HomeTech NewsJio Star: జియో సినిమా, హాట్ స్టార్ విలీనం.. జియో స్టార్ కమింగ్ సూన్!

Jio Star: జియో సినిమా, హాట్ స్టార్ విలీనం.. జియో స్టార్ కమింగ్ సూన్!

Jio Star: దిగ్గజ సంస్థ రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియ ఈ వారంలోనే పూర్తి అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ విలీనం అనంతరం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు అయిన జియో సినిమా, (Jio Cinema)డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disny + Hot star) కలిసి ఒకే స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెందనుంది. ఈ తరుణంలో జియోస్టార్‌ (Jio star) పేరుతో కొత్త డొమైన్‌ పబ్లిక్ లోకి వచ్చింది. ఆ వెబ్‌సైట్‌లో ప్రస్తుతానికి ‘కమింగ్‌ సూన్‌’ అనే పేరుతో కనిపించింది.

జియో సినిమా, డిస్నీ+హాట్‌స్టార్‌ కలిసిపోతాయన్న వార్తల నేపథ్యంలో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. జియోహాట్‌స్టార్‌ పేరుతో కొత్త ఓటీటీ వేదిక రాబోతోందని వార్తలు రావడం చూస్తున్నారు. సదరు డొమైన్‌ తనదేనంటూ ఓ యాప్‌ డెవలపర్‌ ముందుకొచ్చాడు.

తన చదువుకయ్యే ఖర్చు రిలయన్సే భరించాలంటూ ఆతడు పేర్కొనడం సంచలనంగా మారింది. ఓ దశలో తక్కువ మొత్తానికే రిలయన్స్‌కు ఇస్తానని పేర్కొని ఒక్కసారిగా ఆ వ్యక్తి మాయమై పోయాడు. అనంతరం యూఏఈకి చెందిన ఇద్దరు చిన్నారులు ఈ విషయంలో తెరపైకి వచ్చారు. ఈ డొమైన్‌ను ఉచితంగా ఇస్తామని రీసెంట్ గా ప్రకటన చేశారు.

తాజా పరిణామాల నేపథ్యంలో జియో హాట్‌ స్టార్‌ డొమైన్‌ కు సంబంధించి ఇష్యూకు తెర దించుతూ జియో స్టార్‌ అనే కొత్త వెబ్‌సైట్‌ కనిపించింది. రెండు సంస్థ విలీనం అనంతరం నవంబర్‌ 14 నుంచి ఈ డొమైన్‌ అవైలబుల్ లోకి వస్తుందని సమాచారం. అంటే జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లోని కంటెంట్‌ అంతా ఒకే చోట ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఐపీఎల్‌ వంటి లైవ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్లు మాత్రం హాట్‌స్టార్‌ యాప్‌లోనే వస్తాయని అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

ఇవీ చదవండి: BSNL Offers: బీఎస్ఎన్ఎల్ బొనాన్జా.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఓటీటీ ఆఫర్లు!
SBPB Meeting: విజయవాడలో 53వ స్టేట్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ భేటీ
BSNL New Logo: బీఎన్ఎన్ఎల్ కొత్త లోగోపై దుమారం.. అన్నింటా కాషాయమా!
Laptop brightness: ల్యాప్ టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎంత పర్సెంట్ ఉంటే మంచిది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు