HomeAndhra PradeshTTD: బీఆర్ నాయుడు చైర్మన్‌గా తొలి భేటీ.. టీటీడీ కీలక నిర్ణయాలు!

TTD: బీఆర్ నాయుడు చైర్మన్‌గా తొలి భేటీ.. టీటీడీ కీలక నిర్ణయాలు!

TTD: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత తొలి సారి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (TTD) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యాంశాలు ఇవీ..

– శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి ..ప్రధాన ట్రస్ట్ కే ఆ నిధులు. శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుంది
– తిరుమలలో విశాఖ శారదా పీఠం లీజు రద్దు..శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
– అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం
– గతంలో సీఎం చంద్రబాబు గరుడ వారధిగా ప్రాజెక్టు ప్రారంభించారు. దానిని గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా పేరు మార్చింది

– ఇప్పుడు గరుడ వారధిగా పేరును కొనసాగించాలని నిర్ణయం
– తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు
– నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం
– లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం

– టీటీడీ ఉద్యోగులకు 10శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం
– అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం
– టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం
– టూరిజం శాఖ ఇచ్చే 4వేల టికెట్ల రద్దుకు నిర్ణయం

•⁠ ⁠ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా నిపుణుల కమిటీ ఏర్పాటు.

– టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.

•⁠ ⁠తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను మూడు లేదా 4 నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణ‌యం.

•⁠ ⁠అలిపిరిలో టూరిజం కార్పోరేష‌న్ ద్వారా దేవలోక్ కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం.

•⁠ ⁠తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం.

•⁠ ⁠తిరుపతి స్థానికులకు ప్ర‌తి నెలా మొద‌టి మంగ‌ళ‌వారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం.

•⁠ ⁠శ్రీ‌వాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశం.

– ప్ర‌యివేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కు తీసుకుని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం.

– నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అద‌నంగా మ‌రొక‌ ప‌దార్థాన్ని చేర్చేందుకు నిర్ణ‌యం.

•⁠ ⁠వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం.

•⁠ ⁠తిరుమ‌ల‌లో గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద విశాఖ శ్రీ శార‌ద పీఠానికి చెందిన మ‌ఠం నిర్మాణంలో అవ‌క‌త‌వ‌క‌లు, ఆక్ర‌మ‌ణలు జ‌రిగిన‌ట్లు టిటిడి అధికారుల క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భ‌వ‌నం లీజును ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యం.

•⁠ ⁠బ్ర‌హ్మోత్స‌వాలలో విశేష సేవ‌లు అందించిన ఉద్యోగుల‌కు గ‌త సంవ‌త్స‌రం ఇచ్చిన బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానాన్ని 10 శాతం పెంచాల‌ని నిర్ణ‌యం. త‌ద్వారా రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు రూ.7,535 బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానం.

•⁠ ⁠శ్రీ‌వారి ఆల‌యంలో లీకేజీల నివార‌ణ‌కు, అన్న ప్ర‌సాద కేంద్రం ఆధునీక‌ర‌ణ‌కు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ. ప‌నులు ఉచితంగా చేయ‌నున్న టీవీఎస్ సంస్థ‌.

ఇవీ చదవండి: TTD Board: టీటీడీ బోర్డులో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణుడికీ దక్కని చోటు
TTD Chairman: లోకేష్ మార్క్.. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. ఆర్కే పరిస్థితి?
TTD Big News: టీటీడీ కీలక నిర్ణయాలు.. 15 ఏళ్లలోపు చిన్నారులకు నడక దారిలో రిస్ట్రిక్షన్స్‌.. బైక్‌లకు రాత్రిపూట నో ఎంట్రీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు