BSNL: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) డైరెక్ట్-టు-డివైస్ శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్‌ను బుధవారం ప్రారంభించింది. ఇండియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) దీనిని “భారతదేశ మొదటి ఉపగ్రహం నుంచి పరికరానికి సేవ”గా పేర్కొంటూ ఈ ప్రయోగాన్ని ప్రకటించింది.
కాలిఫోర్నియాకు చెందిన కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీ వయాసట్‌తో కలిసి భారతీయ టెలికాం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో వినియోగదారులకు అంతరాయం లేని కనెక్టివిటీని అందించడం దీని లక్ష్యం. బీఎస్ఎన్ఎల్ మొదటిసారిగా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024లో ఈ సేవను ఆవిష్కరించింది.
ఎక్స్ లోని ఒక పోస్ట్‌లో DoT ఇండియా అధికారిక హ్యాండిల్ కొత్త సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. శాటిలైట్ కనెక్టివిటీ అనేది కొత్త టెక్నాలజీ కాదు. యాపిల్ మొదట ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో సామర్థ్యాన్ని ప్రకటించింది. అయినప్పటికీ, భారతదేశంలోని సాధారణ వినియోగదారులకు ఉపగ్రహ కమ్యూనికేషన్ అందుబాటులో లేదు. ఇప్పటివరకు అత్యవసర సేవలు, సైనిక, ఇతర అనుబంధ సేవల కోసం రిజర్వ్ చేశారు.
డైరెక్ట్-టు-డివైస్‌తో, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులందరికీ సేవను అందిస్తోంది. లొకేషన్ రిమోట్‌గా ఉన్నప్పటికీ కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని వారికి అందిస్తుంది.
సెల్యులార్ నెట్‌వర్క్ లేదా వై-ఫై కనెక్టివిటీ అందుబాటులో లేనప్పుడు ఎమర్జెన్సీ కాల్‌లు చేయడానికి వినియోగదారులను ఈ సేవ ఉపయుక్తంగా ఉంటుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. వినియోగదారులు ఇలాంటి పరిస్థితుల్లో SoS సందేశాలను పంపవచ్చు. UPI చెల్లింపులను కూడా చేయవచ్చు.
బీఎస్ఎన్ఎల్, Viasat అక్టోబర్‌లో సర్వీస్ ట్రయల్స్‌ను ప్రారంభించాయి. ఒక నెలలోనే ఈ సేవ వినియోగదారుల కోసం ప్రారంభించారు. అయితే, కొంత అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. శాటిలైట్ కనెక్టివిటీకి యాక్సెస్‌ని పొందడానికి వినియోగదారులు ఏమి చేయాలో బీఎస్ఎన్ఎల్ సర్వీస్ ప్రొవైడర్ పేర్కొనలేదు. యూజర్‌లు తమ ప్రస్తుత ప్లాన్‌లలో ఫీచర్‌ని బండిల్ చేస్తారా లేదా దాని కోసం ప్రత్యేక ప్లాన్‌లను కొనుగోలు చేయాలా అనేది కూడా కచ్చితంగా వెల్లడించలేదు.
ఇవీ చదవండి: BSNL New Logo: బీఎన్ఎన్ఎల్ కొత్త లోగోపై దుమారం.. అన్నింటా కాషాయమా!
BSNL Offers: బీఎస్ఎన్ఎల్ బొనాన్జా.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఓటీటీ ఆఫర్లు!
Jio Star: జియో సినిమా, హాట్ స్టార్ విలీనం.. జియో స్టార్ కమింగ్ సూన్!
Oppo Pad 3 Pro: ఒప్పో న్యూ ట్యాబ్ చూశారా? ధర, ఫీచర్స్ ఇవిగో!
