HomeAndhra PradeshTirumala Hotels : తిరుమలలో హోటళ్ల ధరలపై ఆ ప్రచారం అవాస్తవం

Tirumala Hotels : తిరుమలలో హోటళ్ల ధరలపై ఆ ప్రచారం అవాస్తవం

Tirumala Hotels : తిరుమలలో హోటళ్లు, వాటిలో ధరలపై ఇటీవల సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. హోటళ్లలో ధరలు, వాటిలోని ఆహార పదార్థాల ధరలు, ఇంతకు ముందు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు తగ్గాయని… ఇలా పలు విధాలుగా పోస్టులు, ప్రచారం జరుగుతోంది. వీటిపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందించారు. (Tirumala Hotels)

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో హోటళ్ల ధరలపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు అని తెలిజేసింది.

ఇటీవలి కాలంలో “తిరుమలలో హోటళ్ల ధరల వివరాలు” పేరుతో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక మెసేజ్‌ టీటీడీ దృష్టికి వచ్చిందని, ఈ సమాచారం పూర్తిగా వాస్తవ దూరం అని పేర్కొంది.

ఈ మెసేజ్‌లో పేర్కొన్న భోజన ధరలు, ఇతర వివరాలు పూర్తిగా కల్పితం అని కొట్టిపారేసింది. ఇలాంటివి ప్రచారం చేయడం, షేర్ చేయడం, భక్తులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని టీటీడీ కోరింది.

ఈ విధమైన తప్పుడు ప్రచారాలతో భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది.

భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టీటీడీ వెబ్‌సైట్ (www.tirumala.org), టీటీడీ కాల్ సెంటర్ (18004254141) ద్వారా మాత్రమే తెలుసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు.

ఎలాంటి అనుమానాస్పద సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా అధికారిక వేదికల నుంచే తెలుసుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి: TTD : భక్తుల నుంచి టీటీడీ విస్తృత అభిప్రాయ సేకరణ
TTD: బీఆర్ నాయుడు చైర్మన్‌గా తొలి భేటీ.. టీటీడీ కీలక నిర్ణయాలు!
TTD Board: టీటీడీ బోర్డులో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణుడికీ దక్కని చోటు
TTD Big News: టీటీడీ కీలక నిర్ణయాలు.. 15 ఏళ్లలోపు చిన్నారులకు నడక దారిలో రిస్ట్రిక్షన్స్‌.. బైక్‌లకు రాత్రిపూట నో ఎంట్రీ!
Tirumala news: తిరుమలలో అధికారుల నిర్లక్ష్యం.. ఈవో సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు