Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించారు. రెండోసారి అగ్రపీఠంపై సగర్వంగా కూర్చున్న ట్రంప్.. (Donald Trump) తనను గత ఎన్నికల్లో ఓడించిన చోటే తన జెండా పాతాడు.
ట్రంప్ ఇప్పటికే అనేక పార్టీలు మారారు. తొలుత ఆయన రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలికారు. అనంతరం రిఫార్మ్ పార్టీకి వెళ్లారు. మూడేళ్ల తర్వాత డెమొక్రటిక్ పార్టీకి దగ్గరయ్యారు. 2001 నుంచి 2008 వరకు ట్రంప్ డెమొక్రాట్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే.
అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా తన విజయం ఖరారు అయిన తర్వాత ట్రంప్.. యూఎస్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. ప్రజలు తనను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని చెప్పారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి క్షణం ఎప్పుడూ చూడలేదన్నారు. అమెరికా ప్రజల కష్టాలు తీరుస్తానన్నారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానన్న ట్రంప్.. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గ్యారెంటీగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని చెప్పారు.
ట్రంప్ పొలిటికల్ హిస్టరీ
అమెరికా 47వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ వయసు 79 ఏళ్లు. ఆయన రెండో పర్యాయం అధ్యక్షుడు అయ్యారు. ట్రంప్ జూన్ 14, 1946న న్యూయార్క్ లోని క్వీన్స్‌లోని ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నే మాక్లియోడ్ ట్రంప్‌లకు దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. 1968లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పుచ్చుకున్నారు. కెరియర్ మొదట్లో వ్యాపారవేత్తగా రాణించాడు. అనంతరం పాలిటిక్స్ లోకి వచ్చి సత్తా చాటారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు 2024లో డెమోక్రటిక్ పార్టీ మహిళా అభ్యర్ధి కమలహారిస్‌పై విక్టరీ సాధించారు.
2020 ప్రెసిడెన్సియల్ ఎలక్షన్ లో బైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్.. రిపబ్లికన్ పార్టీపై తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. పట్టుబట్టి మళ్లీ ఈసారి అదే పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారంటే ఆయన సామర్థ్యం ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. 1885లో ట్రంప్ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పట్టు సాధించిన ఆయన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ స్ఫూర్తితో వ్యాపార రంగంలోకి ట్రంప్ అడుగిడాడు. భారత్ లోని ముంబై, పుణె నగరాల్లోనూ రియల్ వెంచర్లను ట్రంప్ ఓపెన్ చేశారు.
స్టార్ హోటళ్లు, ఎంటర్‌టైన్ మెంట్ ఛానళ్లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, బ్యూటీ కాంటెస్ట్ లు.. ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులతో ట్రంప్ తన సత్తా చాటారు. అమెరికన్ సంపన్నుల్లో కూడా ట్రంప్ ఒకరు. ఆయన సంపద 5 ట్రిలియన్ డాలర్లు ఉంది. ట్రంప్ గ్రూప్‌తో పాటు ట్రంప్ ఎంటర్‌టైనమెంట్ అండ్ రిసార్ట్స్ సంస్థకు ఆయనే సీఈవో. ట్రంప్ భార్య మెలినియా ట్రంప్. ట్రంప్ తన రెండో భార్యకు విడాకులు ఇచ్చారు. ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ 2022 జులై 14న మృతి చెందారు.
ఇవీ చదవండి: USA: అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్..
American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు
Paper Leak: మీకు తెలుసా? భారత్‌లో 2019 నుంచి 65 పేపర్ లీకేజీలు.. పూర్తి వివరాలు ఇవీ
Kyrgyzstan: కిర్గిస్తాన్‌లో హింస.. ఏపీ విద్యార్థులకు కీలక సూచనలు
Indian Students in US: అగ్రరాజ్యంలో ఉన్న మన విద్యార్థులు 2,69,000 మంది
Foreign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్!
