HomeAndhra PradeshYS Jagan Press Meet : ప్రశ్నిస్తే ఇంత అసహనమా? చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

YS Jagan Press Meet : ప్రశ్నిస్తే ఇంత అసహనమా? చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

YS Jagan Press Meet : అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోని కూటమి ప్రభుత్వం, ఎవరైనా ప్రశ్నిస్తే అణిచి వేసే ధోరణి అవలంబిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. (YS Jagan press meet) ఏడాది పాలనలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న సీఎం చంద్రబాబు, ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, మరోవైపు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

తన పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకునేందుకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రైతుల పరామర్శలకు వెళ్తే దాడికి కుట్ర చేశారని చెప్పారు. తామేదో ఘనకార్యం సాధించామని చెప్పడానికి ఇంటింటికీ వస్తామన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఆ పార్టీ మ్యానిఫెస్టో చూపి నిలదీయాలని, సీఎం మోసాలపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. వైయస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

నాణానికి రెండోవైపు చూపాలని..
రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న కరెంట్‌ ఈవెంట్స్‌ అన్నింటి మీద నాణేనికి రెండో వైపు చూపించే ప్రయత్నం ఇది. ఎందుకంటే మనం కేవలం ప్రభుత్వం మీదే కాకుండా.. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా సామ్రాజ్యంతో కూడా యుద్ధం చేస్తున్నాం. మన వర్షన్‌ ప్రజల్లోకి సింక్‌ అయ్యే అవకాశాలు.. వాళ్లు చేస్తున్నంతగా మనది సింక్‌ కాదు కాబట్టి ప్రజలకు రెండో వైపున స్టోరీ తెలియాల్సి ఉంది కాబట్టి ఈ ప్రెస్‌మీట్‌.

రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య చంద్రబాబుగారి పాలన కొనసాగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మొన్న జూన్‌ 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి పిలుపినిస్తే ప్రజలు, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలంతా ప్రతి నియోజకవర్గంలో పాలు పంచుకుంటూ హాజరయ్యారు. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది? జనంలో ఏ రకమైన స్పందన వచ్చిందన్నది మీఅందరికీ తెలిసిందే.

అణిచివేత పదానికి నిర్వచనంలా..
ఒక్క ఏడాదిలోనే ఒక ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే తక్కువ. ఇది అరుదైన పరిస్థితి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న సీఎం చంద్రబాబు, ఒకవైపు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడమే కాకుండా, మరోవైపు అసహనం చెందుతున్నారు. అందుకే నియంతగా తాను మారి, అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంలా మారారు.

పరామర్శకు వెళ్లడం తప్పా? ఎందుకు ఆ కట్టడి?:
నిన్న (బుధవారం) పల్నాడు జిల్లాలో నా పర్యటన నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తల్ని పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్పా? అని అడుగుతున్నా? చంద్రబాబును సూటిగా ఈ ప్రశ్న అడుగుతున్నా. ఎందుకు ఇన్నిన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రామ్‌కు ఎవరూ రాకూడదు అని ఆదేశాలు జారీ చేసి, వచ్చిన వాళ్లందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది?.

చంద్రబాబు గారి నోట్లోంచి ఇటువంటి మాటలు వచ్చాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్‌ చేసినా ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రామ్‌ ఎలా జరిగింది అన్నది నేను చెప్పాల్సిన పని లేదు. బహుశా నాకన్నా మీ అందరికే ఎక్కువ అవగాహన ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్ని కలవడానికి వెళ్లినప్పుడు గానీ, లేదా పార్టీ నాయకుల్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు గానీ ఎందుకు ఇటువంటి ఆంక్షలు విధించాలి అని అడుగుతున్నా.

పొదిలి పర్యటనలో కుట్ర:
మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే అక్కడ కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. దాంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో పర్చూరు, కొండెపిలో ఇద్దరు రైతులు చనిపోయారు. దాంతో రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే.. దాదాపుగా 40 వేల పైచిలుకు తరలి వస్తే.. ఒక 40 మంది.. ఎంచినా కూడా అంత కన్నా ఎక్కువ మంది కనపడరు. ఆ 40 మందితో 40 వేల మంది పాల్గొన్న కార్యక్రమంపై రాళ్లు వేయాలని ప్రయత్నించారు.

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రైతుల సమస్యలు హైలెట్‌ కాకూడదా? రైతుల తరఫున ఎవరూ మాట్లాడకూడదా? రైతులకు సంఘీభావంగా ఎవరూ వెళ్లకూడదా? రైతుల సమస్యలనేవి ఎవరూ పట్టించుకోకూడదా? 40 వేల మంది, ప్రజలు రైతులతో జరిగే కార్యక్రమాన్ని నువ్వు 40 మంది చేత నువ్వు డిస్టర్బ్‌ చేయాలని ప్రయత్నం చేస్తావ్‌. ఇంకా రైతులు, ప్రజలు సంయమనం పాటించారు. కాబట్టే 40 వేల మంది 40 మంది మీద పడలేదు. ఒకవేళ పడి ఉంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన పని లేదు. కానీ విచిత్రంగా 40 మంది చేత గొడవ నువ్వు చేయిస్తావు. ఉల్టా రైతుల మీద నువ్వే కేసులు పెడతావు!. నేను చంద్రబాబును అడుగుతున్నాను. మీకెందుకంత భయం? ఎందుకంత అసహనం?

గిట్టుబాటు ధరలు లేవు
ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు వ్యవసాయం చేస్తున్నాడు. ధాన్యాన్ని రూ.300 తక్కువకు రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇదంతా చంద్రబాబు పుణ్యం. వరి దగ్గర నుంచి మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, అరటి, చీనీ, కోకో, ఇప్పుడు పొగాకు, మామిడి కూడా. ప్రతి పంటా కూడా ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడం లేదు. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో ఈ మధ్య కాలంలోనే ప్రకాశం జిల్లాలో ఇద్దరు పొగాకు రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఇంకా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇద్దరు, వినుకొండలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు.

ఏమిటా మాటలు? అదీ సీఎం స్థాయిలో!
ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు, చంద్రబాబునాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. భూస్థాపితం చేస్తాడట!. 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాడని అన్నాడు. ఆ ఎల్లో మీడియా ప్రతినిధి అడుగుతాడు.. ఎప్పుడు భూస్థాపితం చేస్తావని?. అందుకు ఆయన బదులిస్తూ.. ఇదిగో మొదలు పెట్టేశాను. చేస్తున్నాను. త్వరలో చేసేస్తాను అంటాడు. ఎంత దారుణం!. ఈ వయసులో రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలన ఏమిటి? బెదిరింపులేమిటి? వాడ్ని తొక్కుతా. వీడ్ని తొక్కుతా.. అన్న మాటలేమిటి? ప్రజలు, దేవుడు దయ తలచి అధికారం ఇచ్చారు. ఇచ్చిన ఆ అధికారంతో మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో, మోసాలతో పరిపాలన చేస్తూ.. వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు అత్యంత హేయం.

అటు డైవర్షన్‌ పాలిటిక్స్‌.. ఇటు అసహనం
ఏడాది పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో చంద్రబాబుకు అసహనం ఏ స్థాయిలోకి పోయింది అంటే.. దాన్నుంచి డైవర్ట్‌ చేసేందుకు, ఎవరైనా ప్రజా సమస్యలు గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు పెడుతున్న తప్పుడు కేసులు చూస్తే అర్థం అవుతుంది. ఎవరు గళం విప్పినా ఒప్పుకోం. ఎవరూ గళం విప్పకూడదనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడుతున్నారు. టాపిక్‌లు డైవర్ట్‌ చేస్తున్నారు. ఈ తప్పుడు కేసుల సంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్టుగా నా ప్రోగ్రామ్‌కు ముందు రోజున టాపిక్‌ డైవర్ట్‌ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం. రెండో కారణం, తనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే గొంతు నొక్కాలి.

లిక్కర్‌ కేసుతో చెవిరెడ్డికి ఏం సంబంధం?:
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. భాస్కర్‌ను అరెస్టు చేసిన తీరును చూస్తే దారుణం. ఇంతకు ముందు మీరంతా చూస్తున్నారు. సంవత్సరం నుంచి భాస్కర్‌ పేరు లిక్కర్‌ కేసులో ఎక్కడైనా కనిపించిందా? వినిపించిందా? కనీసం ఎవరన్నా విన్నారా?. లిక్కర్‌ కేసులో భాస్కర్‌ను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను క్రియేట్‌ చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏందంటే భాస్కర్‌ గన్‌మెన్‌ను పిల్చి, భాస్కర్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ కోసం ఒత్తిడి చేశారు. అందుకు ఆ గన్‌మెన్‌ ఒప్పుక్కోక పోవడంతో కొట్టి చిత్రహింసలకు గురి చేస్తే, ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్‌ ఏకంగా వీడియో తీసి, తనకు తగిలిన దెబ్బలు చూపిస్తూ, జరిగిన సంఘటన చెబుతూ, డీజీపీకి, గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు వేయడంతో నిన్న హియరింగ్‌కు వచ్చింది.

అలాగే మరో కానిస్టేబుల్‌ గిరిని తీసుకొచ్చారు. ఒకడు విన్నాడు, ఒకడు వినలేదు. గిరి అనే కానిస్టేబుల్‌ను తీసుకొచ్చి, స్టేట్‌మెంట్‌ ఇప్పించారు. అలా మనుషులను పిల్చుకుని రావడం, ప్రలోభాలు పెట్టడం, లేదా భయపెట్టడం, నీ ఇష్టం వచ్చినట్లు తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించడం, వాటిని చూపి అరెస్టు చేయడం!. రాష్ట్రంలో అసలు నిజంగా ఏం జరుగుతోంది? ఇలా జరుగుతుంటే ఎవడు తట్టుకోగలుగుతాడు? ఎవరిరైనా ఇరికించేయొచ్చు కదా?. దీనికి అంతమెక్కడ?. ఇవన్నీ చూస్తే సామాన్యుడు ఎవడూ బతకలేడు. ఎవడెన్స్‌ నువ్వు క్రియేట్‌ చేస్తున్నావు. వాటిని మాన్యుఫాక్చర్‌ చేస్తున్నావు. ఈ మాదిరిగా తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికితే రేప్పొద్దున వ్యవస్థ బతుకుతుందా?. నక్సలిజం అనేది ఇట్లాంటి దాంట్లో నుంచే పుడుతుంది కదా?. రాష్ట్రాన్ని బిహార్‌లా చేయడంలో గొప్ప లీడర్, గొప్ప నాయకుడు చంద్రబాబు కన్నా ఎవడూ ఉండరు.

చెవిరెడ్డి ఎందుకు టార్గెట్‌?:
భాస్కర్‌ను ఎందుకు టార్గెట్‌ చేశారంటే.. ఆయనది చంద్రగిరి. అది చంద్రబాబు సొంత నియోజకవర్గం. అందుకే ఒక్క భాస్కర్‌రెడ్డినే కాదు, ఆయన కొడుకును కూడా కేసులో ఇరికించారు. ఆ పిల్లోడు మొన్ననే పాపం చదువులు పూర్తి చేసుకుని లండన్‌ నుంచి వచ్చాడు. తన సొంత నియోజకవర్గంలో తనకు ఎవరూ ఎదురుండకూడదు. అంతా క్లీన్‌గా ఉండాలి. అదే చంద్రబాబు లక్ష్యం. ఉద్దేశం. అసలు ఇక్కడ ఒక ముఖ్య విషయం. తన సొంత నియోజకవర్గంలో గెలవలేని వ్యక్తి. అక్కడ 17 వేల ఓట్లతో ఓడిపోతే, కుప్పం పారిపోయాడు. మరి ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయాలని చెప్పి, భాస్కర్‌రెడ్డిని, ఆయన కొడుకును అందర్నీ ఎలిమినేట్‌ చేయాలని, తప్పించాలని చూస్తున్నాడు. ఏం రాజకీయం ఇది?.

వైయస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తప్పుడు కేసుల పరంపర కొససాగుతోంది. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు. ఇంకా నందిగం సురేష్‌. మాజీ ఎంపీ. దళితుడు. ఆయన్ను రెండుసార్లు జైల్లో పెట్టారు. ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు ఉండి, సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్‌ తెచ్చుకుంటే, మరో కేసులో ఇరికించి, మళ్లీ జైలుకు పంపారు. మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు. సురేష్‌ భార్య మీద కూడా కేసులు పెట్టారు.

వల్లభనేని వంశీ. దాదాపు రెండు నెలలు దాటింది. ఒక కేసు అయిపోగానే మరో కేసు. ఒక కేసులో బెయిల్‌ వస్తే మరో కేసు పెడుతున్నారు. అలా ఇప్పటికి 11 కేసులు పెట్టినట్లున్నారు. ఇంకా మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకుపైనా కేసు పెట్టారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని, నా ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని జైల్లో పెట్టారు. పాపం. ఆయన్ను చూస్తే జాలేస్తుంది. ఆయన మాజీ ఆర్డీవో. ఇంకా నా కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి. రిటైర్డ్‌ ఐఏఎస్‌. ఆయన్ను చూసినా పాపం అనిపిస్తుంది. వీళ్లంతా మచ్చలేని ఆఫీసర్లు. ఇంకా రాజ్‌ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇలాంటి వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. మా ఎంపీ మిథున్‌రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని వెంటపడుతున్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబునాయుడుని ఎప్పుడో కాలేజీలో కొట్టాడంట. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ల కొడుకును అరెస్టు చేయాలంటాడు, వాళ్ల నాయన్ని అరెస్టు చేయాలంటాడు. పేర్ని నాని. ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు. పేర్ని నాని భార్య జయసుధమ్మ ఆమెనూ కేసుల్లో ఇరికించారు.

కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు.. దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్, అంబటి రాంబాబు, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్, ఉషాశ్రీ చరణ్‌ బీసీ మహిళ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, లాయర్‌ గౌతమ్‌రెడ్డి. ఆయన విజయవాడలో మీ అందరికీ పరిచయం. ఇంకా మేరుగు నాగార్జున దళిత మాజీ మంత్రి, దాడిశెట్టి రాజా ఎక్స్‌ మినిస్టర్‌.. ఈ నాయకులందరి మీదా తప్పుడు కేసులు పెట్టడంతో పాటు, ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని చంద్రబాబు తాపత్రయపడుతున్నాడు.

అదే మోడస్‌ ఆపరెండి
జగన్‌ చుట్టూ ఉన్నవాళ్లలంరినీ బెదిరించాలి. భయపెట్టాలి. మోడస్‌ ఆపరాండి ఒక్కటే. చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం, భయపెట్టడం లేదా ప్రలోభాలకు గురి చేయడం, వారి నుంచి తప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం, తాము టార్గెట్‌గా పెట్టుకున్న వారిని అరెస్టు చేయడం. అన్నింటికీ ఒకటే. సేమ్‌ మోడస్‌ ఆపరెండి. అన్ని తప్పుడు కేసులు. తప్పుడు ఆలోచనలు. తప్పుడు పనులు.

కొమ్మినేనిగారి అరెస్టు దారుణం:
అన్నింటి కంటే బాధ కలిగించే విషయం. 70 ఏళ్ల వృద్ధుడు. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌. ఆయన మీ తోటి జర్నలిస్ట్‌. వృత్తిలో మంచి పేరున్న జర్నలిస్ట్‌. చాలా సీనియర్‌. ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా. ఆయన్ను జైలుకు పంపించేందుకు చంద్రబాబు ఎందుకంత ఉత్సాహం చూపించాడు?. ఇది ధర్మమేనా?. ఒక డిబేట్‌లో ప్యానలిస్టు మాటలకు యాంకర్‌కు ఏం సంబంధం? ఇది మినిమం లాజికల్‌ రీజనింగ్‌. అలాంటిది ఆయన్ను తీసుకొచ్చి జైల్లో వేశారు. ఆయన మీద చంద్రబాబుకు కోపమెక్కువే అనుకోండి. ఇంతకు ముందు ఆయన ఉద్యోగం ఊడగొట్టే విషయంలో చంద్రబాబు చాలా క్రియాశీలక పాత్ర పోషించాడు. అంతటితో సంతోషపడలేదు. ఉద్యోగం ఊడగొట్టడంతో, ఆయన జీవితం నాశనం చేయాలని, ఆయన పరువు తీయాలని, జైల్లో పెట్టాలని దిక్కుమాలిన ఆలోచనలు.

సాక్షి కార్యాలయాలపై కుట్ర. దాడులు:
అలా కొమ్మినేనిగారిని అరెస్టు చేయడమే కాకుండా.. సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం. ఎక్కడెక్కడైతే సాక్షి ఆస్తులు ఉన్నాయో అక్కడ ఆర్కస్ట్రేటెడ్‌గా, టీడీపీ నేతలు అటాక్‌ చేసి విధ్వంసం సృష్టించారు. శ్రీకాకుళంలో తెలుగు మహిళ టౌన్‌ ప్రెసిడెంట్‌ మెట్టా శైలజ, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ భార్య గొండు స్వాతి, మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండా దాసు నాయుడు, విశాఖపట్నం సాక్షి ఆఫీసును 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ బుక్కా శ్రావణి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, తూర్పు గోదావరి సాక్షి ఆఫీసుపై అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పేరుకే బీజేపీ ఎమ్మెల్యే కానీ, ఆయన టీడీపీ ఎమ్మెల్యే అని అందరికీ తెలుసు. రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ.

విజయవాడ ఆటోనగర్‌ సాక్షి ఆఫీసుపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ భార్య, మాజీ మేయర్‌ గద్దె అనురాధ, వారి కుమారుడు గద్దె క్రాంతి, మంగళగిరి సాక్షి ఆఫీసుపై ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష, అనంతపురం సాక్షి ఆఫీసుపై టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సంగా స్వాతి, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సంగా తేజస్విని, కడప సాక్షి ఆఫీసుపై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, తిరుపతి రేణుగుంట సాక్షి ఆఫీసుపై డిప్యూటీ మేయర్‌ ఆర్‌సీ మునికృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం.. ఇతను తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా గతంలో వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేశాడు. ఇప్పుడు సాక్షి ఆఫీసులపై దాడి చేసే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరించాడు. నెల్లూరు సాక్షిపై నెల్లూరు టీడీపీ అధ్యక్షురాలు కె.రేవతి, ఏలూరు సాక్షి ఆఫీసుపై తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ దాడులు చేశారు. నేను అడుగుతున్నాను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పితున్న పత్రిక, టీవీ ఛానల్‌ గొంతు నులపడం కోసం ఆర్కెస్ట్రేటెడ్‌ గా నువ్వు, నీ టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి, నీ ఎమ్మెల్యేలు చేసే కార్యక్రమం ఇది. ధర్మమేనా?.

చంద్రబాబు చెంపఛెళ్లు..
సాధారణంగా సుప్రీంకోర్టు అంత తేలిగ్గా ఎవరికీ బెయిల్‌ ఇవ్వదు. కానీ కొమ్మినేని గారికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌–32 కింద విచక్షణాధికారం ఉపయోగించి, వెంటనే రిలీజ్‌ చేయాలని ఆదేశించింది. ఇది చంద్రబాబు చెంప ఛెళ్లుమనిపించడం కాదా?. అదే కేసులో సాక్షి కార్యాలయాలను టీడీపీ కార్యకర్తలందరితో దగ్ధం చేస్తే.. దానికి గవర్నమెంట్‌లో ఉన్న చంద్రబాబు బాధ్యుడు కాదా? కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం తప్పు అని.. విచక్షణాధికారాన్ని ఉపయోగించి చంద్రబాబు చెంప ఛెళ్లుమనిపించింది సుప్రీంకోర్టు.

చంద్రబాబు దోషి కాదా?
మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా ధ్వంసం చేస్తుంటే, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు ఇందులో దోషి కాదా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది? .ఇది తప్పుడు సాంప్రదాయం కాదా?. ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపు ఎవరైనా బతుకుతారా? ఈరోజు సాక్షి. రేపు ఎన్టీవీ కావొచ్చు. టీవీ 9 విలేకరి కావొచ్చు. ఆ తర్వాత ఇంకొకరు. అలా చేస్తూ పోతుంటే ఎవరైనా బతుకుతారా?. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా? రేపు ఈయనకు వ్యతిరేకంగా ప్రజాశక్తి కావొచ్చు. ఇంకెవరైనా కావొచ్చు. ఎవరు మాట్లాడినా, ఎవరు రాసినా, ఎవరు చూపించినా.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం. కరెక్టేనా ఇది?

నిజంగా మహిళలపై గౌరవం ఉంటే..:
నిజంగా మహిళల పట్ల చంద్రబాబుగారికి గౌరవం ఉందా? అని అడుగుతున్నాను. ఎందుకంటే, ఆయనకు నిజంగా ఆ తత్వం ఉంటే.. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత చిన్నారిని.. టీడీపీ వాళ్లు 14 మంది సామూహిక అత్యాచారం చేస్తే.. ఆ బాలిక గర్భం దాలిస్తే.. ఈ విషయం బయటికి వచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా టీడీపీ వాళ్లు భయపెట్టిన మాట వాస్తవం కాదా? ఆ పాపకు తండ్రి కూడా లేడు. అలాంటి తండ్రి లేని కుటుంబాన్ని వీరు చేసిన పనులతో ఊరు విడిచి పెట్టి వెళ్లిన విషయం వాస్తవం కాదా?.

ఈ కేసులో పోలీసులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నా. నీ గవర్నమెంట్‌లో ఆ దళిత పాపకు తోడుగా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం ఎందుకు లేవని అడుగుతున్నాను. ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడి వేశారు. న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కోశానా సిన్సియారిటీ లేదు. మహిళలంటే గౌరవం ఉన్న వాళ్లు చేసే పనేనా ఇది? ఇంకా అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరో ఘటన. ఇంటర్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయి. ఆ బిడ్డ కనపడటం లేదని జూన్‌ 3న తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆరు రోజుల తర్వాత ఆ పాప శవమై కనిపించింది. అసలు రాష్ట్రంలో ఇలాంటి కేసుల మీద దర్యాప్తు చేయాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. అనే ఆలోచన ఎవరికైనా ఉందా?.

ఎంత సేపు రెడ్‌ బుక్, రెడ్‌ బుక్, ఎంత సేపు వాళ్లని ఇరికించాలి. వీళ్లని కేసుల్లో ఇరికించాలి అన్న తాపత్రయం తప్ప. ఆడవాళ్ల గురించి వీళ్లు మాట్లాడతారు. చంద్రబాబు సొంత నియజకవర్గం కుప్పంలోని నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేశారు. అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్టు చేస్తే, ఫోటోలతో సహా చూపిస్తే, నెట్‌లో వైరల్‌ అయితే.. అప్పుడు చంద్రబాబు మేల్కొంటాడు. రూ.5 లక్షలు ప్రకటిస్తాడు.

ఈ మనిషా వారి గురించి మాట్లాడేది?:
ఇలాంటి మనిషా మహిళల గౌరవం గురించి మాట్లాడేది? ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆడవాళ్లను వెన్నుపోటు పొడిచాడు. ఈ మనిషా ఆడవాళ్ల గౌరవం గురించి మాట్లాడేది? ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ. తన కాళ్ల మీద నిలబడ గలిగే పరిస్థితి రావాలి. ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలని ఆరాటపడింది మేము. వారి ఆర్థిక ఎదుగుదల కోసం ఏకంగా రూ.1.89 లక్షల కోట్లు డీబీటీగా 19 పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు నేరుగా అందించాం. వారి కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ, నాన్‌ డీబీటీగా.. వారి కుటుంబాలకు మేలు జరగాలి, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. ఏకంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్టర్‌ చేశాం. ఒక్కొక్కరి పేరుతో నాలుగు లక్షలు, ఐదు లక్షలు, పది లక్షల విలువైన ఇళ్ల పట్టాలను వారి పేరుతో రిజిస్టర్‌ చేశాం. అందులో 22 లక్షలు ఇళ్లు మంజూరు చేసి 10 లక్షల ఇళ్లు కూడా కట్టించడం జరిగింది. మిగతావి కూడా వేగంగా మేము ఉన్న సమయంలో మిగతా 12 లక్షల ఇళ్లు కూడా కట్టించేందుకు చర్యలు తీసుకున్నాం. చట్టం చేసి మరీ అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాం. అంతకు ముందు ఎవరూ ఆ పని చేయలేదు.

వెన్నుపోటు పొడవడమే ఆయన పని:
మరి ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది? మహిళలకు మంచి చేసిన మాకా? లేక ఆ ముసుగులో దౌర్జన్యం చేసే ఆ పెద్ద మనిషికా? ఆ ముసుగులో రాక్షసత్వం ప్రదర్శించే ఆ పెద్ద మనిషికా? మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు సరి కదా.. మహిళలైనా, పిల్లలైనా, పిల్లనిచ్చిన మామకైనా. వెన్నుపోటు పొడవటంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి. ఎన్నికలకు ముందు ఏమన్నాడు? జగన్‌ చేస్తున్నవే కాకుండా.. జగన్‌ కన్నా ఎక్కువ చేస్తా అన్నాడు. సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ పేరిట తాను చేసిన వాగ్దానాలు.. రిబ్బన్‌ కూడా కట్ట చేయకుండా మొత్తం చేశేసానని అంటున్నాడు.. చూ మంతర్‌ అంటూ సూపర్‌ సిక్స్‌ చేసేశాను.. సూపర్‌ సెవెప్‌ నెరవేర్చేశాను అని ఊదరగొడతా ఉన్నాడు.. ఆయన, ఆయన ఎల్లో మీడియా.. సోషల్‌ మీడియాలో. మరి సూపర్‌ సిక్స్‌ ఏమైంది?. సూపర్‌ సెవెన్‌ ఏమైంది? అని ఎవరైనా అడిగితే, వారి నాలుక మందం అని బెదరిస్తున్నాడు.

నిరుద్యోగ భృతి:
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తానన్నావు. అంటే ఏడాదికి రూ.36 వేలు ఎంతమందికి ఇచ్చావు?. ఏప్రిల్‌ 17, 2025న ఈనాడులో వచ్చిన ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేని వారు కోటిన్నరపైనే అని రాశారు. టీడీపీ గెజిట్‌ పత్రికలో వచ్చిన లెక్క ప్రకారమే 1.56 కోట్ల మంది ఉపాధి లేని వారు ఉన్నారని చెప్పారు. వారందరికీ ఏడాదికి రూ.36 వేలు ఇస్తామని చెప్పారు కదా? మరి ఒక్క పైసా అన్నా ఇచ్చారా? ఏవీ చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందం అని బెదిరించడం ధర్మమేనా?. ఇది మోసం కాదా? అని అడుగుతున్నా. 142 హామీలు నెరవేర్చానని చెబుతున్నాడు. రూ.36 వేలు ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు.

ఆడబిడ్డ నిధి:
ఆడబిడ్డ నిధి ఎగురగొట్టి పీ4 అంటున్నాడు. ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ఓటర్‌ లిస్టు ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళల సంఖ్య 2,10,58,615. ఇందులో 60 ఏళ్లు నిండిన వారిని తీసేస్తే 1.80 కోట్ల మంది ఉంటారు. వీరందరికీ ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. ఏడాది పాలనలో ఎంత మందికి ఇచ్చావని అడుగుతున్నా. ఇది మోసం కాదా? ఇవ్వకుండా ఇచ్చేశామని అబద్ధాలు చెప్పడమే కాకుండా, ఇప్పుడు పీ4 అని డ్రామా ఆడుతున్నారు. మీరు ఇవ్వాల్సింది పోయి ఎవరో శ్రీమంతుడిని చూపించి ఒకరిద్దరికి ఇప్పిస్తానంటున్నావు.

దీపం, ఉచిత బస్సు:
దీపం, ఉచిత బస్సు అనేవి చిన్న చిన్న పథకాలు. అవి కూడా సక్రమంగా అమలు కాలేదు. దీపం పథకంలో ఒక్క సిలిండర్‌కు కూడా దిక్కు లేదు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ సోర్స్‌ స్టేట్‌ వైజ్‌ యాక్టివ్‌ డొమిస్టిక్‌ కస్టమర్స్‌ ఆఫ్‌ ఎల్పీజీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని తెలుస్తోంది. పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌లో ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని కనెక్షన్లు ఉన్నాయని తెలుస్తుంది.

1,59,20,000 కుటుంబాలకు ప్రతి సిలిండర్‌కు రూ.877 చొప్పున మూడు సిలిండర్లకు అయ్యే ఖర్చు రూ.4,109 కోట్లు. కానీ మొదటి ఏడాది బడ్జెట్‌ కేటాయింపు చూస్తే కేవలం రూ.865 కోట్లు. అంటే, మిగిలిన రూ. 3244 కోట్లు ఇవ్వకుండా చేసింది మోసం కాదా? ఇచ్చిన దాంట్లో కూడా మళ్లీ మోసం. అంతా బోగస్‌. కనీసం ఒక్క సిలిండర్‌ పూర్తిగా ఇవ్వాలన్నా కూడా రూ.1,370 కోట్లు కావాలి. కానీ ఇచ్చింది కేవలం రూ.865 కోట్లు. దీన్ని బట్టి ఒక్క సిలిండర్‌ కూడా సరిగా అందరికీ ఇవ్వలేదని అర్థమైంది కదా.

పండగలు మారినా ఉచిత బస్సు రాలేదు:
మహిళలకు ఉచిత బస్సు. అన్నింటికన్నా సులభమైన పథకం. మా కడపలో మహిళలంతా ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం చూసి మరుసటి రోజు తిరిగి రావాలని చూస్తున్నారు. ఈ పథకానికి ఏడాదికి రూ.275 కోట్లు అవుతుంది. ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు ఇస్తే ఈ పథకం అమలు చేయొచ్చు. వచ్చాడు చేస్తానన్నాడు. ఏడాదైపోయింది. పండగల పేర్లు మారుతున్నాయి కానీ పథకం అమలు కాలేదు. ఫస్ట్‌ ఉగాది అన్నాడు. మళ్లీ దసరా. ఆ తర్వాత సంక్రాంతి అన్నాడు. మళ్లీ ఉగాది అయిపోయింది. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. అధ్యయనం చేయాలి అంటున్నాడు. దానికి అధ్యయనం ఏముంటుంది? ఎవరు ఎక్కడికి పోవాలో వెళ్తారు. వస్తారు. విజయవాడ వచ్చి దుర్గమ్మను దర్శనం చేసుకుని వెళ్తారు. ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులున్నాయో అక్కడంతా తిరిగేసి చూసి వస్తారు. ఇదే కదా ఆయన ఎన్నికలప్పుడు చెప్పింది. దానికీ ఇంతవరకు మోక్షం లేదు.

పెన్షన్‌. పచ్చి మోసం:
50 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వకపోగా 5 లక్షల పింఛన్లు పీకేశాడు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ మహిళలు కనీసం 20 లక్షల మందికి పైగా ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్‌ ఇవ్వాలంటే ఏడాదికి కనీసం రూ.9,600 కోట్లు కావాలి. మొదటి ఏడాది ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. రెండో ఏడాది ఇంతవరకు ఇవ్వలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నాలుక మందం అని బెదిరిస్తున్నాడు. పైగా అన్నింటి కన్నా దారుణం ఏంటంటే ఇచ్చే పింఛన్లు కూడా తగ్గించేశాడు.

ఎన్నికల నాటికి (మార్చి 2024) 66,34,742 పింఛన్లు పంపిణీ చేస్తే, ఈ నెలలో ఇచ్చిన పింఛన్లు 61,48,697 మాత్రమే. దాదాపు 5 లక్షల (4,86,045) పింఛన్లు పీకేశారు. సంవత్సరం తిరిగే సరికి ఒక్కరికి కూడా కొత్త పింఛన్లు ఇవ్వకపోగా 5 లక్షల పింఛన్లు పీకి పారేశాడు. 50 ఏళ్లు నిండిన వారికి అదనంగా పింఛన్లు ఇస్తానని మాట చెప్పి 20 లక్షల మంది ఎస్సీ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ మహిళలను మోసగించాడు. మళ్లీ ఏమంటాడు. నేను ఇచ్చేశానంటాడు. ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటాడు.

అన్నదాత సుఖీభవ ఏది?:
ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు .ఇది మోసం కాదా? రైతుకు సంవత్సరానికి ఇప్పుడు ఇచ్చేది కాకుండా రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. పీఎం కిసాన్‌ నిధి పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాక, ఈయన అదనంగా రూ.20 వేలు ఇస్తామని ఊదరగొట్టి, దానికి అన్నదాత సుఖీభవ అనే పేరు పెట్టారు. నిరుడు ఒక్కరికీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది మోసం కాదా? మళ్లీ ఎవరైనా అడిగితే, ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులకు రూ.20 వేల చొప్పున రూ.10,716 కోట్లు ఇచ్చి ఉంటే రైతులకు మేలు జరిగేది. ఇదంతా ఇవ్వకుండా ఎగురగొట్టాడు.

తల్లికి వందనం మరో మోసం:
తల్లికి వందనం పేరిట తల్లులందరిని చంద్రబాబు వంచిస్తున్నాడు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోమని చంద్రబాబు ఎన్నికల్లో పదేపదే చెప్పాడు. ‘తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా ఆంక్షలు లేవు, కటింగ్‌లు లేవని మా ఆడబిడ్డలకు మాటిస్తున్నా’ అంటూ చంద్రబాబు అన్న మాటలు ఇవి.

యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌). ఈ డేటా కలెక్టర్లు అప్‌లోడ్‌ చేస్తారు. ఆ డేటా ప్రకారం 2023–24లో రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు ఉన్నారు. వారందరికి ఎలాంటి ఆంక్షలు, కటింగ్‌ లేకుండా రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,111 కోట్లు కావాలి. కానీ ఇప్పుడు ఇస్తానంటోంది రూ.8700 కోట్లు మాత్రమే. అది కూడా అనుమానమే. ఎందరికి ఇస్తాడో? అంటే దాదాపు 30 లక్షల మందికి కోత.

దాన్ని మేము గట్టిగా నిలదీస్తే.. వెంటనే మాట మార్చి ఇచ్చేది రూ.15 వేలు కాదు, రూ.13 వేలు మాత్రమే అన్నారు. అది కూడా 67 లక్షల మందికి అని ప్లేటు మార్చాడు. ఆ తర్వాత మళ్లీ మాట మార్చి ప్రస్తుతం 55 లక్షలకే ఇస్తామంటున్నాడు. అంటే అందరికీ కాకుండా, కొందరికి మాత్రమే రూ.13 వేలు అని తేలింది. అంటే ఎన్నికలకు ముందు నీకు, నీకు, నీకు అన్న మాట పోయి, కొందరికి మాత్రమేగా మారింది. ఈ మోసాన్ని ప్రశ్నిస్తే నాలుక మందం అంటున్నాడు. ఇంకా ఏమైనా అంటే తప్పుడు కేసులు నమోదు చేయడం అలవాటుగా మారింది.

నాడు అమ్మ ఒడి ఘనం:
అప్పట్లో అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి డబ్బులు ఇచ్చాం. తల్లులు తమ బిడ్డలను బడులకు పంపించండి అని ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిని ఇచ్చాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఇచ్చాం. 84 లక్షల మంది పిల్లలను బడుల బాట పట్టించాం. ఇప్పుడు ఒకవైపు సిన్సియార్సిటీ లేకుండా ఈ పథకాన్ని భ్రష్టు పట్టించారు. మా ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన సంస్కరణలు అన్నీ కూడా నాశనం చేశారు.

మా ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఇంగ్లీష్‌ మీడియం బడులు పోయాయి. 3వ తరగతి నుంచి టోఫెల్‌ పోయింది. 3వ తరగతి నుంచి సబ్జెట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ పోయింది. రోజుకో మెనూతో చిక్కీతో ఇచ్చే మధ్యాహ్న భోజనం గోరుముద్దా పోయింది. నాడు–నేడు పనులు ఆగిపోయాయి. ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ దాకా ప్రయాణం ఆగిపోయింది. 8వ తరగతి పిల్లలకు ఇచ్చే ట్యాబ్‌లు ఇవ్వడం లేదు. మా హాయంలో గవర్నమెంట్‌ స్కూళ్లలో నో వెకెన్సీ బోర్డులు కనిపించేవి. చివరికి ఇప్పుడు పదో తరగతి వాల్యూషన్‌ కూడా సక్రమంగా చేయలేని అధ్వాన్నమైన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.

విద్యాదీవెన. వసతి దీవెన లేవు:
మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే వాళ్లం. ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన ఒక విడత ఇచ్చే వాళ్లం. దాంతో పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి ఉండేది కాదు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం లేకుండా గొప్పగా చదివించే తపన, తాపత్రయం మా హయాంలో కనిపించేది. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ జూన్‌ వస్తే ఆరు త్రైమాసికాలు అవుతుంది.

ఎన్నికల కోడ్‌ కారణంగా అప్పట్లో వాయిదా పడింది. ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు ఇవ్వాలి. అలా ఇప్పటి వరకు రూ.4,200 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఆగిపోయిన ప్రక్రియ ఇంత వరకు ప్రారంభం కాలేదు. ఇంకా వసతి దీవెన రెండు విడతలు రూ.2200 కోట్లు. విద్యా దీవెనకు సంబంధించి ఆరు త్రైమాసికాలు, వసతిదీవెన.. ఈ రెండు పథకాలకు కలిపి రూ.6200 కోట్లకు గాను కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఈయన ఇచ్చాడు. వసతి దీవెన రద్దు అయినట్లుగా మాట్లాడుతున్నాడు. విద్యా దీవెన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతాడే తప్ప, ఇవ్వాలనే తాపత్రయం ఎక్కడా కనిపించడం లేదు.

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం. ఆరోగ్య ఆసరా లేదు:
ఆరోగ్యశ్రీ పరిస్థితి. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం మేము చేశాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు పెంచి ప్రతీ పేదవాడికి వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చాం. వైద్యం కోసం ఎవరూ అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నా కూడా అంటే, మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలకు కూడా ఆరోగ్యశ్రీ అందించాం. నెలకు రూ.40 వేలు సంపాదించే వారికి కూడా ఆరోగ్యశ్రీ అందజేశాం. పథకానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. అలా చంద్రబాబు వచ్చిన 12 నెలలకు ఆరోగ్యశ్రీకి పెట్టిన బకాయిలు రూ.3600 కోట్లు.

ఆరోగ్య ఆసరా కింద ఆపరేషన్‌ పూర్తయిన తరువాత పేషెంట్‌ రెస్ట్‌ తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఇచ్చాం. దానికి ఏటా రూ.400 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ రూ.3600 కోట్లు, ఆరోగ్య ఆసరా రూ.400 కోట్లు మొత్తం రూ.4000 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశాడు. దీంతో వైద్యానికి నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. ఏ పేదవాడు కూడా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో లేరు. కానీ, ఈ పెద్దమనిషి ఛూ మంతర్‌.. అబ్రకదబ్రా అంటాడు. అన్నీ చేసేశానని చెబుతాడు. ఎవరైనా చేయలేదని ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని బెదిరిస్తాడు. ఇదే జరుగుతుంది.

దయనీయ స్థితిలో రైతులు:
ఇక రైతుల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. వారికి పెట్టుబడి సహాయం రద్దు అయిపోయింది. ఉచిత పంటల బీమా రద్దు అయిపోయింది. సీజన్‌ ముగిసేలోగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రద్దు. ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేస్తూ ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి పూర్తిగా రద్దు అయిపోయింది. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో ఈరోజున రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.  YS Jagan press meet

ఇవీ ఈ ఏడాదిలో చంద్రబాబు ఘనతలు:
ఒక్కటైతే ఒప్పుకోవాలి..దేనికి అనేది మనం చెప్పాలి. చంద్రబాబు కొన్ని చేశారు. అవి చెప్పకపోతే తప్పవుతుంది.
– ఏడాదిలో రూ.15 వేల కోట్ల విద్యుత్‌ ఛార్జీల బాదుడు.
– గవర్నమెంటు స్కూళ్లు, కాలేజీలు చంపేసి, తద్వారా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచేలా చేసి బాదుడే బాదుడు.
– అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటిఅద్దెల బాదుడు.
– హెరిటేజ్‌ కోసం అమూల్‌ను చంపేసి, పాల రేట్లు పెంచేలా చేసి బాదుడే బాదుడు.
– ఇంటింటికీ రేషన్‌ సరుకులు అందించే వాహనాలు తీసేయడమే కాకుండా, రేషన్‌ సరుకుల్లో కందిపప్పు తీసేశాడు. దాంతో పప్పుల ధరలు బాదుడే బాదుడు.
ఇలా అన్ని రకాలుగా బాదుడే బాదుడు.
– ఏడాది కాలంలో ఏకంగా 3 లక్షలకు పైగా ఉద్యోగాలు తీసేశాడు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.
–2.60 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు హుష్‌కాకి. ఎండీయూ వాహనాల రద్దు ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు పోయాయి. బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో మరో 15 వేల మంది. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు హుష్‌కాకి.

ఉద్యోగులకు వంచన:
పంటలకు ధరలు లేక రైతుల అల్లాడుతుంటే, మరోవైపు సరుకుల ధరలు పెరిగి చంద్రబాబు మోసంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకూ మోసమే. మధ్యంతర భృతి లేదు. ఉన్న పీఆర్‌సీ రద్దు. కొత్త పీఆర్‌సీ నియామకం లేదు. అది వేస్తే ఉద్యోగుల జీతాలు పెంచాల్సి వస్తుందని ఆ పని చేయడం లేదు. మూడు డీఏలు ఇప్పటికే పెండింగ్‌. ఈ జూలై 1 వస్తే 4 డీఏలు పెండింగ్‌. మన ప్రభుత్వంలో గ్యారెంటీ పెన్షన్‌ పథకం (జీపీఎస్‌) తెస్తే, దాన్ని తీసేసి ఓపీఎస్‌ (పాత పెన్షన్‌ పథకం) అన్నాడు. అక్కడా మోసం. ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.20 వేల కోట్లు. అడిగితే తోకలు కట్‌. భూస్థాపితం చేస్తా అంటాడు. YS Jagan press meet

అప్పులు పెరుగుతున్నాయి. ఆదాయం తగ్గుతోంది:
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎగవేయడానికి చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రకరకాల స్కెచ్‌లు. సంపద సృష్టిస్తానన్నాడు. తన కళ్లెదుటే ఆవిరి. ఆ సంపద తన జేబులోకి, తనకు సంబంధించిన వారి జేబుల్లోకి పోతోంది. సంపద పెరగకపోగా, ఆదాయంతో సహా అన్నీ తగ్గుతున్నాయి.

రాష్ట్ర జీఎస్‌డీపీలో మా హయాంలో అప్పుల శాతం 4.08 శాతం అయితే, చంద్రబాబు పాలనలో ఏడాది కాలంలో అది ఏకంగా 5.12 శాతం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు చూస్తే, మా హయాంలో అది 2.65 శాతం అయితే (అప్పుడు రెండేళ్లు కోవిడ్‌ ఉంది) అది ఇప్పుడు ఏకంగా 3.61 శాతం.

దారుణంగా అప్పులు:
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏడాది కాలంలోనే దారుణ అప్పులు చేశారు. మా హయాంలో 5 ఏళ్లలో అన్నీ కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,61,301 కోట్లు. అంటే మా 5 ఏళ్ల హయాంతో పోలిస్తే ఏకంగా 48.5 శాతం అప్పు చేశాడు. మా హయాంలో రెండేళ్లు కోవిడ్‌ ఉంది. ఇప్పుడు లేకపోయినా అదీ పరిస్థితి.

ఇదీ అప్పుల పరిస్థితి:
2024–25 సంవత్సరం ముగిసే నాటికి రూ.81,597 కోట్లు.
ఏప్రిల్, మే మాసాల్లో 22,500 కోట్లు.
జూన్‌లో చేసిన అప్పులు మరో 14 వేల కోట్లు. ఎస్‌డీఎల్‌ బారోయింగ్స్‌
ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ త్రూ ఏపీపీఎఫ్‌సీ రూ.710 కోట్లు.
ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ త్రూ ఏపీ మార్క్‌ఫెడ్‌ రూ.6000 కోట్లు.
ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ త్రూ సివిల్‌ సప్లయ్‌స్‌ కార్పొరేషన్‌ రూ.2000 కోట్లు.
ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ త్రూ ఏపీఎండీసీ బాండ్స్‌ రూ.3,489 కోట్లు.
బారోయింగ్స్‌ సెక్యూర్డ్‌ ఆన్‌ అకౌంట్‌ ఆఫ్‌ అమరావతి (వరల్డ్‌ బ్యాంక్, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా) రూ.15,000 కోట్లు.
హుడ్కో ద్వారా రూ.11,000 కోట్లు.
కెఎఫ్‌డబ్ల్యూ జర్మనీ సంస్థ ద్వారా మరో రూ.5000 కోట్లు.
బారోయింగ్స్‌ సెక్యూర్డ్‌ ఆన్‌ అకౌంట్‌ ఆఫ్‌ అమరావతి రూ.31,000 కోట్లు.
ఇవన్నీ కలుపుకుంటే రూ.1,61,301 కోట్లు చంద్రబాబు గారు 12 నెలల కాలంలో చేసిన అప్పులు.

ఆ ముఠా దోచుకుంటోంది:
రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఖజానాకు రావడం లేదు. చంద్రబాబు, ఆయనకు చెందిన ముఠా పంచుకుంటోంది. 2024–25లో రాష్ట్ర ట్యాక్స్, నాన్‌ ట్యాక్స్‌ సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌) చూస్తే..అంటే గత ఏప్రిల్, మే నెలల్లో ఆ మొత్తం రూ.14,580 కోట్లు. అదే గత ఏడాది మా ప్రభుత్వ హయాంలో చూస్తే.. అంటే 2024 ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ ఆదాయం రూ.14,644 కోట్లు. నిజానికి ఈ ఏడాది ఆ ఆదాయం పెరగాల్సింది పోయి, మైనస్‌ 0.44 శాతం తగ్గింది.

అదే విధంగా గత మా ప్రభుత్వ హయదాంలో 2023–24లో ప్రభుత్వ ఆదాయం రూ.93,354 కోట్లు కాగా, 2024–25లో వచ్చిన ప్రభుత్వ ఆదాయం రూ.96,227 కోట్లు. అంటే అంతకు ముందు ఏడాది కంటే గత ఏడాది రాష్ట్రంలో 3.08 శాతం ఆదాయం మాత్రమే పెరిగితే, అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ పెరుగుదల ఏకంగా 12.04 శాతం. దాంతో పోలిస్తే.. సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పే చంద్రబాబు సాధించింది అత్యల్పం. అంటే ఆ ఆదాయమంతా చంద్రబాబు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోంది.

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన. తాకట్టు:
అన్నింటికన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబునాయుడు చెప్పే అబద్ధాలు. తాను అబద్ధాలు ఆడుతూ తానెప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తినీ తాకట్టు పెట్టలేదని ఈ మధ్య కాలంలో చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడు. మరి ఆయన చేసింది ఏమిటో చూడండి. ఏపీఎండీసీ జీవో నెం: 69. డేట్‌. 24.04.2025. పర్మిషన్‌ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు.. ఏపీఎండీసీకి సంబంధించిన 436 మైన్స్‌ ప్రాజెక్టులను తాకట్టు పెడుతూ వాటి విలువ రూ.1.91 లక్షల కోట్లు చూపిస్తున్నాడు. ఏందయ్యా చంద్రబాబూ దీని అర్థం ఏంది అని అడుగుతున్నా. YS Jagan press meet

ఇంతటితో ఆగలేదు ఈ పెద్దమనిషి. బాండ్లు ఇష్యూ చేశాడు. ఎంత దారుణంగా ఇష్యూ చేశాడంటే.. ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్లు.. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు. ఎస్డీఎల్‌ (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్లు. సెంట్రల్‌ గవర్నమెంట్‌. ఎఫ్‌ఆర్బీఎం లిమిట్స్‌ కింద ఆర్బీఐ ఇస్తుంది) ప్రతి వారం ఆర్బీఐ వద్దకు స్టేట్‌ గవర్నమెంట్‌ పోతుంది. ఆ లిమిట్స్‌ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. ఈ పెద్ద మనిషి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దాని కన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు.

గట్టిగా నిలదీయండి:
ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఈ పెద్దమనిషి, ఇన్ని మోసాలు చేస్తూ ఈ పెద్దమనిషి ఇప్పుడు ప్రతి ఇంటికీ తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను ఇంటింటికీ పంపిస్తాడట. నేను ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులు వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ల కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, చంద్రబాబు ఇచ్చిన బాండ్లను అందరూ కూడా రెడీగా పెట్టుకోమని అడుగుతున్నా. రెడీగా పెట్టుకుని ప్రతి ఇంటికీ ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను ఒక్కసారి చూపించండి. వారికి చూపించి ఈ సంవత్సర కాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడుకు గట్టిగా ఆ నాయకుల్ని డిమాండ్‌ చేయాలని అడుగుతున్నా. YS Jagan press meet

క్యూఆర్‌ కోడ్‌తో టీడీపీ మ్యానిఫెస్టో:
ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు మీ అందరికీ ప్రజలందరికీ కూడా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ, అంటే రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబు మేనిఫెస్టో అని హెడ్డింగ్‌ పెట్టి.. తెలుగులో అర్థం కావాలంటే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అని పెట్టి క్యూఆర్‌ కోడ్‌ లో ఈ చంద్రబాబు మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్‌ చేసుకునే విధంగా.. ఒకవేళ ఎవరి ఇంట్లో అయినా మేనిఫెస్టో లేకపోతే, వెంటనే డౌన్లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రిలీజ్‌ చేస్తాం.

దాన్ని డౌన్లోడ్‌ చేసుకోండి. మీ ఫోన్లలో ప్రతి కుటుంబం కూడా వీళ్లు ఎంత బాకీ ఉన్నారో, మేనిఫెస్టో ఐటమ్స్‌ ను చూసిన తర్వాత, ప్రతి కుటుంబానికీ వీళ్లు ఎంత బాకీ ఉన్నారో, ఏయే ఐటమ్‌ వీళ్లకు వర్తిస్తుందో తెలుసుకుని చంద్రబాబును, వచ్చిన వాళ్లను నిలదీస్తూ గట్టిగా అడగండి. అప్పుడైనా కనీసం వాళ్లకు సిగ్గు వచ్చి ఈ సంవత్సర కాలంలో ఎగరగొట్టిన సొమ్మును మనకు ఏమైనా వెనక్కి ఇస్తారేమో మనమంతా ఆశిద్దాం. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అని అందరికీ ఓటీపీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ పోయి ఎస్‌ఎంఎస్‌ పంపారు. ఓటీపీ ఇచ్చారు. మెహరాజ్‌ బేగం షేక్‌ అని ముస్లిం మహిళ. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ.. మీ నమోదు సంఖ్య ఇచ్చారు. మీ సంక్షేమ వివరాలకు వాళ్లకు సంబంధించిన వెబ్‌ సైటు ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాశారు. YS Jagan press meet

పేరు మెహరాజ్‌ బేగం షేక్, యూనిక్‌ ఐడీ కోడ్, వయసు, కులం, వత్తి, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఇద్దరు, 18 సంవత్సరాల కంటే పైబడి వయసున్న మహిళలు ఇద్దరు, నిరుద్యోగ యువతీ యువకులు సున్నా, నియోజకవర్గం రాజంపేట, ఈ స్కీములు వర్తిస్తాయని రాశారు. వర్తించబడే పథకం ఆడబిడ్డ నిధి 1500, ఏడాదికి అందే సాయం 2. అంటే 36 వేలు, తల్లికి వందనం వర్తిస్తుంది రూ.30 వేలు, అన్నదాత సుఖీభవ వర్తిచదు, యువగళం వర్తిచదు, ఏడాదికి అందే మొత్తం మీకు రూ.66 వేలు, ఐదేళ్లలో అందే మొత్తం రూ.3 లక్షలు పెట్టారు.

మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు, అని మహాశక్తి, దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, జూన్‌ 2024 నుంచి ప్రారంభం అని రాశారు. సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం అది కూడా రాశారు. మీ మద్దతు తెలపడానికి మిస్‌ కాల్‌ ఇవ్వండి అని రాశారు. ఇవి ప్రతి ఇంటికీ పంపించారు. ఓటీపీ ఇప్పించారు, మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు. YS Jagan press meet

బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ. బెనిఫిట్‌ డీటెయిల్స్‌. అభినందనలు అంట. మీరు 3 లక్షల 30 వేలు పొందేందుకు.. మీ కుటుంబం అర్హత పొందింది అని పెట్టారు. మీ కుటుంబం అర్హత పొందింది అన్నారు. 2024 జూన్‌ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాశారు. తర్వాత భవిష్యత్తు గ్యారెంటీ, ఇది బాబు గ్యారెంటీ అని రాశారు. చంద్రబాబు నాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని ఏకంగా బాండ్‌ ఇచ్చాడు సామీ. ఓటీపీ నంబర్‌ ఇచ్చారు, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానన్నాడు.

అన్ని చేసి జూన్‌ 2024 నుంచి నమోదు అవుతుందని చెప్పాడు. అంటే మీ అందరికీ కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఇంత బాకీ ఉన్నాడని. ఇప్పుడు ప్రజలందరికీ ఒక్కటే విజ‘ప్తి చేస్తున్నా. చంద్రబాబు ఇచ్చినవన్నీ బయటకు తీయండి. మేనిఫెస్టో మనం క్యూఆర్‌ కోడ్‌ లో పెడతాం. అది కూడా డౌన్లోడ్‌ చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు.. అయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారు.. త్రికరణ శుద్ధితో ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఇచ్చినాడయ్యా ఈ బాండూ.. ఓటీపీ నంబర్‌ ఇచ్చినాడు, దానికి తోడు మాతో ఫోన్‌ చేయించాడు, ఎస్‌ఎంఎస్‌ ఇచ్చాడు, అన్నీ అయ్యాయి. మాకు సంవత్సరం అయిపోయింది. మా అవసరాలు చాలా ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నాము, మా ఇబ్బందులు తీరాలి, చంద్రబాబు నాయుడూ ఎప్పుడిస్తావు, అని గట్టిగా నిలదీయమని అడుగుతున్నా. YS Jagan press meet

అందరం కలిసి పోరాడుదాం:
వడ్డీతో సహా ఇమ్మని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబును, వాళ్ల ఎమ్మెల్యేలను నిలదీస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరఫున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. మళ్లా ధర్నా చేద్దాం. మళ్లా కలెక్టర్లను ముట్టడించే కార్యక్రమం చేద్దాం. అందరం కలిసి గట్టిగా ధర్నా ప్లాన్‌ చేద్దాం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
నా పల్నాడు పర్యటనపై టీడీపీ నేతల విమర్శలు. దండయాత్ర చేశారని ఆరోపిస్తున్నారు. మీరు పర్యటనలకు వెళితే నాయకులపై కేసులు పెడుతున్నారు. ఆయన మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్‌.. పోలీసుల వేధింపుల వల్ల చనిపోయిన నేపథ్యంలో.. అతని తండ్రి ప్రైవేటు ఫిర్యాదు చేస్తే, కోర్టు ఆదేశించినా కేసు నమోదు చేయలేదు. ఆ సీఐ రాజేష్‌ మీద ప్రైవేట్‌ కంప్లైంట్‌ లాంచ్‌ చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చినా కేసు కట్టలేదు. అలాంటి ఆయన బాధతో భాగస్వామినవుతూ.. నేను మా పార్టికి సంబంధించిన మా వాళ్లకు ఇంటికి వెళ్లడం తప్పా అని అడుగుతా ఉన్నా. YS Jagan press meet

ఆయన పెట్టింది తన కొడుకు విగ్రహం. అది పెట్టుకున్నది ఆయన సొంత స్థలంలో.. అదీ తన ఇంటిపక్కన..అది ఆయన ఇష్టం.. ఈ విషయంలో నేను పోవడం ఏ విధంగా తప్పు అవుతుంది? అలా పోవటం తప్పన్నట్లు కర్ఫ్యూ వాతావరణం తీసుకురావడం తప్పు కాదా? అలా పోవటం తప్పన్నట్లుగా.. నేను ఏ ఇంటికైతే నేను వెళ్లానో.. ఆ ఇంటిలో ఉన్న పెద్దాయన వెంకటేశ్వర్లు మీద కేసు పెట్టడం ఎంతవరకు ధర్మం ఇది? అంటే డెమోక్రసీలో ఉన్నామా? లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిధర్శనం.. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు..రాష్ట్రంలోనే ఉంటాయి. YS Jagan press meet

అసలు సమస్య ఎవరు సృష్టిస్తున్నారు?:
లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు ఎవరు క్రియేట్‌ చేస్తున్నారు? నేను పోతాను.. కలుస్తాను.. వస్తాను.. వీళ్లకు ఏం సంబంధం? రైతుల దగ్గరకు వెళ్లాను.. కలిశాను..రైతు సమస్యలు లేవనెత్తాను.. ప్రెస్‌ లో అడ్రస్‌ చేశాను.. రైతు సమస్యలనే లేవత్తాను.. రైతు సమస్యలే చెప్పాను..ఎవరికి ఏం తప్పు జరిగింది..ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా నా ధర్మం నేను చేశాను.. నా కార్యక్రమం అడ్డుకుంది మీరు.. ఎందుకు అడ్డుకున్నారు.? నా ప్రోగ్రాంకు ఎంతమంది వస్తే ఎందుకు నీకేం బాధ.. నీ ప్రోగ్రాంకు రాలేదని నీకెందుకంత బాధ?

నీ ముఖం చూడటానికి ఎవరు రావడం లేదంటే.. నువ్వు చేసిన పనులు అట్లా ఉన్నాయి. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి.. అందరినీ మోసం చేసి అందరి ఉసురు నువ్వు పోసుకుంటా ఉన్నావ్‌.. కానీ మా ప్రభుత్వంలో చెప్పినమాట మేము నిలబెట్టుకున్నాము..అందరికీ మంచి చేశాం.. అందుకే అందరికీ మా పార్టీ మీద ప్రేమ ఎక్కువైంది.. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్లు వస్తే తప్పేముంది? వాళ్లు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమన్నా వారికి భోజనం పెడుతున్నావా?. వారిని చూసుకుంటున్నావా? నీకేం బాధ..? మా పార్టీ వాళ్లు..నన్ను అభిమానించేవాళ్లు..నన్ను ప్రేమించే వాళ్లు ..ప్రజలతో నేను మమేకం అవుతున్నాను. వాళ్లకు లేని బాధ నీకెందుకు బాధ?

గంజాయి బ్యాచ్‌
ప్రతి ఒక్కరి మీద అభాండాలు వేయడం అయకు అలవాటై పోయింది.. నేను వెళ్లేవరకు రైతుల సమస్యలను ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? అదే పొగాకు రైతులకు గానీ..మిర్చి రైతులకు గానీ. అదే తెనాలిలో జరిగిన ఘటనలో గానీ.. నిన్న జరిగిన ప్రైవేటు కంప్లైంట్‌ విషయంలో గానీ…ఇవన్నీ జన్యూన్‌ ప్రాబ్లమ్స్‌ అవునా..కాదా? ప్రతి ఒక్కరికీ జరిగిన నష్టం అవునా..కాదా? మరి ఆ సందర్భాల్లో .. వారికి జరిగిన నష్టంలో..నేను వాళ్లకు సంఘీభావం తెలుపుతూ..వాళ్లతో పాటు వారి బాధలో నేను ఏకమైనప్పుడు..నేను మమేకం అయినప్పుడు నీకేం బాధ.. నేను పాలుపంచుకునే వరకు నువ్వెందుకు స్పందించడం లేదు..నువ్వు స్పందించి ఉంటే నేను పోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా? నువ్వు స్పందించడం లేదు కాబట్టే..నేను పోవాల్సి వస్తోంది.. నువ్వుబాగా పట్టించుకుని ఉంటే సమస్య ఏముంది?

రప్పా.. రప్పా పోస్టర్‌:
గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్పా రప్పా నరికేస్తాం.. అనే పోస్టర్‌ గురించి..
ఇదేదో సినిమా డైలాగ్‌ అనుకుంటా సామీ.. పుష్ప 2 సార్‌.
పుష్ప సినిమా డైలాగ్‌ లు పెట్టినా తప్పేనా? దానికీ కేసులు పెడుతున్నారంటే పజ్రాస్వామ్యంలో ఉన్నామా? లేమా అనేది నాకర్థం కావడం లేదు. పుష్ప డైలాగులు చెప్పినా తప్పే. గడ్డం ఇట్టన్నా తప్పే. గడ్డం అట్టన్నా తప్పే. ఏంది సామీ ఇది. ఏ ప్రపంచంలో ఉన్నాం మనం. ఇది ప్రజాస్వామ్యమేనా? ఆ పోస్టర్‌ పట్టుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, అతడికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉందని జర్నలిస్టులు చెప్పాక..
ఆ పోస్టర్‌ పట్టుకున్న యువకుడికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందంటే, అది టీడీపీ వాళ్లే చేయించినట్టనుకోవాలా? ఒకవేళ పార్టీ మారి ఉంటే అంతకన్నా మంచి పరిణామం ఉండదు. టీడీపీ కార్యకర్త కూడా చంద్రబాబుమ మీద కోపంతో పార్టీ మారాడంటే మంచిదే కదా.

గనుల తాకట్టు ఏమిటి!:
మైన్స్‌ను తాకట్టు పెట్టి అప్పులు తేవాలని ప్రభుత్వం ప్రపోజల్‌ పెట్టింది అంటున్నారు. ఎప్పటిలోగా తీసుకోవాలని, అప్పు అంతా ఒక్కసారిగా తీసుకొస్తారా..? దాని గురించి వివరిస్తారా? జీవో నెంబర్‌ 69 ద్వారా ఆస్తులు తాకట్టు పెట్టుకునే స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం ఏపీఎండీసీకి హక్కులు కల్పించింది. ఇప్పుడు ఏపీఎండీసీ ఆ హక్కును ప్రైవేటు వ్యక్తులకు లేదా కంపెనీకి కల్పించింది. ఇప్పటికే రూ. 3,489 కోట్లు అప్పు తెచ్చారు. ఈ అప్పుకి సంబంధించి రెండు రకాల గ్యారెంటీలు ఇస్తున్నారు. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ మీద రైట్‌ ఇస్తూ ఒకరమైన గ్యారెంటీ, రెండో రకం 439 మైన్లకు సంబంధించి రైట్స్‌ వీరికి తాకట్టు పెడుతున్నారు. ఇదంతా ఏపీఎండీసీకి హక్కులు కల్పిస్తూ గవర్నమెంట్‌ ఇచ్చిన జోవో. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్‌ మీద అధికారాన్ని తాకట్టు పెట్టడంతోపాటు సిమిలర్‌గా కన్సాలిడేటెడ్‌ ఫండ్స్‌ మీద ప్రైవేటు వ్యక్తులకు అజమాయిషీ ఇస్తూ వారికి తాకట్టు పెట్టాడు. ఆ బాండ్లను ఎవరైతే తీసుకుంటారో వారికి ఆ మేరకు అడిషినల్‌ కంఫర్ట్‌ ఇచ్చారు. ఇలాంటి కంఫర్ట్‌ ఇవ్వడం దేశంలోనే తొలిసారి.

దాంతో నాకేం సంబంధం?:
మీ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది. ఆ ట్యాపింగ్‌లో పర్సనల్‌ విషయాలు కూడా తీసుకొచ్చారని షర్మిల చెబుతున్నారు. దానికేం సమాధానం చెబుతున్నారు? ఆ సమయంలో ఆమె క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో చేశారేమో. నిజంగా చేశారో లేదో కూడా తెలియదు. ఒకవేళ పక్క రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం షర్మిలమ్మ ఫొన్‌ ట్యాపింగ్‌ చేసి ఉంటే దానికి నాకేంటి సంబంధం.

గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు:
గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అనేది ఎలా చేస్తారనేది, ఎప్పుడు చేస్తారనేది ముఖ్యమైన అంశాలు. శ్రీశైలం నుంచి నీరు నాగార్జున సాగర్‌కి పంపించాల్సిన అసవరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీరు వాడుకోగల స్వేచ్ఛ ఉంటే ఆ నీరు పైకి పంపించాల్సిన అవసరం లేదు. కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కి ఏదైతే నీరుపోతాయో అవి పోలవరం ఎక్సెస్‌ వాటర్‌ని మనం థ్రూ పోలవరం కెనాల్‌ ద్వారా ఇప్పుడు వస్తున్న నీటిని ఆ పోలవరం కెనాల్‌ని మరింత వెడల్పు, లేదా డీపనింగ్‌ చేసుకుంటే జూన్‌ జూలై ఆగస్టు సెప్టెంబర్‌ నాలుగు నెలల్లోనే ఓవర్‌ ప్లో ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి 80 శాతం ఫ్లో 3000 టీఎంసీ ఉంటే దాన్ని స్టోరేజ్‌ చేసుకోలేం. ఎందుకంటే పోలవరం కెపాసిటీ 190 టీఎంసీ మాత్రమే. జూన్‌ జూలై ఆగస్టు సెప్టెంబర్‌ నాలుగు నెలల్లోనే ఆ నీటిని తీసుకు రావాలి. అందుకే పోలవరం కుడికాలువ కెపాసిటీ ఇంకొంచెం పెంచి కష్ణా ఆయకట్టుకి సప్లిమెంట్‌ చేయగలిగితే అప్పుడు ఆ నీరు అక్కడ మిగులుతాయి. నాగార్జున సాగర్‌కి వెళ్లి శ్రీశైలం నుంచి కృష్ణా ఆయకట్టుకి నీరిచ్చే కంటే పోలవరం కెనాల్‌ని మరింత వెడల్పు, లేదా డీపనింగ్‌ చేసుకుంటే సప్లిమెంటేషన్‌ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్‌ విజన్‌.

ఇదంతా ఫేజ్‌ బై ఫేజ్‌ చేయాల్సిన పనులు. ఒకేసారి చేయడం కుదరదు. శ్రీశైలంలో మిగిల్చిన నీటిని తీసుకోని పోవాలంటే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పూర్తి చేయాలి. కెనాల్‌ వైడనింగ్‌ పనులు కూడా జరగాలి. ఆ నాలుగు నెలల్లోనే నీరు ఓవర్‌ ఫ్లో కావాలి. ఎక్సెస్‌ వాటర్‌ని ఆ నాలుగు నెలల్లోనే తీసుకెళ్లాలి. రిజర్వాయర్‌ లో నీటిని నింపుకుంటూ వెళ్లాలి. వర్షాలు పడిన నాలుగు నెలల్లోనే ఈ పనులన్నీ జరగాలి. అక్కడా ఇక్కడా కాంప్రహెన్సివ్‌గా పనులు జరగాలి.’’ అని వైయస్‌ జగన్‌ వివరించారు.

ఇవీ చదవండి: CBN Reaction : జగన్ రప్పా రప్పా.. డైలాగ్‌పై చంద్రబాబు రియాక్షన్
YS Jagan Pushpa Dialogue : రప్పా.. రప్పా.. జగన్ నోటి వెంట పుష్ప డైలాగ్ వైరల్
YS Jagan at Rentapalla : చంద్రబాబూ.. కమ్మవారిపై ఎందుకింత కక్ష? రెంటపాళ్లలో జగన్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు