State Entry Road: జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ కట్టి ప్రయాణించడం తెలిసిందే. కానీ స్టేట్ రోడ్లపై కూడా ట్యాక్స్ వసూలు చేస్తే ఎలా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. (State Entry Road)
తాజాగా ఇందుకు సంబంధించి కీలక అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ఆలోచనకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రహదారుల నిర్వహణపై సీఎం వినూత్న ఆలోచన చేస్తున్నారని సమాచారం.
జాతీయ రహదారుల (హైవే) తరహాలో రాష్ట్ర రోడ్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యోచన చేస్తున్నారు. రాష్ట్ర రోడ్ల నిర్మాణం, నిర్వహణ ఔట్ సోర్సింగ్ సంస్థకు ఇద్దామని ముఖ్యమంత్రి తాజాగా అభిప్రాయపడ్డారు. హైవేల తరహాలో రాష్ట్ర రోడ్లపై టోల్ విధింపునకు సీఎం యోచన చేశారు.
గ్రామాల నుంచి మండలాల వరకు టోల్ ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బైక్ లు, ఆటోలకు, ట్రాక్టర్లకు టోల్ వర్తించబోదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాల్లో అమలు చేద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర రోడ్లకు టోల్ విధింపుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను చంద్రబాబు అడిగారు. ప్రజలను ఒప్పించగలిగితే రోడ్లు బాగుపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
టోల్ ప్రతిపాదన వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సివస్తుందంటూ చంద్రబాబు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ప్రతిపాదన బాగుందంటూ చేతులెత్తి ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారని పలు టీవీ చానళ్లలో వార్తలు రావడం గమనార్హం.
అంటే దీని అర్థం ప్రజలను టోల్ వసూలుకు మానసికంగా సిద్ధం చేయడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కరెంటు చార్జీల భారం మోపేందుకు సిద్ధమైన కూటమి సర్కార్, ఇప్పుడు ప్రజల నుంచి వినూత్న పద్ధతుల్లో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
ఇవీ చదవండి: AP Roads: జనవరి కల్లా గుంతలనేవి లేకుండా చేస్తాం: CBN
256 KM Straight Road: సౌదీలో అద్భుతమైన రహదారి.. ఒక్క మలుపూ లేకుండా 256 కి.మీ. హైవే
Roads: రోడ్లపై గుంతలా? దానంతట అదే పూడుకుపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది!
Long Drive: Long drive road trip plans for international tourists
