HomeCrime NewsCrime News: విద్యార్థిని తొడపై కొరికిన కీచక టీచర్! చెప్పుకోలేని చోట తాకుతూ..

Crime News: విద్యార్థిని తొడపై కొరికిన కీచక టీచర్! చెప్పుకోలేని చోట తాకుతూ..

Crime News: ఓ కీచక టీచర్ విద్యార్థినిపై కన్నేశాడు. లైంగికంగా వేధించాలని నిర్ణయించి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. విద్యార్థిని ఎవరికీ చెప్పుకోలే తీవ్రంగా ఇబ్బంది పడింది. (Crime News)

కీచక టీచర్ బాధిత విద్యార్థిని తొడ కొరికాడు. పైగా ఇంట్లో చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహపురం పాఠశాలలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 4 రోజుల నుంచి మూడో తరగతి విద్యార్ధినితో ఎస్జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. (Law)

చెప్పుకోలేని చోట తాకుతూ వేణుగోపాలరావు పైశాచిక ఆనందం పొందుతున్నాడు. బెంచి పై కూర్చోబెట్టి చిన్నారి తొడపై కొరికాడు. చిన్నారి ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరుకుతూ చిత్రహింసలు పెట్టాడు. ఆ తర్వాత ఇంట్లో చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.

విద్యార్ధిని తొడపై పంటిగాట్లను గమనించిన తల్లిదండ్రులు.. టీచర్ వేణుగోపాలరావు పై ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఎంఈవో పట్టించుకోకపోవడంతో కోడూరు పోలీసులను విద్యార్థిని తల్లిదండ్రులు ఆశ్రయించి కీచక టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతరాత్రి వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: AP Crime: తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో హత్యాచారాలు
Crime: టీనేజ్ అమ్మాయి విశృంఖలత్వం.. 19 మందికి ఒకేసారి హెచ్ఐవీ
Guntur Crime: దాష్టీకానికి మరో అమ్మాయి బలి… తెనాలి యువతి కన్నుమూత
Andhra Crime: ఇప్పటికైనా దిశ చట్టాన్ని అమలు చేయాలి
AP Crime News: బద్వేలులో విద్యార్థినిపై అఘాయిత్యం అనాగరిక చర్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు