HomeDevotionalPrasanna Venkateswara : సెప్టెంబ‌రులో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

Prasanna Venkateswara : సెప్టెంబ‌రులో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

Prasanna Venkateswara : అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. Prasanna Venkateswara

– సెప్టెంబ‌రు 2న మంగ‌ళ వారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

– సెప్టెంబ‌రు 5న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం.

– సెప్టెంబ‌రు 5, 12, 26వ‌ తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.

– సెప్టెంబ‌రు 10న ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం.

– సెప్టెంబ‌రు 7, 14, 21, 28వ‌ తేదీలలో శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారికి ఉద‌యం 8.15 గంట‌లకు అభిషేకం.

టీటీడీకి భారీ విరాళాలు
హైదరాబాద్ కు చెందిన ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2,92,91,840 (రూ.2.93 కోట్లు) ను విరాళంగా అందించింది. అదేవిధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళంగా అందించింది. కాగా నర్సారావు పేటకు చెందిన జె.రామాంజనేయులు శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఇవీ చదవండి: Tirumala Hotels : తిరుమలలో హోటళ్ల ధరలపై ఆ ప్రచారం అవాస్తవం
Tirumala news: తిరుమలలో అధికారుల నిర్లక్ష్యం.. ఈవో సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు