Kanguva Review: దక్షిణాది స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కంగువా (Kanguva Review). డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ మూవీకి ఇప్పటికే మంచి హైప్ వచ్చింది. ఈ మూవీతోనే పాన్ ఇండియా రేంజ్ లో పట్టు సాధించేందుకు సూర్య ఉవ్విళ్లూరుతున్నాడు. ఎప్పటిలాగే కంటెంట్ బాగున్న మూవీ కథను సూర్య ఎంచుకున్నాడని చెబుతున్నారు.
సౌత్ సినీ ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యది ప్రత్యేక స్థానం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో అభిమానులను పెద్ద సంఖ్యలో ఏర్పరచుకున్నాడు. కమర్షియల్ కాకుండా విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు కంగువా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కోసం సూర్య బాగా కష్టపడ్డాడట.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి, చెన్నై లాంటి మహా నగరాల్లో ఈవెంట్లు నిర్వహించారు. ప్రెస్ మీట్లలో పాల్గొన్నారు. అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యాడు. మొత్తంగా ఈ చిత్రాన్ని తన భుజాలపై ఎత్తుకుని అన్నీ తానై నడిపించాడు. ట్రైలర్ తో భారీ బజ్ క్రియేట్ చేసుకున్న కంగువా.. ఈరోజు నవంబర్ 14న రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు కంగువా సినిమాపై తమ అభిప్రాయాలను ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు. (Ibomma)
కంగువా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సినిమా అదిరిపోయిందంటూ ట్వీట్స్ రూపంలో పెడుతున్నారు. కంగువా సినిమాలో ప్రతి సీన్ హైలెట్ అంటున్నారు. ఫైట్స్, విజువల్స్ అన్నింటిలోనూ డైరెక్టర్ శివ తన మార్క్ చూపించాడంటున్నారు. సూర్య కెరీర్ కు ఇది బెస్ట్ సినిమా అని, బ్రేక్ ఈవెన్ అవుతుందంటున్నారు.
https://twitter.com/AnjuNayak999/status/1856873597962158170
ఒక్క ముక్కలో చెప్పాలంటే కంగువ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉందని, సెకండాఫ్ కూడా బాగుందని, సూర్య టాప్ లేపేశాడంటున్నారు.
ఇవీ చదవండి: Kanguva: 8 భాషల్లో కంగువా రిలీజ్.. ఏఐతో డబ్బింగ్!
Suriya Jyotika: జ్యోతిక శాలరీ గురించి సూర్య కామెంట్స్.. ఎన్నిరెట్లు ఎక్కువంటే!
Nora Fatehi: కవ్వింపులతో సందడి షురూ చేసిన సోఫియా
Raja Saab: రాజా సాబ్ అప్ డేట్స్.. నిర్మాత ఏమన్నారంటే..
