HomeCrime NewsIIIT-Basara: హృదయవిదారకం.. బాసర IIIT విద్యార్థిని స్వాతి ప్రియ సూసైడ్ నోట్..

IIIT-Basara: హృదయవిదారకం.. బాసర IIIT విద్యార్థిని స్వాతి ప్రియ సూసైడ్ నోట్..

IIIT-Basara: తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తనను సీనియర్లు వేధిస్తున్నారని కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్న స్వాతి.. వారెవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని లెటర్ లో రాయడం (IIIT-Basara) పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై తనువు చాలిస్తున్నట్లు పేర్కొనడం చలింపజేస్తోంది.

విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీనియర్ విద్యార్థి వేధింపుల వల్ల యూనివర్సిటీ అధికారులకు గత నెలలో ఫిర్యాదు చేసిన స్వాతి ప్రియ.. తీవ్ర మనోవేదనకు గురై ఉరేసుకుంది. ఫిర్యాదు కాఫీలో సీనియర్లపై ఆరోపణ చేసిన స్వాతి ప్రియ.. తన మరణ లేఖలో మాత్రం తన చావుకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని పేర్కొనడం గమనార్హం.

లెటర్ లో ఏముందంటే..
‘సారీ మమ్మీ, సారీ డాడీ.. నేను ఇలా చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఎందుకో మనసు ఒప్పట్లే మమ్మీ నాకు. ఎప్పుడు చూసినా చచ్చిపోవాలి అనిపిస్తోంది. ఎందుకో చాలా భారంగా ఉంది మమ్మీ. మీ కూతురుగా కాదు మీకు కొడుకులా ఉందాం అనుకున్నా. కానీ చిన్నపిల్లలా ఏడుస్తున్నా. నా చావుకి ఎవరూ కారణం కాదు.. కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరూ కాదు. నా చివరి కోరిక మన వినోద్ అన్నని పెద్దనాన్న వాళ్లు అనాధ ఆశ్రమంలో వదిలేశారు. ఆ అన్న రోడ్లమీద బిక్షం ఎత్తుకుంటున్నాడట. అన్నకి మంచిగా ఫుడ్ పెట్టి, బాగా చూసుకోండి. (IIIT-Basara)

నేను లేని లోటు అన్న తీరుస్తాడు. ఇంకొకటి.. నా ఫ్రెండ్స్, మా అన్నలు అందరూ నన్ను చూడడానికి రావాలి. మన బంధువులతో మీరు ఎవరెవరితో గొడవపడ్డారో వాళ్లంతా రావాలి. మమ్మీ నన్ను తాత పక్కన పూడ్చిపెట్టండి. తాతతో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకో తప్పు చేస్తున్నా. కానీ నావల్ల కావట్లే. మమ్మీ మరి రిలేటివ్స్ లో చాలామందితో మాట్లాడరు కదా.. అందరితో మాట్లాడు మమ్మీ ప్లీజ్. అక్క, తమ్ముడు వాళ్లను చక్కగా చూసుకో. అక్క తమ్ముడిని వాళ్ళకి నచ్చిన స్టడీ, జాబ్ చేయించు అమ్మా. అక్కకి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయండి. తమ్ముడికి హాస్టల్లో ఉండాలని లేదు. బయటనే జాయిన్ చేయండి. డాడీ నువ్వు స్మోకింగ్ మానేయాలి. అలాంటి తప్పులు చేయకండి. మమ్మీ మా టెన్త్ ఫ్రెండ్స్ కి ఆన్లైన్ ఫ్రెండ్స్, బాసరలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ రావాలి. నాకు క్లోజ్ గా ఉన్నవాళ్లు వచ్చి నన్ను లాస్ట్ టైం హగ్ చేసుకోవాలి’.

‘నేను చచ్చిపోయాక మమ్మీ నావల్ల మీరు చాలా బాధపడతారు. నాకు తెలుసు. బట్ నేను ఏం చేయలేకపోతున్నాను. నేను దూరం అయ్యాక మా ఫ్రెండ్స్ కి, నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ, అక్క వాళ్ళకి మెసేజ్ పెట్టు. స్వాతి ఈజ్ నో మోర్.. షి ఇస్ డెడ్ అని మెసేజ్‌ పెట్టు. మంచిగా చదువుకో అక్క. నేను జయసు అన్నకు రూ.800 ఇవ్వాలి. నా ఫోన్ పేలో ఉన్నాయి. నువ్వు ఇవ్వు అక్క సరేనా. నా ఫోన్లో అన్నయ్య అని నెంబర్ సేవ్ చేసి ఉంటుంది. సారీ అక్క.. చెల్లిలా నీతో ఉండాలని అనుకున్నా.

కానీ నేను సిక్స్త్, టెన్త్‌ ఉన్నప్పటి నుంచి నువ్వు నాకు దూరంగానే ఉన్నావ్. ఐ మిస్ యు సో మచ్.. ఐ లవ్ యు.. మమ్మీ డాడీ అక్క తమ్ముడు. తమ్ముడికి ఎలాంటి బ్యాడ్ హాబీస్ అలవాటు పడొద్దు.. ఓకేనా. అక్క నీకు ఏ ప్రాబ్లం ఉన్నా డాడీకి చెప్పు.. అర్థం చేసుకుంటారు. తిడతారని అనుకోకు.

‘మమ్మీ డాడీ.. నా బాడీలో ఏ పార్టైనా డొనేట్ చేయగలిగితే చెయ్యి. అండ్ ఏం లేదులే.. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. సారీ ఇది నైట్ రాసిన మాట. ఇప్పుడు ఇది మార్నింగ్ లేచి రాస్తున్న.. చనిపోదాం అని డిసైడ్ అయిపోయిన ఇంకా వద్దు నాకు ఈ లైఫ్ అక్క.. నేను పోతే పిల్లలకు నా పేరు పెట్టాల్సిన అవసరం లేదు కానీ అక్కకి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయండి. అక్క నువ్వు, లక్కీ జేఈఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఇద్దరికీ లవ్ యు బోత్ ఆఫ్ యు.

మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అమృత సారీ.. ఇంక వెళ్ళిపోతున్న నేను. నితిన్ నాతో ఈ మంత్ బాగా మాట్లాడినావు. వన్ మంత్ అవుతుంది అండ్ నిన్ను లైవ్లో చూసి కరెక్ట్ గా మంత్ అవుతుంది. బాయ్ నీకు కూడా.. మీ అందరికీ సారీ. అండ్ మమ్మీ, డాడీ, అక్క, బాబి సారీ మీకు అందరికీ. మళ్లీ అక్క కడుపులోని పుట్టాలని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్న.. నా చావుకు నేను మాత్రమే కారణం. ఎవరు కారణం కాదు.. నా ఫోన్ మా అక్క తప్ప ఎవరూ చూడాల్సిన అవసరం లేదు.

కాల్స్ వచ్చిన మెసేజ్ వచ్చిన అక్క రెస్పాండ్ అవుతుంది. నాకోసం ఏడ్చిన వాళ్ళు ఉన్నారు.. నా మీద కోపంతో కూడా ఉన్నారు. వాళ్లందరికీ లవ్ యు అండ్ బాయ్. అందరికీ సైనింగ్ ఆఫ్ ఫరెవర్ … ఏదో రాయాలి అని ఉంది.. బట్ ఏం రాయాలో అర్థం కావట్లే. బట్ ఐ ఫీల్ సో.. ఇంకేం లేదు. ఇంకా నా లైఫ్ లో అన్నట్టు బట్ ఓకే ఇట్స్ ఫైన్ బాయ్ గైస్ లవ్ యు ఆల్..’ అంటూ స్వాతి ప్రియ తన సూసైడ్ నోటో ను విషాదంతో ముగించింది.

ఇవీ చదవండి: Crime News: విద్యార్థిని తొడపై కొరికిన కీచక టీచర్! చెప్పుకోలేని చోట తాకుతూ..
AP Crime News: తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో హత్యాచారాలు
Guntur Crime: దాష్టీకానికి మరో అమ్మాయి బలి… తెనాలి యువతి కన్నుమూత
AP Crime News: కాశీబుగ్గలో ఇద్దరు బాలికలపై అత్యాచారం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు