2025 Mesha Rasi: 2025 సంవత్సరం వచ్చేస్తోంది. ద్వాదశ రాశులకు సంబంధించి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఈ కొత్త సంవత్సరంలో కలుగుతాయన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది. తమ రాశి ఫలితం ఎలా ఉంటుందని ప్రజలు నెట్టింట, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నారు. మేష రాశి వారికి 2025 సంవత్సరం రాశి ఫలాలు (2025 Mesha Rasi) ఎలా ఉన్నాయో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి (Venu swamy) తెలియజేశారు. ఆ వివరాలు ఇవీ.. (2025 Mesha Rasi Phalalu in telugu)
మేష రాశి
అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు
భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు
కృత్తిక నక్షత్రం 1వ పాదం
జన్మనక్షత్రం తెలియని వారికి మీ పేరులోని మొదటి అక్షరం చు, చె, చొ, ల, లి, లు, లె, లొ, అ అనే అక్షరాలతో మీ పేరు వస్తే మీది మేష రాశి అని అర్థం.
2025 సంవత్సరం మేష రాశి వారికి (2025 Mesha Rasi)
ఆదాయం: 2
వ్యయం: 14
రాజపూజ్యం: 5
అవమానం: 7
ఈ రాశి స్త్రీ, పురుషులకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అనుకూలం. బాహ్య వ్యయాధిపతి అయిన గురువు 2వ స్థానంలో సంచరించడం వల్ల ఏ వృత్తి వారికైనా సరే ఎలాంటి లోటుపాట్లూ కలగవు. చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా తగిన ఆదాయం చేతికందుతుంది. వ్యవహారాలు చేసే వారికి జయం కలుగుతుంది. చేసే కార్యాల్లో అన్ని విషయాల్లో మంచి నిపుణత. ఇతరులను తమ వశం చేసుకునేటట్టుగా పనికొస్తుంది. మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తించేట్టుగా గౌరవ లాభాలు, జీవన లాభాలు పొందుతారు.
పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల అధైర్యం, పిరికితనం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది కనిపించకుండా జాగ్రత్త వహించాలి. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నా తదుపరి కొంత మేలు జరుగుతుంది. అంటే జూన్ మాసం వరకు కొంత స్లోగా ఉన్నా జూన్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవాలు, పెద్ద వారితో పరిచయాలు, గృహంలో శుభకార్యాలు. రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందువల్ల గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను ఈ సంవత్సరం మేష రాశి వారు పొందుతారు.
ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతగా జీవిస్తారు. మరీ ముఖ్యంగా శత్రువులే మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. గతంలో నిలిచిపోయిన శుభకార్యాలు తప్పక జరుగుతాయి.స్థిర, చర ఆస్తి అభివృద్ధి జరుగుతుంది. శని ప్రభావం వల్ల భూ సంబంధ వ్యవహారాల్లో తప్పక జయం కలుగుతుంది. జీవన స్థాయి పెరుగుతుంది. సుఖ సంతోషాలుకలుగుతాయి. జీవనం ఆనందంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. సంఘంలో మీ పరపతి పెరుగుతుంది. గురుబలం వల్ల మీ మనోధైర్యం పెరిగి పనులను పూర్తి చేయగలుగుతారు.
ఉద్యోగులకు..
ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. యోగదాయకమైన కాలం. ప్రమోషన్లతో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొలువుల్లో పని చేసే వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. గతంలో ఉన్న కోర్టు కేసుల నుంచి విముక్తి పొందుతారు. ప్రయివేటు కంపెనీల్లో పని చేసే వారికి శని ప్రభావం వల్ల మరో కంపెనీకి మార్పు, స్థాన చలనం, గృహ చలనం తప్పదు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అవకాశాలు లభిస్తాయి. జీవితంలో సెటిల్ కాని వారికి, పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురవుతుంది.
రాజకీయ నాయకులకు..
రాజకీయ నాయకులకు సంబంధించి గురు బలం బాగుంది. శని బలం ఉన్నందున అనుకూలంగా ఉంటుంది. అధినాయకులతో సఖ్యత. ధన వ్యయం తప్పదు. ప్రజల్లో గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం ఉంటుంది. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పకుండా లభిస్తుంది. ధనం మంచినీళ్లలాగా ఖర్చు అవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మీకు విజయం చేకూరుతుంది.
సినిమా వాళ్లకు, కళాకారులకు..
సినిమా ఇండస్ట్రీ వారికి, కళాకారులకు అనుకూలంగా ఉండదు. గురుబలం వల్ల మాత్రం అవార్డులు,రివార్డులు లభిస్తాయి. గాయనీ, గాయకులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. టీవీ, సినిమాల్లో ఉన్న వారికి విజయాలు దక్కుతాయి. అవకాశాలు తక్కువే అయినప్పటికీ వచ్చినవి విజయాలుగా మార్చుకుంటారు. గృహ నిర్మాణం, లేదా స్థలం కొనడం తప్పకుండా జరుగుతుంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతారు.
వ్యాపారస్తులకు..
ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకూ అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు పొందగలుగుతారు. హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టు పనులు చేసే వారికి, గృహ నిర్మాణ పనులు చేసే వారికి విశేషంగా లాభం ఉంటుంది. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రమే. రియల్ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం లాభాలు ఉండవు. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి మంచి లాభాలు చూస్తారు. సరుకులు నిల్వ చేసే వారికి చాలా బాగుంటుంది. బంగారం, వెండి వ్యాపారులకు కొద్దిపాటి నష్టం తప్పకపోవచ్చు. రైస్ మిల్లర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. హోటల్ రంగం చాలా డెవలప్ అవుతుంది.చిన్న చిన్న కిరాణా వ్యాపారస్తులకు, హోటళ్లకు చాలా లాభదాయకంగా ఉంటుంది.
విద్యార్థులకు..
విద్యార్థులకు గురుబలం చాలా బాగుండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఈడీ, ఐసెట్ మొదలైన ఎంట్రన్స్ మంచి ర్యాంకులు సాధిస్తారు. సీట్లు పొందగలుగుతారు. చెడు సహవాసాలు కలిగి కొంత మేర మార్కులు తగ్గి నష్టపోతారు. క్రీడాకారులకు మంచి కాలమే. కొన్ని విజయాలు, కొంత మేర ఆ పతకాలు పొందగలరు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం తప్పకుండా పొందగలుగుతారు.
వ్యవసాయదారులకు..
వ్యవసాయ దారులకు సంబంధించి రెండు పంటలు బాగా పండుతాయి. శని 11వ ఇంట ఉన్నందున బాగుంటుంది. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలు తీరుస్తారు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలుంటాయి. స్థిరాస్తి వ్యయం, చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీలు నిర్వహించే వారికి లాభదాయకం. మంచి దిగుబడి సాధించి లాభాలు సాధిస్తారు. పండ్లతోటల వారికి నష్టాలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. కూరగాయల వారికి విపరీత లాభాలు ఉంటాయి.
స్త్రీలకు..
స్త్రీలకు కొంత అనుకూలంగా ఉంది. శని ప్రభావంతో మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు. రాజీ పడటం మంచిది.
ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారికి కొంత మేర ఉంది. ప్రారంభ దశ కాబట్టి అనుకూలత ఇస్తాడు. 98 శాతం ఈ సంవత్సరం మేష రాశి వారికి అనుకూలం ఉంది. 2 శాతం నెగిటివ్ ఫలితాలు కలుగుతాయి. పోలీసు, కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండం ఉంది.
ఇవీ చదవండి: 2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు
Rasi Phalalu 2024 Venu swamy: వేణు స్వామి చెప్పిన సంచలనాలు.. 2024లో ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!
Zarashatavari: హీరోయిన్లూ అసూయ పడే అందం.. ఏఐ భామ హాట్ ఫొటోలు
Rasulu : రాశులు ఎన్ని? వాటి ప్రాశస్త్యం ఏమిటి?
