RCB: భారత మాజీ కీపర్-బ్యాటర్ పార్థివ్ పటేల్‌కు రాబోయే ఐపీఎల్‌లో తమ అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించే రెండు బాధ్యతలను అప్పగించినట్లు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ బుధవారం (RCB) తెలిపింది.
ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా నేతృత్వంలోని సహాయక సిబ్బందిలో పార్థివ్ రెండు రోల్స్ చేయనున్నాడు. “గుజరాత్ టైటాన్స్ తమ కొత్త అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా పార్థివ్ పటేల్‌ను నియమించినందుకు సంతోషంగా ఉంది. మాజీ భారత వికెట్ కీపర్-బ్యాటర్‌గా 17 ఏళ్ల విశిష్ట కెరీర్‌తో, పార్థివ్ జట్టుకు అనుభవాన్ని అందిస్తాడు.” అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.

“రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ కోసం టైటాన్స్ సిద్ధమవుతున్న తరుణంలో, బ్యాటింగ్ మెళుకువలు, వ్యూహాలపై పార్థివ్ సేవలు, ఆలోచనలు ఆటగాళ్ల నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
“తన పదునైన క్రికెట్ చతురత, యువ ప్రతిభకు మార్గనిర్దేశం చేసే సామర్థ్యానికి పేరుగాంచిన పార్థివ్, కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేస్తాడు. ఆటగాళ్ల అభివృద్ధికి, ప్రదర్శనకు దోహదపడతాడు” అని గుజరాత్ టైటాన్స్ (GT) ప్రకటనలో తెలిపింది. 2020లో రిటైరైన పార్థివ్‌కి ఐపీఎల్‌లో ఇది తొలి కోచ్ పోస్టు.
అతని రిటైర్మెంట్ తర్వాత, 2023 వరకు మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు టాలెంట్ స్కౌట్‌గా పనిచేశాడు. ILT20 ప్రారంభ సీజన్‌లో MI ఎమిరేట్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు.
ఇవీ చదవండి: IPL Auction: ఐపీఎల్ ఆక్షన్.. షాక్ ఇచ్చిన ప్రీతి? పర్సులో ఎంత సొమ్ము ఉందో తెలుసా?
IPL 2025: రిటెన్షన్‌లో ఆ స్టార్ ప్లేయర్‌కు రూ.20 కోట్లు?
IPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్..
IPL 2025 Retention: ఆర్సీబీకి కేఎల్ రాహుల్ పునరాగమనం?
IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్ విశేషాలు ఇవే..
IPL 2023: తిలక్ వర్మ మరో ఛాన్స్ కొట్టేశాడు.. చేతులు కలిపిన రిలయన్స్!
Indian Premier League: ఐపీఎల్ 2025 రిటెన్షన్ ఫైనల్ లిస్టు ఇదే
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడే చాన్స్ మిస్.. రోహిత్ ఏమన్నాడంటే..
