Kim Jong Un: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ బీజింగ్‌కి పయనమయ్యారు. అక్కడ జరగనున్న మిలిటరీ పరేడ్‌లో పాల్గొనడం కోసం ఆయన ప్రత్యేకంగా ఈ టూర్ ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా విమానం కాకుండా, కిమ్ ఈసారి తనకు ప్రత్యేకంగా ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ రైలులోనే ప్రయాణిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ నుంచి సోమవారం రాత్రి రైలులో బయలుదేరి ఆశ్చర్యపరిచారు. Kim Jong Un
కీలక నేతలు కూడా తోడుగా
కిమ్ జాంగ్ ఉన్‌తో పాటు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోయి సోన్ హు సహా పలువురు సీనియర్ నాయకులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. కిమ్ 2019 తర్వాత మొదటిసారి చైనాకు వెళ్తున్నారు. 2023లో ఆయన రష్యా పర్యటన చేశారు. ఆ తరువాత ఇదే ఆయనకు తొలి విదేశీ ట్రిప్ కావడం విశేషం.
రెండో ప్రపంచ యుద్ధ వార్షికోత్సవం
ఈసారి చైనాలో జరగనున్న రెండో ప్రపంచ యుద్ధం 80వ వార్షికోత్సవం సందర్భంలో మిలిటరీ పరేడ్ నిర్వహిస్తున్నారు. కిమ్ జాంగ్ ఉన్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ఇవీ చదవండి: Red Lipstick: మీకు తెలుసా? మహిళలు రెడ్ లిప్‌స్టిక్ పూసుకుంటే కారాగారమే..
John Cena: న్యూడ్‌మెన్‌గా మారిన జాన్‌సెనా.. ఆస్కార్ అవార్డుల వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ కోసం తిప్పలు!
