Good News for employees: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. చాలా కాలంగా జీత భత్యాలు పెంచాలని, తమను రెగ్యులరైజ్ చేయాలని విద్యుత్ శాఖ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఈ దిశగా కీలక చర్యలు తీసుకున్నారు. తాజాగా వారి జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (Good News for employees)
విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది జగన్ సర్కార్. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 27 వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంపుదల చేసినట్లు పేర్కొన్నారు. రూ.21 వేల జీతం దాటిన విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
Read Also : DGP on punganuru incident: పుంగనూరు ఘటనలో ఇప్పటి వరకు 80 మందిని అరెస్టు చేశాం : డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి