HomeAndhra PradeshAndhra Pradesh: వైయస్సార్ సీపీ వాళ్ల కూతుర్లపై పోస్టులు పెట్టినా వదలను: చంద్రబాబు

Andhra Pradesh: వైయస్సార్ సీపీ వాళ్ల కూతుర్లపై పోస్టులు పెట్టినా వదలను: చంద్రబాబు

Andhra Pradesh: సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు పెడుతున్నారన్న సీఎం.. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుందని చెప్పారు. ఆడ బిడ్డల జోలికొస్తే మాత్రం జాగ్రత్త.. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్ గా ఉంటామని (Andhra Pradesh) హెచ్చరించారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామివారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు.. ఆలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలివీ..

* తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం. ముఠానాయకులను కంట్రోల్ చేశాం. మతవిద్వేషాలు రెచ్చగొట్టేవాళ్లను నియంత్రణ చేశాం.
* రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు తీస్తాం. రౌడీలను రౌడీలుగా, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం. కాంప్రమైజ్ కాం.

* ఒకరిద్దరు పోలీసు ఆఫీసర్లు ఎక్కడన్నా తప్పు చేసినా లాలూచీ పడినా అదే లాస్ట్ డే వారికి కూడా. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లేకపోతే ఎవరూ పెట్టుబడులు పెట్టరు.
* ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటూ ప్రశాంత వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీ కోసరం ఉద్యోగాలు త్యాగం చేయడానికి మేం సిద్ధంగా లేం.
* ఇంకా పేదరికం పెంచడానికి సిద్ధంగా లేం. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి.
* మీకు మీ కుటుంబసభ్యుల మీద గౌరవం లేకపోవచ్చు గానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లి అయినా, చెల్లి అయినా మీకు గౌరవం లేకపోవచ్చు.

* నేను ఒకటే చెబుతున్నా. ఏ ఆడ బిడ్డ అయినా సరే.. వైయస్సార్ కాంగ్రెస్ నాయకుల భార్యలు, కూతుర్లపై పెట్టినా వదిలిపెట్టను. వెరీ క్లియర్. సభ్యత, సంస్కారాలను వదిలిపెట్టకండి. మనుషులు మనుషులుగా ఉండండి. మృగాలుగా తయారు కాకండి.
* ఇది ప్రజాస్వామ్యం. రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్లందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
* ఏదో వీళ్లకే తెలివి ఉన్నట్లు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసిందే నేను. నా దగ్గర మీ కథలేంటి? నాకు అర్థం కాలేదు. మీకోసరం ప్రమోట్ చేయలేదు టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత.
* అలాంటి దాంట్లో మీ ఇష్టప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్ లు పెట్టడం తప్పు. చాలా ఫర్మ్ గా ఉంటాం.

* ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ ఫుల్. మానుకోండి. ఒట్టొట్టి అరుపులు అరిస్తే కుదరదు. వెరీ క్లియర్ ఆన్ దట్.
* పేద అరుపులు అరవడం, ఏదో జరిగిపోతోంది అంటే మీ ఇష్టప్రకారం తిడితే ప్రతి ఒక్కరూ పడటానికి సిద్ధంగా ఉన్నారా? పడాలా?
* మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు. వస్తావుంటే కూతుర్లు బోరున ఏడ్చారు. ఇది అవసరమా? అనుభవించాలా మేము?
* రాజకీయాల్లోకి వచ్చింది గౌరవంగా ఉండి ప్రజా సేవ చేయాలని. నేను ఆ మాటే చెప్పాను. నన్ను కూడా ఒకసారి మోసం చేశారు.
* నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో బాబాయిని చంపినప్పుడు గుండెపోటు అంటే నేను కూడా నమ్మాను. నిజమేనేమో అని.

* అది ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని తెలిస్తే, తెల్లవారి మళ్లీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని సానుభూతి సంపాదిస్తారా మీరు?
* నేను ఆరోజు లోపలేసి ఉంటే ఏమయ్యేది అందర్నీ. ఏమై ఉండేది? అదే నేను చేసిన తప్పు. అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. ఖబడ్దార్ జాగ్రత్త. ఎవర్నీ వదిలిపెట్టను.
* తప్పును తప్పుగా చూస్తాం. తప్పు చేసిన వారిని మాత్రం శిక్షించి తీరుతాం. ఎవ్వడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా. అలాంటివి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా.
* 1995లో సీఎం అంటే ఏంటో ఇంకా కొంత మందికి అర్థం కాలేదు. అప్పుడు వీళ్లు పుట్టలేదు. వీళ్లు ఇంకా గోళీలు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్లకు తెలియదు.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Seaplane: ఏపీలో సీ ప్లేన్.. ప్రారంభోత్స‌వంలో చంద్ర‌బాబు కీలక వ్యాఖ్యలు
Jagan press meet: జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్.. పవన్, చంద్రబాబు, లోకేష్‌పై కీలక వ్యాఖ్యలు
Rushikonda: రుషికొండ భవనాలపై చంద్రబాబు కీలక కామెంట్స్.. ఏమన్నారంటే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు