CPM: తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి ప్రజల్ని బాదుతున్నాయని సీపీఎం (CPM) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. ట్రూ అప్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం వారం క్రితం రూ.6 వేల కోట్లు భారం మోపిందన్నారు. వారం తిరగకుండానే రూ.11 వేల కోట్ల భారం మోపుతోందన్నారు.
5 నెలల కాలంలో రూ.17 వేల కోట్లు భారం జనంపై కూటమి ప్రభుత్వం వేసిందన్న బాబూరావు.. అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడా మాటలు మర్చిపోయాడన్నారు. యూనిట్ రూపాయి 90 పైసలు కానీ ట్రూ ఆప్ చార్జీలు అదనంగా రూ.4 వసూలు చేస్తున్నారన్నారు.
గత ప్రభుత్వానిది బాధ్యత అని తోసేస్తున్నారని, అధికారంలో ఉన్నది మీరు అని గుర్తు పెట్టుకోవాలన్నారు. కరెంట్ లో రేట్లు పెంచడం కాదు.. తగ్గించి చూపించడండి అని హితవు పలికారు. ట్రూ ఆప్ చార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 8 నుంచి 14 వరకు ఆందోళన చేస్తామన్నారు.14వ తేదీన కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే మరో బషీర్ బాగ్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
చార్జీల బాదుడు దుర్మార్గం: రామకృష్ణ
సర్దుబాటు ఛార్జీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-24 విద్యుత్ వినియోగంపై సర్దుబాటు ఛార్జీల వాదుడుకి సిద్దమవ్వడం దుర్మార్గం అన్నారు. రెండేళ్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో దాదాపు రూ.17 వేల కోట్ల బాదుడు ప్రజలపై గుడిబండేనన్నారు.
2022-23 సంవత్సరానికి రూ.6,072 కోట్ల వసూలు అమల్లోకి రాకుండానే, 2023-24 కరెంట్ సర్దుబాటు భారం తగదన్నారు. తాము అధికారం చేపడితే ప్రజలపై విద్యుత్ భారం మోపబోమని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం విస్మరించడమేనన్నారు. విద్యుత్ భారాలను విరమించుకోకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈనెల 7వ తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
ఇవీ చదవండి: Power Bills: కూటమి ప్రభుత్వంలో బాదుడే బాదుడు
Essential commodities: ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ భేటీ
Perni Venkataramaiah: జగన్ సంపద సృష్టిస్తే.. కూటమి నేతలు ఏం చేస్తున్నారో తెలుసా?
Kakani Govardhan Reddy: ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్
