TTD : భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడంలో భాగంగా గత కొంత కాలంగా టీటీడీ భక్తుల నుంచి విలువైన అభిప్రాయాల్ని వివిధ రకాల ఫీడ్‌బ్యాక్ సర్వేల ద్వారా సేకరించడం ప్రారంభించింది. ఐవీఆర్ఎస్, వాట్సాప్ల ద్వారా e-Survey, శ్రీవారి సేవకుల ద్వారా మాన్యూవల్ సౌర్వే లను ప్రారంభించి టీటీడీ భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోంది. (TTD)
ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ సర్వే
ఈ ఎలక్ట్రానిక్ సర్వే విధానo ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూ లైన్ల నిర్వహణ మరియు లగేజ్ కౌంటర్ల పై మొత్తం 16 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.
వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం
తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే (వాట్సాప్ నెం: 9399399399) టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.
శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ
తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. ఈ విధానంలో సేవకులు టీటీడీ రూపొందించిన ప్రశ్నావళితో కూడిన అప్లికేషన్ ను తమ Mobile డౌన్లోడ్ చేసుకుని భక్తుల నుండి అభిప్రాయాలు సేకరిస్తారు.
త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్ మరియు టిటిడి బుకింగ్ పోర్టల్ నుండి భక్తులు యొక్క విలువైన సలహాలు సూచనలు తీసుకొనడానికి అప్లికేషన్ రూపొందించబడుతున్నది. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వేల ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది. ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి ఆన్ లైన్ సేవలను మెరుగుపరిచేందుకు తోడ్పడాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ఇవీ చదవండి: TTD: బీఆర్ నాయుడు చైర్మన్‌గా తొలి భేటీ.. టీటీడీ కీలక నిర్ణయాలు!
TTD Board: టీటీడీ బోర్డులో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణుడికీ దక్కని చోటు
TTD Big News: టీటీడీ కీలక నిర్ణయాలు.. 15 ఏళ్లలోపు చిన్నారులకు నడక దారిలో రిస్ట్రిక్షన్స్.. బైక్‌లకు రాత్రిపూట నో ఎంట్రీ!
