Telangana crime news: గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలను కూడా కబళించేస్తోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు తారతమ్యాలు లేకుండా అందరికీ వస్తోంది. అప్పటిదాకా ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. మంచిర్యాల జిల్లాలో (Telangana crime news) ఈ ఘటన జరిగింది.
మంచిర్యాల జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలికను గుండెపోటు బలితీసుకుంది. చెన్నూర్ లో పండుగ పూట ఈ దుర్ఘటన జరిగింది. పట్టణంలోని పద్మనగర్ కాలనీకి చెందిన నివృతి (12) అనే చిన్నారి ఉదయాన్నే ఇంట్లో ఆడుకుంటూ ఒక్కసారిగా పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నివృతిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే నష్టం జరిగిపోయింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు నివృతి మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. గుండె పోటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమార్తె ఉన్నత చదువులు చదివి తమకు పేరు ప్రతిష్టలు తెస్తుందని, బంగారు భవిష్యత్తు కలలుగన్న ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి ఆశలు అడియశాలుగా మారాయి. గుండెపోటు 12 ఏళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకుందని కుటుంబీకులు గుండెలవిసేలా ఆవేదనతో రోదించారు. తమ గారాల పట్టి చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. వారు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చాలా చిన్న వయసులోనే నివృతి గుండె పోటుతో మృతి చెందడంతో ఆ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు ఏర్పడ్డాయి.
చెన్నూర్ పద్మానగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ – రమ దంపతులకు ఓ కూతురు, కుమారుడు సంతానం. నివృత్తి మొదటి సంతానం. చెన్నూర్ లోని స్థానిక స్కూల్లో 7వ క్లాస్ చదువుతోంది. కార్తీక పౌర్ణమి కావడంతో పాఠశాలకు హాలిడే ఇచ్చారు. పండుగ పనుల్లో బిజీగా ఉన్న పాప.. ఒక్కసారిగా గుండెపోటుతో ఇలా మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.
ఇవీ చదవండి: Crime News: విద్యార్థిని తొడపై కొరికిన కీచక టీచర్! చెప్పుకోలేని చోట తాకుతూ..
AP Crime News: తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో హత్యాచారాలు
Crime News: టీనేజ్ అమ్మాయి విశృంఖలత్వం.. 19 మందికి ఒకేసారి హెచ్ఐవీ
AP Crime News: కాశీబుగ్గలో ఇద్దరు బాలికలపై అత్యాచారం!
