Pushpa2TheRule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 ది రూల్ (Pushpa2TheRule) చిత్రం డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఒక్క రోజు ముందే పుష్పరాజ్ ఆగమనం ఉంటుందని తేలింది. ఈ మేరకు చిత్ర బృందం ఒక్కటి తక్కువైంది… డైలాగ్ తో అల్లు అర్జున్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. డిసెంబర్ 5నే పుష్పరాజ్ వస్తున్నాడని క్లారిటీ ఇచ్చింది.
ఇది పుష్పరాజ్ ఆగమనం కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియులందరికీ ఓ గుడ్ న్యూస్. అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 5న బిగ్ స్క్రీన్స్ లో రానుంది. మొదట ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు డిసెంబర్ 5నే వస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది.
అల్లు అర్జున్ ఎక్స్ లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. పోస్టర్‌లో అల్లు అర్జున్ తన పాత్రను ధరించి, నోటిలో సిగార్‌తో తుపాకీ పట్టుకుని కనిపించాడు. సైడ్ నోట్‌లో “పుష్ప 2: డిసెంబర్ 5న రూల్” అని రాసి ఉంది.
అన్ని భాషలలో టీజర్‌లు, పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. అల్లు అర్జున్ అభిమానులు ఇష్టపడేలా చిత్రాన్ని అందిస్తామని చిత్ర బృందం హామీ ఇచ్చింది.
ఇవీ చదవండి: Allu Arjun: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. ఏమైందంటే..
Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
Pushpa 2 Update: పుష్ప 2పై కీలక అప్ డేట్ ఇచ్చిన టీమ్.. అంచనాలను మించి..
Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. పుష్ప 2 ట్రైలర్ ఎప్పుడంటే
Pushpa 2 Update: పుష్ప 2 మూవీ లేటెస్ట్ అప్ డేట్.. మళ్లీ వాయిదా వేసేదే లే!
Rashmika: I4Cs నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. డీప్ ఫేక్‌పై కామెంట్స్!
National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ నటుడు రిషభ్
