Health Tips: మన శరీరానికి కావాల్సిన ఆహారం తీసుకునే వెసులుబాటు మనకు ఉంది. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. (Health tips) అలా తీసుకుంటేనే దేహానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
ఆ తర్వాత వాటిలోని కొన్ని వ్యర్థాల రూపంలో బయటకు వస్తాయి. అయితే, కొన్నిసార్లు ఈ వ్యర్థాలు బయటికి రాకుండా శరీరంలో ఉండిపోతుంటాయి. ఈ నేపథ్యంలోనే లివర్, కిడ్నీ సమస్యలు వస్తాయి. అందుకే, కచ్చితంగా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తరచూ బయటకు పంపుతుండాలి.
ఇందుకోసం ప్రత్యేకించి మందులేమీ వాడాల్సిన పని లేదు. మెడిసిన్‌తో సమానంగా పనిచేసే ఆయుర్వేద హెల్త్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఇది మన శరీరంలోని ట్యాక్సిన్స్‌ని వెలుపలికి పంపేస్తుంది. దీంతో లివర్, కిడ్నీల ఆరోగ్యం మెరుగవుతుంది. అవి దెబ్బతినకుండా ఉంటాయి. మరి ఇలాంటి డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
కావాల్సినవి..
1. ఓ చిన్న అల్లం ముక్క
2. దాల్చిన చెక్క
3. రెండు యాలకులు
4. ఓ టీ స్పూన్ జీలకర్ర
5. రెండు గ్లాసుల మంచినీళ్లు
ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో వాటర్ పోయాలి. మిగతా పదార్థాలన్నీ వేసి సగం నీళ్లు సగానికి వచ్చే దాకా బాగా మరిగించాలి. ఈ నీటిని రోజూ తాగితే బాడీ డీటాక్సీఫై అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నీటిని తాగితే కడుపు సంబంధిత ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. కడుపు క్లీన్ అవుతుంది. దీంతో అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా అటాక్ చేసే ప్రమాదం ఉండదు. రెగ్యులర్‌గా ఈ నీటిని తాగాలని, కొన్ని రోజుల్లోనే మార్పు చూడగలుగుతారని సూచిస్తున్నారు.
ఈ నీటిని తాగడం వల్ల లివర్, కిడ్నీల్లోని పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ బయటికు వెళ్లిపోక తప్పదు. దీని వల్ల ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. దీంతోపాటు కిడ్నీ సమస్యలూ రాకుండా ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
మనం ఇలా తయారు చేసుకున్న డీటాక్స్ డ్రింక్ తాగితే యూరిక్ యాసిడ్ లెవల్స్, మూత్రపిండాల్లో రాళ్లు, కీళ్లు నొప్పుల సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ బాగా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా దూరం అవుతాయంటున్నారు.
ఇవీ చదవండి: Gut Health: మారుతున్న సీజన్.. మీ ప్రేగు ఆరోగ్యానికి 9 చిట్కాలు
World Mental Health Day: మెరుగైన మానసిక ఆరోగ్యం కోసం 10 టిప్స్
Health Drinks: రోజూ ఎలాంటి హెల్త్ డ్రింక్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు?
Cool Drinks Danger: చల్లటి పానీయాలు ప్రాణాంతం.. కాలేయ క్యాన్సర్ కారకం!
