Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నెలా భక్తుల కోసం అనేక పర్వదినాలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కూడా శ్రీవారి ఆలయం భక్తి సంద్రంగా మారనుంది. ప్రత్యేక పూజలు, వ్రతాలు, పర్వదినాలతో తిరుమలలో భక్తులకు ఆధ్యాత్మిక శోభ కలగనుంది. (Tirumala News)
సెప్టెంబర్ నెల విశేష పర్వదినాలు:
సెప్టెంబర్ 3 – విష్ణుపరివర్తనైకాదశి.
సెప్టెంబర్ 4 – వామన జయంతి.
సెప్టెంబర్ 6 – అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.
సెప్టెంబర్ 8 – మహాలయ పక్ష ప్రారంభం.
సెప్టెంబర్ 10 – బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె).
సెప్టెంబర్ 16 – శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
సెప్టెంబర్ 21 – మహాలయ అమావాస్య.
సెప్టెంబర్ 23 – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
సెప్టెంబర్ 24 – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.
సెప్టెంబర్ 28 – తిరుమల శ్రీవారి గరుడోత్సవం.
సెప్టెంబర్ 29 – తిరుమల శ్రీవారి స్వర్ణ రథం.
భక్తి సంద్రం అవుతోన్న సెప్టెంబర్
ఈ నెలలో జరగబోయే విశేష పర్వదినాలు తిరుమల యాత్రను మరింత ఆధ్యాత్మికంగా మార్చనున్నాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, గరుడోత్సవం, స్వర్ణ రథం వంటి ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోడానికి తిరుమల చేరుకోనున్నారు.
👉 ఈ సెప్టెంబర్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం భక్తులకు మరింత పుణ్యప్రదం కానుంది.
ఇవీ చదవండి: Tirumala: నేటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు
YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం?
