Seaplane: భవిష్యత్తు అంతా పర్యాటకానిదే అని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుందన్నారు. రాష్ట్రంలో సీ ప్లేన్ (Seaplane) ప్రారంభించిన అనంతరం చంద్రబాబు విజయవాలడో మాట్లాడారు. వినూత్న ఆలోచనతోనే సీప్లేన్ సేవలు తీసుకొచ్చామన్నారు.
‘‘ప్రధాని కూడా సీప్లేన్ సేవలు (Seaplane) ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. నూతన ఆలోచనలను అమలు చేస్తున్న స్పైస్ జెట్ ను అభినందిస్తున్నా. ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలనేదే ఆలోచిస్తున్నాం. విధ్వంసమైన వ్యవస్థను బాగుచేసేందుకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. గాడితప్పిన పరిపాలనను గాడిలో పెడుతున్నాం. ఐదేళ్లలో రాష్ట్రంలోని రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి..పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్తే కనిపించింది.
రాష్ట్రంలో రోడ్లను చూసి అవహేళన చేశారు. పోగొట్టిన బ్రాండ్ ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం. ప్రజలు గెలవాలి.. ఎన్డీయేకు ఓటేయాలని నేను, పవన్, మోదీ కోరాం. ప్రజలు గెలిచారు.. మన రాష్ట్రాన్ని నిలబెట్టారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు ఆక్సిజన్ ఇచ్చారు. రాష్ట్రానికి మళ్లీ బ్రాండ్ నెంబర్ వన్ తీసుకొస్తాం. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తాం. ప్రభుత్వ విధానాలు భవిష్యత్ తరాలను మార్చేస్తాయి. ఆదాయ అవకాశాలు పెంచడానికే మా ప్రయత్నాలు. (Seaplane)
ఐటీనీ తీసుకొస్తే.. తిండి పెడుతుందా అని మాట్లాడారు. 25 సంవత్సరాల క్రితం ఐటీని ప్రమోట్ చేశాం. టెక్నాలజీని సరైన పద్ధతిలో వినియోగిస్తే భవిష్యత్ బంగారుమయవం అవుతుంది. కొత్తగా వచ్చే టెక్నాలజీని వినియోగించుకోవాలి. యువత సమస్యలను చూసి పారిపోవద్దు. సంక్షోభాన్ని సవాల్ గా తీసుకోవాలి. ప్రతి అవకాశాన్ని వాడుకుంటే భవిష్యత్ కు ఢోకా ఉండదు. రాబోయే రోజుల్లో సీ ప్లేన్ ద్వారా రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేసుకోవచ్చు. చేపలు ఇవ్వడమే కాదు.. చేపలు పట్టడం నేర్పించడం మా విధానం.
సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు సెల్ ఫోన్ నిత్యవసర వస్తువుగా మారింది. ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం. హార్డ్ వర్క్ కాదు..స్మార్ట్ వర్క్ ముఖ్యం. థింక్ గ్లోబల్లీ..యాక్ట్ గ్లోబల్లీ అనేది మా నినాదం. మంచి నిర్ణయాలతోనే మెరుగైన ఫలితాలు. వ్యవసాయంలో డ్రోన్ సేవలు ఎంతో ఉపయోగపడతాయి. డ్రోన్ ద్వారా పొలంలో పురుగుమందులు చల్లుతున్నాం.
రాష్ట్రంలో టూరిజంకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే టూరిజంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. టూరిజం మీద చేసే ఖర్చులో ఆరు రెట్లు ఆదాయం వస్తుంది. సీప్లేన్ ద్వారా టూరిజం అభివృద్ధి చెందుతుంది. సీప్లేన్ ద్వారా పోర్టులు, రిజర్వాయర్లు, సముద్రాల్లో దొగొచ్చు.’’ అనీ సీఎం చంద్రబాబు అన్నారు.
‘‘మన ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతోంది. నేను గంటలు, రోజులు, వారాలు లెక్కలు పెట్టుకుంటున్నా. ప్రగతిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నా. నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను. మూడు సార్లు ఎలాంటి కష్టం అనిపించలేదు కానీ ఈ సారి చాలా కష్టంగా ఉంది. గత ప్రభుత్వం వ్యవస్థను విధ్వంసం చేసి వెళ్లింది. బాగు చేయడానికి కష్టపడుతున్నా. గాడి తప్పిన పాలనను గాడిలి పెడతా.
ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అవహేళనగా చూసేవాళ్లు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు అంటే గుంతలుగా ఉంటాయని, పట్టణాల్లో చెత్త పేరుకుపోయి ఉంటాయని అనేవాళ్లు. పోగొట్టిన రాష్ట్ర బ్రాండ్‌ను మళ్లీ తీసుకువస్తా. రాష్ట్రాన్ని నంబర్ వన్ బ్రాండ్‌గా మారుస్తా. నేను, మా మిత్రుడు పవన్ కల్యాణ్, కేంద్రంలో నరేంద్రమోడీగారు మేమంతా ఒక్కటే పిలుపునిచ్చాం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రాన్ని పునర్‌నిర్మించాలి అంటే ఎన్‌డీఏకి ఓటువేయమని అడిగాం. మీరు మాకు 93 శాతం స్ట్రైకింగ్ తో విజయాన్ని ఇచ్చారు.
వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఆక్సిజన్ తీసి ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని బయటకు తీసుకువస్తున్నాం. కేంద్రం సహకారంతో, స్వయం కృషితో రాష్ట్రాన్ని మళ్లీ నంబర్ వన్ గా మారుస్తా. సీ ప్లేన్ అన్నది ఒక వినూత్న ప్రయోగం. ఎలాంటి ఎయిర్ పోర్టులు అవసరం లేదు. మనకు 934 కిలోమీటర్ల సుదీర తీర ప్రాంతం ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ దిగి పనులు చూసుకుని రావొచ్చు.
రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, ఆర్థిక కార్యక్రమాలను పెంచడానికి, ఉపాధి, ఉద్యోగాలు సృష్టించడానికి.. ఉండే వాటిని అన్నీ ఉపయోగించుకుంటున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. సంపద సృష్టించాలి. ఆదాయం పెరిగితే సంక్షేమ పథకాల, పేదల నిర్మాలనకు వాడుకోవాలి. 25 సంవత్సరాల క్రితం నేను ఐటీని ప్రమోట్ చేశా. అప్పుడు ఎవరికీ అర్థంకాలేదు. ఐటి తిండి పెడుతుందా? అన్నారు. ఇప్పుడు అదే తిండిపెడుతోంది.
రాష్ట్ర ప్రజల ఆదాయం పెంచడానికి నేను ప్రయత్నిస్తున్నా. ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశాలు సృష్టిస్తున్నా. మామూలుగా ఫ్లైట్ చార్జీలు ఎంత ఉంటుందో అంతకు తీసుకురావాలని రామ్మోహన్ నాయుడిక సూచిస్తున్నా. పేదవాళ్లకు ఎప్పటికప్పుడు చేపలు ఇవ్వడం కాదు.. చేపలు పట్టే విధానాన్ని నేర్పించేందుకు వలలు ఇవ్వాలి. వాళ్లు మరో 10 మందికి వలలు ఇచ్చే పరిస్థితికి వస్తారు. విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చాం. మీ ఇంటిమీదనే విద్యుత్‌ను తయారు చేస్తున్నాం.
రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో 10 సీ ప్లేన్‌లను అభివృద్ధి చేస్తే అందులో ఒకటి రెండే ఇక్కడే వాడుకోవచ్చు.అన్నీ ఉన్నాయి గానీ అల్లుడి నోట్లో శని అన్నట్లు మనం వనరులను సద్వినియోగం చేసుకోవడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే టూరిజం రాదు. రౌడీలు ఉంటే ఈ ప్రాంతానికి ఎవరూ రారు. ప్రశాంతమైన వాతావరణం ఉంటే ప్రపంచం మొత్తం వస్తుంది. పరిశ్రమలు వస్తాయి.అభివృద్ధి జరుగుతుంది. మన భవిష్యత్తు బాగుంటుంది. ఏది జరిగినా దేశంలో, ప్రపంచంలో అది అమరావతిలోనే జరగాలి. మొట్ట మొదటిసారి మనమే ప్రారంభించాలి.’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Amaravati Drone show: తొలి రోజు డ్రోన్ షో విశేషాలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే
AP Drone Show: విజయవాడలో డ్రోన్ల షో చూసేందుకు 5 భారీ స్క్రీన్లు
Drone Summit: ఈనెల 22 నుంచి అమరావతిలో డ్రోన్ సమ్మిట్
Drone and remote sensing: డ్రోన్, రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంతో నేలలో పోషక లభ్యత అంచనా
