HomeLife StyleHot water: గీజర్ వర్సెస్ మట్టి కుండ.. మన బాడీకి ఏ నీరు మంచిది?

Hot water: గీజర్ వర్సెస్ మట్టి కుండ.. మన బాడీకి ఏ నీరు మంచిది?

Hot water: వేడి నీళ్లతో స్నానం చేయడం చాలా మందికి అలవాటు. మరికొందరు చల్లటి నీటితోనే స్నానం ఆచరిస్తుంటారు. అయితే, శీతాకాలం రానున్న నేపథ్యంలో అందరూ హాట్ వాటర్ కోసం గీజర్ లేదా, ఎలక్ట్రిక్ హీటర్, లేదా గ్యాస్ మీద వేడి చేసుకుని పోసుకుంటూ ఉంటారు. మట్టి కుండలో లేదా గ్యాస్ గీజర్ లో వేడి చేసుకున్న నీటిలో ఏది బెటర్? (Hot water) అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

చలికాలం స్టార్ట్ అవుతోంది. వేడి నీటి వినియోగం కూడా పెరగడం కామన్. గతంలో దాదాపు అందరూ కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యిలో వేడి నీళ్లు కాచి స్నానానికి వాడుకునేవారు. కానీ ఇప్పుడు గ్యాస్, గీజర్ అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో పొయ్యి వినియోగం దాదాపు తక్కువైపోయింది. అయితే స్టవ్‌పై వేడిచేసిన నీరు శరీరానికి మంచిదా? లేదా గ్యాస్‌పై వేడి చేసిన నీరు మంచిదా అనే డౌట్ చాలా మందికి కలుగుతుంది.

మట్టి పొయ్యిపై నీటిని ఒక ఏకరీతి ఉష్ణోగ్రతను (temperature) నిర్వహించడానికి నెమ్మదిగా హీట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో నీటి ఉష్ణోగ్రత పెద్దగా పెరగడం జరగదు. దీని కారణంగా ఇది చర్మానికి, ఆరోగ్యానికి బెటర్ గా ఉంటుందని చెబుతారు. గ్యాస్‌ లేదా గీజర్‌లోని నీరు వేగంగా హీట్ అవుతుంది. దీని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. నియంత్రించడం కాస్త కష్టం. దీనివల్ల చర్మం సడెన్‌ వేడి నీళ్ల ప్రభావాన్ని భరించాల్సి వస్తుంది.

మట్టి పొయ్యిపై నీటిని హీట్ చేయడం వల్ల మట్టి ఖనిజాలు వంటి సహజ మూలకాలు నీటిలో ఉంటాయి. ఈ ఖనిజాలు నీటికి ప్రత్యేక లక్షణాలను చేకూరుస్తాయి. ఇది చర్మానికి ప్రయోజనకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ గ్యాస్, గీజర్లలో వేడిచేసిన నీటిలో సహజ మూలకాలు కనిపించబని సూచిస్తున్నారు. కాబట్టి దానిపై వేడిచేసిన వేడి నీరు ఎలాంటి మేలు చేయదని గుర్తించాలి.

శక్తి వనరులు, పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతాయి. సంప్రదాయ పద్ధతిలో కలప లేదా పేడను కాల్చడం ద్వారా నీటిని వేడి చేయడం జరుగుతుంది. ఇది వాతావరణంలో పొగను ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ, సంప్రదాయ ఇంధన వనరులను యూజ్ చేస్తుంది. అదే గ్యాస్ గీజర్‌లో అయితే, నీటిని వేడి చేయటం కోసం వాయువును యూజ్ చేసుకుంటుంది. ఇది తక్కువ సమయంలో నీటిని హీట్ చేసేస్తుంది. కానీ ఇది శక్తి వనరులను వాడుతుంది. పర్యావరణంపై ఎఫెక్ట పడుతుంది.

మట్టి పొయ్యిపై తక్కువ వేడి మీద నీటిని వేడి చేయడం వల్ల నీటి pH స్థాయిని స్థిరీకరణ చేస్తుంది. ఇది చర్మానికి యూజ్ ఫల్ గా ఉంటుంది. గీజర్‌లోని నీరు వేగంగా వేడెక్కడం వల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ నీరు చర్మాన్ని కాస్త పొడిబారేలా చేయడం గుర్తింవచ్చు.

హెల్త్ బెనిఫిట్స్
మట్టి పొయ్యిలో వేడిచేసిన నీటిలో మనం స్నానం చేస్తే శరీరానికి అలసట తగ్గిస్తుంది. ఇది చర్మంలో తేమను నిలుపుతుందని కూడా చాలా మంది చెబుతారు. కానీ గ్యాస్ లేదా గీజర్ మీద వేడిచేసిన నీటిని వాడితే, శరీరానికి వేడి చేస్తుందని చెబుతున్నారుక. దీంతో చర్మం పొడిబారుతుందని సూచిస్తున్నారు. మట్టి పొయ్యిపై వేడిచేసిన నీరు చర్మం, ఆరోగ్య ప్రయోజనాల పరంగా మరింత లాభాలను తెచ్చి పెడుతుంది. అందుకే మట్టి కుండలో నీటిని వేడి చేసి స్నానం చేయడం బెటరని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Pigeon: పావురాల ఈక‌లు, రెట్ట‌ల‌తో మన ఆరోగ్యానికి ముప్పు ఉందా?
Sun Stroke: వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? నీళ్లు తాగించరాదు!!
Coconut Water: ఈ వేసవిలో కొబ్బరినీళ్లు తాగడం స్కిప్‌ చేస్తున్నారా? ఈ ప్రయోజనాలు మిస్‌ అవుతున్నట్లే!
Health Tips after lunch: తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాకవుతారు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు