Varra Ravindra Reddy: సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసులో డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అసభ్యకర పోస్టుల కేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వర్రా రవీంద్రా రెడ్డి, (Varra Ravindra Reddy) సుబ్బారెడ్డి, ఉదయ్ లను మీడియా ముందు చూపించారు.
ఈ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులు వాడిన భాష అసభ్యకరంగా ఉందన్నారు. అరబ్ దేశాల్లో అయితే తీవ్ర శిక్షలు ఉంటాయన్నారు.
‘‘సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబాలపై తీవ్రమైన దూషణలు వాడారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలించాం. నిన్న మార్కాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నాం. వర్రా రవీందర్ రెడ్డి గతంలో భారతి సిమెంట్ లో పనిచేశాడు. మరో ఇద్దరు కూడా వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. 2012 నుంచి వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైయస్ఆర్సీపీకి అనుకూలంగా వినియోగించుకున్నారని చెప్పారు.
జడ్జీలకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారు. రాజకీయ నేతల కుటుంబ సభ్యులపైనా పోస్టులు చేశారు. మహిళా కుటుంబసభ్యులు, వారి పిల్లలపై పోస్టులు పెట్టారు. నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టేవారు. పోస్టులు పెట్టేవారిని ఇప్పటివరకు 45 మందిని గుర్తించాం. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. నిందితులకు 40యూట్యూబ్ ఛానళ్లు ఉన్నట్లు గుర్తించాం. యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఇవన్నీ నడిపేవారు. జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో వీరంతా పనిచేసేవారు. తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వ్యాఖ్యలు చేసేవారు.. పోస్టులు పెట్టేవారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది. సజ్జల భార్గవ్ ఎంట్రీతో బూతు పురాణం మరింత పెరిగింది. సజ్జల భార్గవ్ సూచనలతోనే పనిచేస్తున్నారు. చదవడానికి వీలు లేని పోస్టులు పెట్టారు. కడుపుకు అన్నం తినేవారు ఇలాంటి భాష వాడరు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ తిట్టడమేంటి?’’ అని కోయ ప్రవీణ్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: YSRCP Social Media: వైసీపీ సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్!
YS Jagan with YSRCP Social Media: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా సైనికులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!
