అయినా, మితంగా తినాలి. పచ్చి లిచీ పండ్లలో హైపో గ్లైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే పూర్తిగా పండిన లిచీ పండ్లను మాత్రమే తినాలి.

ఇవీ చదవండి: Monsoon Fruits : వర్షాకాలంలో తినకూడని పండ్లు ఏవి?
Dragon Fruit : ఇలాంటి సమస్యలున్న వారు డ్రాగన్ ఫ్రూట్ తినొద్దు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు