HomeDevotionalDevotional tips: ఆరోగ్య సమస్యలకు సుబ్రహ్మణ్య శ్లోకం.. ఫలితం ఊహించలేరు!

Devotional tips: ఆరోగ్య సమస్యలకు సుబ్రహ్మణ్య శ్లోకం.. ఫలితం ఊహించలేరు!

Devotional tips: హఠాత్తుగా జబ్బుల బారిన పడటం, తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుండటం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇలా ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని మధన పడుతుంటారు. ఇలాంటి వారు ఆధ్యాత్మికంగా కొన్ని రకాల చిట్కాలు పాటించి, శ్లోకాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు.

శంకర భగవత్పాదులు చేసిన శ్లోకాలు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారన్న దానితో సంబంధం ఉండదు. ఒక్కోసారి చాలా చిన్న శ్లోకం చెబుతారు. కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైన భావాన్ని పొదిగేలా చేస్తారు. సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకానొకప్పుడు ఓ స్తోత్రం చేశారు.

నేటికీ పెద్దలు ఓ మాట చెబుతుంటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని గానీ చదువుకోవడం వల్ల రోగాల నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చని చెబుతారు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని దినచర్యగా తీసుకుని ప్రతి రోజూ నియమంగా చదువుకునే అలవాటు చేసుకోవాలి.

ఈ అలవాటు ఉన్న వారికి చిట్టచివర జ్యోతి స్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనం ఇచ్చి స్కంద లోకానికి తీసుకెళతాడని పెద్దలు చెబుతున్నారు. అంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య భుజంగాన్ని సముద్రపు ఒడ్డున ఉన్న ద్రవిడ దేశంలో ఉన్న తిరుచెందూర్ అనే ఊరిలో కూర్చుని శంకరాచార్యుల వారు రచన చేశారని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాల్లో చెబుతుంటారు.

సుబ్రహ్మణ్య భుజంగం చదువుకోవడం వల్ల గత జన్మల ఫలాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని పెద్దలు చెబుతున్నారు.

ఇవీ చదవండి: Devotional Tips work: పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఈ పనులు చేస్తే.. అంతా శుభమే!
Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!
Devotional Tips Deepalu: దీపాలను ఆర్పే విధానం తెలుసా? అగ్గిపుల్లను కూడా ఇలా ఆర్పేయరాదు!
Devotional Tips: ఇంట్లో ప్రమాదకరమైన వస్తువులివే.. వెంటనే తీసేయండి!
Tirumala: కలి ప్రభావం.. అప్పుడే ఏమైంది..? ఇంకా మున్ముందు చాలా చూడాలి భక్తులారా…! 

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు