HomeInternationalRed Lipstick: మీకు తెలుసా? మహిళలు రెడ్ లిప్‌స్టిక్‌ పూసుకుంటే కారాగారమే..

Red Lipstick: మీకు తెలుసా? మహిళలు రెడ్ లిప్‌స్టిక్‌ పూసుకుంటే కారాగారమే..

Red Lipstick: మహిళ అందాన్ని మరింత పెంచేదిగా లిప్ స్టిక్ ను అభివర్ణిస్తారు. చాలా దేశాల్లో అనేక రకాల లిప్ స్టిక్స్ ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఎర్రటి లిప్ స్టిక్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీనిపై ఓ దేశంలో మాత్రం కాస్త వెరైటీ రూల్ అమలులో ఉంది. అదే ఉత్తర కొరియా. అక్కడ ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ అమలు చేసే ప్రతి నిబంధనలు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తాయి.

ఎప్పుడూ ప్రజలపై రకం నియమ నిబంధనలు విధిస్తుంటారు. వాటిని పాటించలేక అక్కడి జనం నరకం అనుభవిస్తుంటారు. వేసుకునే దుస్తుల నుంచి హెయిర్ స్టైల్ వరకు ఉత్తర కొరియాలో చాలా కఠిన రూల్స్ ఉంటాయి. ఇప్పటికే నార్త్ కొరియా అనేక పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్లు, కాస్మొటిక్స్ ఉత్పత్తులను నిషేధించింది. ఈ కోవలోనే మహిళలు రెడ్ కలర్ లిప్‌స్టిక్ వాడరాదంటూ బ్యాన్ విధించింది.

సాధారణంగా ఎర్రటి పెదవులతో అందంగా కనిపించాలని మగువలు ఆశ పడతారు. కానీ ఉత్తర కొరియా మహిళలకు ఆ కల కలగానే మిగిలిపోతోంది. ఈ నియమాన్ని ఎవరైనా మహిళలు బ్రేక్ చేస్తే కిమ్ విధించే శిక్షలు అనుభవించాల్సిందే. అదీ దారుణమైన శిక్షలు ఉంటాయట.

నిషేధం ఎందుకంటే..
రెడ్ లిప్‌స్టిక్‌ మంచిది కాదని ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భావిస్తారు. అందుకే ఆ దేశంలో దాన్ని వాడటంపై నిషేధం విధించారు. రెడ్ కలర్ స్వేచ్ఛను సూచిస్తుందని, రెడ్ లిప్‌స్టిక్ వాడే మహిళలు చాలా అందంగా కనిపిస్తారనేది ఆయన అభిప్రాయమట. అయితే స్వేచ్ఛ, మహిళల టెంప్టేషన్ రెండూ ఉత్తర కొరియా దేశానికి మంచిది కాదని కిమ్ భావిస్తారట. ఈ కారణంతోనే ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను ఆ దేశంలో బ్యాన్ చేశారట. సంప్రదాయ, నైతిక విలువలను కాపాడటానికి ఈ నిషేధం అవసరమని ఉత్తర కొరియా నమ్ముతోంది. మహిళలు పొరపాటున రెడ్ లిప్‌స్టిక్‌ పూసుకుంటే కాస్త కఠినమైన శిక్షలు, భారీ పెనాల్టీలే విధిస్తారట.

నిబంధనలు అతిక్రమిస్తే…
ఉత్తర కొరియా మహిళలు చాలా సింపుల్ మేకప్‌ మాత్రమే వేసుకునే వెసులుబాటు ఉంది. ఈ దేశం మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రజల వస్త్రధారణ, ప్రవర్తనలపై ఇప్పటికీ పాత కాలపు ఆలోచనలను అనుసరిస్తుంది. అక్కడి ప్రభుత్వం మహిళల మేకప్ చెక్ చేయడానికి ప్రత్యేకంగా వర్కర్స్‌ను నియామకం చేసింది. ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ రూల్స్ పాటించేలా చూడటం వీరి బాధ్యత. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే పెద్ద ఇబ్బందుల్లో పడతారు. ప్రభుత్వం ప్రతి సిటిజన్ బాధ్యతగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇతర దేశాల ఫ్యాషన్ విధానాల వల్ల దేశ ప్రజలు ప్రభావితం కాకుండా జాగ్రత్త వహిస్తుంది.

హెయిర్ స్టైల్స్‌పైనా నియమాలు..
ఉత్తర కొరియా దేశంలో హెయిర్ స్టైల్స్‌పై కూడా కఠినమైన నియమాలు అమలు చేస్తుంది. మహిళలకు పొడవాటి జుట్టు ఉండరాదు. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపించరాదు. పొట్టి జుట్టుతో మాత్రమే ఉండాలి. జుట్టును శుభ్రంగా, చక్కగా మెయింటెన్ చేసుకోవాలి. హెయిర్ కలర్స్ వేసుకోవడం కూడా ఇక్కడ ఒక పెద్ద నేరంగా పరిగణిస్తారు. కిమ్‌ కొన్ని హెయిర్ స్టైల్స్‌కు మాత్రమే అంగీకారం తెలిపారు. పురుషులు 10, మహిళలు 18 హెయిర్ స్టైల్స్‌లో నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజలందరూ తప్పనిసరిగా ఈ హెయిర్ స్టైల్ రూల్స్ పాటించాల్సిందే. లేదంటే శిక్ష అనుభవించక తప్పదట.

ఇవీ చదవండి: Andhra Pradesh Voters: ఆంధ్రప్రదేశ్‌లో మీ సామాజికవర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?
John Cena: న్యూడ్‌మెన్‌గా మారిన జాన్‌సెనా.. ఆస్కార్‌ అవార్డుల వేడుకలో స్పెషల్‌ అట్రాక్షన్‌ కోసం తిప్పలు!
Blood: ఏ వయసు వారిలో ఎంత రక్తం ఉండాలి? తక్కువ ఉంటే ఏం చేయాలి?
Jog Waterfalls: కర్ణాటకలోని జోగ్‌ జలపాతం విశేషాలు.. ఎలా చేరుకోవాలంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు