HomeCinemaAishwarya Rai: డైవర్స్ రూమర్స్ వేళ అభిషేక్‌-ఐష్ లపై న్యూస్ వైరల్

Aishwarya Rai: డైవర్స్ రూమర్స్ వేళ అభిషేక్‌-ఐష్ లపై న్యూస్ వైరల్

Aishwarya Rai: కొన్నాళ్లుగా అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ -ఐశ్వర్య రాయ్ ల పేర్లు నెట్టింట వైరల్ గా మారాయి. వీళ్లిద్దరూ వేరుగా ఉంటున్నారని సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త ఫ్యాన్స్ కు సంతోషాన్ని నింపుతోంది.

వీరిద్దరూ కలిసి మూవీ చేయనున్నట్లు సమాచారం. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం వారితో బిగ్ మూవీ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ చర్చల దశలో ఉందట. గతంలో అభిషేక్‌-ఐష్ (Aishwarya Rai) కలిసి చాలా మూవీల్లో నటించారు. వాటిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ చాలా స్పెషల్. వీరి పెళ్లికి కొన్ని రోజుల ముందు ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అందులో వీరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

మరోవైపు మణిరత్నం అంటే వీరిద్దరికీ చాలా మర్యాద. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో అభిషేక్‌, ఐష్ చెబుతూనే ఉంటారు. మణిరత్నం డైరెక్షన్ లో పనిచేయాలని అందరూ కోరుకుంటారని.. ఆయన సినిమాల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని అభిషేక్‌ (Abhishek Bachchan) చెప్పారు. తిరువర్‌, గురు, రావణ్‌, పొన్నియిన్‌ సెల్వన్‌.. వంటి గొప్ప మూవీల్లో మణిరత్నం తనకు అవకాశం కల్పించారని అభిషేక్ చెప్పారు. ఆయన నాకు గురువు సమానులంటూ ఐశ్వర్య చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు మణిరత్నం అడిగితే ఈ స్టార్‌లు ఇద్దరూ కాదనరని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్లాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఐష్- అభిషేక్ డైవోర్స్ తీసుకోనున్నారంటూ కొంతకాలంగా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ‘పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌’ వేదికగా పరోక్షంగా ఆ వార్తలకు ఐశ్యర్య ఫుల్ స్టాప్ పెట్టింది. వెడ్డింగ్‌ రింగ్‌ ధరించి ఈవెంట్‌కు వచ్చింది. అలాగే ముంబైలోని అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్ వార్షిక వేడుకలో అమితాబ్‌, అభిషేక్‌, ఐష్ కలిసి సందడి చేశారు.

ఇవీ చదవండి: Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ
Jacqueliene Fernandez: ఐల్యాండ్‌ను కొన్న హాట్ బ్యూటీ.. ఫొటో గ్యాలరీ
Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ
Mrunal Thakur hot: బాత్ టబ్బులో మృణాల్ హాట్ పోజులు.. విషయం అదా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు