HomeAndhra PradeshEmployees: సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల

Employees: సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల

Employees: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇటీవల తమ గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో 20 డిసెంబరు 2023 నుండి 10 జనవరి 2024 వరకు 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు.

ఈ సమ్మె తర్వాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని 23% పెంచుతూ జనవరి 2024లో ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఆ మెమోలో 2019కు ముందు గౌరవ వేతనం పెంచని వాళ్లకు 23 శాతం పెంచడం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 21 రోజులు సమ్మె కాలానికి గానూ వేతనం చెల్లించాల్సిందిగా ఇటీవల గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిశారు. ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి వేతనాలు విడుదల చేయడానికి అంగీకరించారు. సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ వేతనాలు సోమవారం విడుదల చేశారు.

‘‘కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె కాలానికి వేతనం చెల్లించాల్సిందిగా సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు ఇటీవల నన్ను కలిసి విన్నవించారు. ఉద్యోగుల వినతిని మానవతా దృక్పథంతో పరిశీలించి సమ్మెకాలానికి వేతనాలు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించగా ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మాది ప్రజా ప్రభుత్వం. మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.’’ అని లోకేష్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి: GWS Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను దూషించడం దారుణం
Software Employees: రోజుకు 16 గంటల పని.. సాఫ్ట్ వేర్ పిల్లల నడుములు వంగిపోతున్నాయ్..
Good News for employees: విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపికబురు.. జీతం ఎంత పెంచారంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు