CM Jagan At Polavaram: చిన్న సమస్యను విపత్తుగా చూపే దౌర్భాగ్యమైన మీడియా..! సీఎం జగన్‌ ఫైర్‌

CM Jagan At Polavaram: పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు (CM Jagan At Polavaram) పనుల పురోగతి, నిర్వాసితుల కుటుంబాలకు పునరావాసం గురించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారమే నిర్వాసిత కుటుంబాలను తరలించాలని సూచించారు. 12, 658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చి దిద్దాలని సీఎం జగన్‌ సూచించారు. పోలవరం వద్ద బ్రిడ్జిని నిర్మించాలని చెప్పారు.

దౌర్భాగమ్యపు మీడియా…

దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌ను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇది పూర్తయితే మెయిన్‌ డ్యామ్ పనులు చురుగ్గా కొనసాగేందుకు వీలుంటుందన్నారు. డిసెంబర్‌ కల్లా డయా ఫ్రం వాల్‌ పనులను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ వర్గం మీడియాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో చిన్న సమస్యను కూడా విపత్తుగా చూపించాలని భావిస్తున్నమీడియా మన రాష్ట్రంలో ఉందని అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీలు వదిలేశారని, వరద నీటి ప్రవాహం కారణంగా ప్రాజెక్టు నిర్మాణానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు.

ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యామ్ నిర్మాణానికి కీలకమైన డయా ఫ్రం వాల్‌ దెబ్బతినడంతో ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తోందని సీఎం జగన్ మండిపడ్డారు. ఇది మాత్రం ఎల్లో మీడియాకు కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ఎందుకంటే.. రామోజీ బంధువులకే నామినేషన్‌ పద్దతిలో పనులు అప్పగించారని, అందుకే ఆ మీడియాలో చూపలేదన్నారు. ప్రాజెక్ట్‌ స్ట్రక్చర్‌లో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌వాల్‌.. ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు పనుల పురోగతిపైనా అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలన జరిపారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను తిలకించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్ ఎత్తు పెంపు, ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫర్‌ డ్యామ్ పనులను కూడా సీఎం చూశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రణాళిక లోపం కారణంగా దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌ను సీఎం పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-2 వద్ద కోతకు గురైన డయాఫ్రమ్‌ వాల్‌ చూశారు.

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకించారు. వరదల సమయంలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పెంచిన ఎత్తు తీరును, పూర్తయిన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. అంతకు ముందు సీఎం జగన్ పోలవరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేపట్టారు. సర్వే ద్వారా పోలవరం పనులను క్షుణ్నంగా చూశారు. సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పరిశీలన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

సీఎం చొరవతో నిధులు మంజూరు..

పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్‌ సర్కార్‌ వేగంగా పనులను చేపట్టింది. రికార్డు సమయంలో స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేశారు. కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు 44 మీటర్లకు పెంచారు. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ కంప్లీట్‌ అయ్యింది. రాజధాని ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారీ సీఎం జగన్ రాష్ట్ర అవసరాల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలతో సమావేశం అవుతుంటారు. తాజాగా ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్, ఆ తర్వాత కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలోనూ పాలు పంచుకున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం జగన్.. నిర్మలాసీతారామన్‌తో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి పెండింగ్‌ నిధులపై చర్చించి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో ఆమె స్పందించారు.

తాజాగా పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2013-14 ధరలు కాకుండా తాజా ధర మేర నిధులకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థికశాఖ రాసిన లేఖలో వెల్లడించింది. కేంద్ర ఆర్థికమంత్రి ఆమోదించినట్లు పేర్కొన్నారు. రూ. 10 వేల కోట్లు అడ్‌హక్‌గా ఇచ్చి ప్రాజెక్ట్‌ పూర్తికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. సీఎం విజ్ఙప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించి నిధులు మంజూరుకు జల శక్తి శాఖకు ఆదేశించారు. దీంతో పోలవరం మరింత వేగంగా నిర్మాణం చేసేందుకు మార్గం సుగమమైంది.

Read Also : CM Jagan Review On GIS: విశాఖ ఐటీ హబ్‌ కావాలి.. రివ్యూ మీటింగ్‌లో సీఎం జగన్

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles