శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Astrology

Rasulu : రాశులు ఎన్ని? వాటి ప్రాశస్త్యం ఏమిటి?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 30 జనవరి 2024

Rasulu : రాశులు 12. వాటి పేర్లు చాలా పురాతన కాలం నుంచి వస్తున్నాయి. అవి మొట్టమొదట మెసొపొటామియాలో క్రీస్తుపూర్వం 2 వ సహస్రాబ్దిలో ఉపయోగించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సమయంలో, ఈ రాశులు ఆకాశంలోని నక్షత్రాల గుంపులను సూచించేవని చెబుతారు. (Rasulu)

ఈ రాశుల పేర్లు ఆయా నక్షత్రాల గుంపులకు సంబంధించిన మూర్తి లేదా జంతువు పేరుపై ఆధారపడి ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉదాహరణకు, మేషరాశి మేకను సూచిస్తుంది. వృషభరాశి ఎద్దును సూచిస్తుంది. మిథునరాశి దంపతుల జంటను సూచిస్తుంది.

జ్యోతిష శాస్త్రంలో రాశులు 12 ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలా 12 రాశులలో కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహారేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి రుషుల చేత నిర్ణయించినవే మేషం, మీనం తదితర రాశులు.

సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక నెల రోజులు ఉంటాడు. ఆతరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి 2 గంటలు చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజన చేస్తారు.

ఒక రోజులో 12 లగ్నాలు ఉంటాయి. ప్రతి 2 గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం ఔతుంది. మేషానికి అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు. మిథునానికి అధిపతి బుధుడు. కటకముకు అధిపతి చంద్రుడు. సింహానికి అధిపతి సూర్యుడు. కన్యకు అధిపతి బుధుడు. తులకు అధిపతి శుక్రుడు. వృశ్చికానికి అధిపతి కుజుడు. ధనస్సుకు అధిపతి గురువు. మకర, కుంభాలకు వరుసగా శని అధిపతి. చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు.

రాశుల పేర్లు ఇవీ..

మేషరాశి (Aries) – మేషం
వృషభరాశి (Taurus) – వృషభం
మిథునరాశి (Gemini) – జంట
కర్కాటకరాశి (Cancer) – కప్పు
సింహరాశి (Leo) – సింహం
కన్యరాశి (Virgo) – కన్య
తులరాశి (Libra) – తులం
వృశ్చికరాశి (Scorpio) – గుర్రం
ధనుస్సురాశి (Sagittarius) – ధనుస్సు
మకరరాశి (Capricorn) – మేక
కుంభరాశి (Aquarius) – నీటి కుండ
మీనరాశి (Pisces) – చేపలు

ఇదీ చదవండి: Rasi Phalalu 2024 Venu swamy: వేణు స్వామి చెప్పిన సంచలనాలు.. 2024లో ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!

ట్యాగ్స్: , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading