HomeCinemaNidhhi Agerwal : నిధికి ఫ్యాన్ షాక్.. మీ అమ్మగారి నంబర్ ఇవ్వండి..

Nidhhi Agerwal : నిధికి ఫ్యాన్ షాక్.. మీ అమ్మగారి నంబర్ ఇవ్వండి..

Nidhhi Agerwal : అందాల భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటుంది. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన నిధి, ఆ తరవాత వరుసగా ప్రాజెక్టులలో నటించినా పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ హిట్టు ట్రాక్‌లోకి వచ్చింది. అందంలోనూ, అబ్బురపరిచే డాన్సుల్లోనూ తన ప్రత్యేకతను చాటిన ఈ ముద్దుగుమ్మ ఆ తరవాత మాత్రం మళ్లీ మునుపటి విజయాన్ని అందుకోలేకపోయింది. (Nidhhi Agerwal)

ఇప్పుడు మాత్రం ఆమెకు వరుసగా పెద్ద అవకాశాలు ఎదురయ్యాయి. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీర మల్లు సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటి శిక్షణను కూడా నిధి తీసుకుంది. మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇటీవలి కాలంలో ఈ సినిమా టీజర్ కూడా విడుదలై మంచి హైప్ క్రియేట్ చేసింది. అంతేకాదు, వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో రూపొందే ఓ ప్రాజెక్ట్‌లోనూ నిధి హీరోయిన్‌గా ఖరారైందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సోషల్ మీడియాలోనూ నిధి చాలా యాక్టివ్‌. ఫ్యాన్స్‌తో ముచ్చటించే సమయంలో కొన్నిసార్లు ఏకంగా షాక్‌కు గురయ్యే పరిస్థితులు వస్తుంటాయి. ఓసారి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతుండగా ఓ అభిమాని నిధిని పక్కాగా గందరగోళానికి గురి చేశాడు. “మీ అమ్మగారి నెంబర్ ఇవ్వండి. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా. ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి…” అంటూ అడిగేశాడు. దీనికి నిధి నవ్వుతూ స్పందిస్తూ, “అవునా? చిలిపి…” అంటూ తేలికగా షరా మామూలుగా తీసుకుంది. కానీ ఆమె షాక్ అయిందనేది మాత్రం పక్కా.

ఇవీ చదవండి: Hari Hara Veera Mallu: 3 రోజుల్లో హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్
Priya Bhavani Shankar: తళుక్కుమనే తార.. ప్రియా భవానీ శంకర్.. ఫొటో గ్యాలరీ
Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు