HomeSportsRanji Trophy: రంజీలో ఉతికేసిన శ్రేయస్.. డబుల్ టన్‌తో సత్తా!

Ranji Trophy: రంజీలో ఉతికేసిన శ్రేయస్.. డబుల్ టన్‌తో సత్తా!

Ranji Trophy: ఒడిశాతో గురువారం జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరఫున భారత క్రికెట్ జట్టు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగాడు. డబుల్ సెంచరీతో మెరిశాడు. ఆస్ట్రేలియాలో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాని శ్రేయస్.. 201 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. (Ranji Trophy)

అద్భుతమైన ఫామ్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. 2017-18 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 202 పరుగులతో అజేయంగా నిలిచిన తర్వాత శ్రేయస్‌కి ఇది మొదటి ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ కావడం విశేషం. చివరకు 228 బంతుల్లో 233 పరుగులు చేసిన తర్వాత అయ్యర్‌ను హర్షిత్ రాథోడ్ అవుట్ చేశాడు. ఈ నాక్ IPL 2025 వేలంలో అతని అవకాశాలను భారీగా పెంచుతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే అతను కోల్‌కతా నైట్ రైడర్స్ రిటైన్ లిస్టులో లేడు.

దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో, మెన్ ఇన్ బ్లూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బహుళ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నాడు. సూర్యకుమార్ 2021లో ఇంగ్లాండ్‌పై తన T20I అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 20 ఓవర్ మ్యాచ్‌లు 74 ఆడాడు. 169.48 స్ట్రైక్ రేట్‌తో 2,544 పరుగులు చేశాడు. అతని సగటు 42.40. సూర్య ఏజ్ ప్రస్తుతం 34 ఏళ్లు. పొట్టి ఫార్మాట్‌లో నాలుగు సెంచరీలు, 21 అర్ధసెంచరీలు చేశాడు.

ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చివరిగా బంగ్లాదేశ్‌తో జరిగిన T20I సిరీస్‌లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. అక్కడ మూడు ఇన్నింగ్స్‌లలో 37.33 సగటుతో 112 పరుగులు చేశాడు. రాబోయే 20 ఓవర్ల సిరీస్‌లో, భారత్-దక్షిణాఫ్రికా T20Iలలో అత్యధిక పరుగుల స్కోరర్‌గా మారడానికి సూర్యకుమార్ 107 పరుగులు చేయాల్సి ఉంది.

ప్రస్తుతం, భారత కెప్టెన్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఏడు T20I మ్యాచ్‌లలో 175.63 స్ట్రైక్ రేట్‌తో 346 పరుగులు చేశాడు. 20 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రొటీస్‌పై ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కాగా, డేవిడ్ మిల్లర్ 21 మ్యాచ్‌లలో 156.94 స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులతో టాప్ లో ఉన్నాడు.

భారత్-దక్షిణాఫ్రికా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించడంతో పాటు, టీ20ల్లో అత్యంత వేగంగా 150 సిక్సర్లు బాదిన ఆటగాడిగా స్కై కి అవకాశం లభించనుంది.

74 టీ20 మ్యాచ్‌లు, 71 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ 44 సిక్సర్లు బాదాడు. ఈ మైలురాయిని సాధించాలంటే నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతను 6 సిక్సర్లు బాదేయాల్సి ఉంది.

ఇవీ చదవండి: Dhoni Rohit Sharma: హిట్ మ్యాన్‌పై మహీ పొగడ్తలు.. ఏమన్నాడంటే
Rohit Sharma: కివీస్‌తో టెస్తు సిరీస్.. హిట్ మ్యాన్‌కు ఎందుకు కీలకం అంటే..
Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు